హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించిన సురేష్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఫోర్బ్స్ లిస్టులో మరో హైదరాబాదీకి చోటు దక్కింది. హైదరాబాద్ కు చెందిన యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్ సంస్థ క్రియేటివ్ మెంటర్స్ అధినేత కొవ్వూరి సురేశ్ రెడ్డి ఫోర్బ్స్ ఇండియా ప్రచురించిన కోటీశ్వరుల లిస్టులో చోటు దక్కించుకున్నారు. 30ఏళ్ల లోపున్న 30 మంది ప్రతిభావంతుల జాబితాలో ఆయన ఒకరిగా నిలిచారు.

సురేశ్ రెడ్డికి పలువురి ప్రశంసలు
కంపెనీని స్థాపించిన 13 ఏళ్లలో అతిచిన్న వయసులో సురేశ్ రెడ్డి ఫోర్బ్స్ లిస్టులో చోటు దక్కించుకోవడంపై పలువురు ప్రశంసలు కురిపించారు. చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన సురేశ్ కృషి, పట్టుదల అభినందనీయమని అన్నారు.

creative mentors kovvuri suresh reddy makes into forbes list

జీవితంలో మరచిపోలేని అనుభూతి
ఫోర్బ్స్ లిస్టులో చోటు సంపాదించడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి అన్నారు సురేశ్ రెడ్డి. చిన్న వయసులోనే సినీ రంగంలో గొప్ప పేరు సాధించిన ప్రముఖ డైరెక్టర్, నిర్మాత ఎల్ వీ ప్రసాద్ స్పూర్తిగా క్రియేటివ్ మెంటర్స్ సంస్థ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆసియాలోనే తొలిసారిగా కేబుల్స్ లేకుండా మోషన్ క్యాప్చర్ యానిమేషన్ సృష్టించిన ఘనత తమ కంపెనీ సొంతమన్న ఆయన.. ఇప్పటి వరకు తమ వద్ద శిక్షణ పొందిన 3వేల మంది విద్యార్థులు సినిమా రంగంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారని చెప్పారు. డాక్టర్ పీ శ్యామరాజు, రతన్ టాటా, రాహుల్ బజాజ్, శివనాడార్, యదూపాటి సింఘానియా, కుమార మంగళం బిర్లా, అనిల్ రాయ్ గుప్తా, ఆనంద్ మహీంద్రా తదితర 51 మంది ప్రముఖ వ్యాపారుల మధ్య తన పేరు ఉండటం ఎంతో ఉత్సాహాన్నిస్తోందని సురేశ్ సంతోషం వ్యక్తంచేశారు.

English summary
Kovvuri Suresh Reddy who entered into business founding ‘Creative Mentors’ has made into the Forbes list in a very short time, 13 years since he started ‘Creative Mentors’. Recently ‘Forbes’ has announced a list of 30 influential people whose age is below 30 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X