హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గచ్చిబౌలి టిమ్స్‌లో పూర్తిస్థాయి కరోనా వైద్యం: మందుల కంటే ఆక్సిజనే ముఖ్యం: ఈటెల

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రోగుల కోసం గాంధీ ఆస్పత్రి ప్రత్యేకంగా పనిచేస్తోందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టిమ్స్‌(తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)ను కూడా కరోనా ఆస్పత్రిగా మార్చాయని, ఇప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.

టిమ్స్‌లో పూర్తిస్థాయి కరోనా వైద్యం..

టిమ్స్‌లో పూర్తిస్థాయి కరోనా వైద్యం..

ఆదివారం టిమ్స్‌ను మంత్రి ఈటెల రాజేందర్ సందర్శించారు. కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆయన ఆరా తీశారు. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటీన్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టిమ్స్‌లో 1350 బెడ్ల సౌకర్యం ఉందని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, వెంటిలేటర్లతో కూడిన సదుపాయాలు ఉన్నాయని తెలిపారు.

కరోనా సోకితే ఆలస్యం చేయొద్దు..

కరోనా సోకితే ఆలస్యం చేయొద్దు..


రోగుల భద్రత, నర్సింగ్ సిబ్బంది, ఔషధాలను కూడా సమకూరుస్తామని వెల్లడించారు. లక్షణాలు కనిపించగానే ఆస్పత్రిలో చేరాలని, కొందరు నాలుగైదు రోజుల ఆలస్యం చేస్తున్నారని అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చి, శ్వాస ఇబ్బంది కలిగితే తక్షణమే ఆస్పత్రిలో చేరాలని సూచించారు. కరోనా లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే వందశాతం కరోనా బారి నుంచి బయటపడతారని స్పష్టం చేశారు.

కరోనా వైద్యం ఖరీదైనది కాదు..

కరోనా వైద్యం ఖరీదైనది కాదు..

కరోనా చికిత్స ఖరీదైనది కాదని, ఆక్సిజన్, మందులన్నీ కలిపితే కూడా రూ. 10వేలు మించి కాదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రోజుకు లక్ష, రెండు లక్షలు ఖర్చు అయ్యే చికిత్స అసలు లేదని చెప్పారు. బాధ్యతారహితంగా వ్యవహరించి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని జిల్లాల్లో ఐసీయూ, చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Recommended Video

తల్లిదండ్రులని ఒకే రోజు లో కోల్పోయిన యువకుడు | Private Hospitals దుర్మార్గం || Oneindia Telugu
కరోనా చికిత్సలో మందుల కంటే ఆక్సిజనే ముఖ్యం..

కరోనా చికిత్సలో మందుల కంటే ఆక్సిజనే ముఖ్యం..


హైదరాబాద్ నగరంలోని చెస్ట్, ఫీవర్ ఆస్పత్రి, కింగ్ కోఠి ఆస్పత్రిలో కావాల్సినన్ని బెడ్లు ఉన్నాయని మంత్రి ఈటెల తెలిపారు. రాష్ట్రంలో పలు ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో ఆక్సిజన్ సిలిండర్లు దొరికినా దొరక్కపోయినా ఇబ్బంది ఉండదన్నారు. టిమ్స్, సరోజిని కంటి ఆస్పత్రి, కింగ్ కోఠి, ఫీవర్ ఆస్పత్రి, చెస్ట్ ఆస్పత్రి, ఉస్మానియా ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేస్తామని మంత్రి ఈటెల తెలిపారు. కరోనా రోగికి మందుల కంటే ఆక్సిజన్ చాలా ముఖ్యమని, ఆగస్టు 10లోగా లిక్విడ్ ఆక్సిజన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని మంత్రి ఈటెల రాజేందర్ వివరించారు.

English summary
Telangana Health Minister Etela Rajender visited Telangana Institute of Medical Sciences (TIMS) hospital in Gachibowli on Sunday, August 2. The minister said that COVID-19 treatment is not expensive in government hospitals and it costs less than Rs 10,000.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X