హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైతే రాజు: అన్నదాత ప్రయోజనం కోసమే పంటమార్పిడి: మంత్రి హరీశ్ రావు

|
Google Oneindia TeluguNews

రైతుబంధు పథకం దేశానికి ఆదర్శం అని ఆర్థికమంత్రి హరీశ్ రావు తెలిపారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అర్థం పర్థం లేకుండా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. రైతు బంధు ఆపాలని ప్రభుత్వానికి లేదు అని, ఎన్ని కోట్లు ఖర్చు చేయడానికి సిద్దంగా ఉందని వివరించారు. రైతులు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనం కోసం పంట మార్పిడి విధానం తీసుకొచ్చామని తెలిపారు. రైతులచే ఎంపిక చేసిన పంటుల వేయించాల్సిన బాధ్యత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులదేనని స్పష్టంచేశారు. కో ఆపరేటివ్ చైర్మన్ల బాధ్యత తీసుకోవాలని సూచించారు. శనివారం హరీశ్ రావు సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడారు.

coronavirus: టోకెన్ ఆధారంగా పంటల కొనుగోలు, రైతులు సహకరించాలి: మంత్రి హరీశ్ రావు coronavirus: టోకెన్ ఆధారంగా పంటల కొనుగోలు, రైతులు సహకరించాలి: మంత్రి హరీశ్ రావు

సాగుకు ముందే ఫర్టిలైజర్

సాగుకు ముందే ఫర్టిలైజర్


ఒక పంట వేస్తే దిగుబడి తగ్గడంతోపాటు భూమిలో సారం ఉండదని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రతీ గ్రామంలో పంట సాగుకు ముందే ఫర్టిలైజర్ తీసుకెళ్లాలని సూచించారు. అందరికీ చేరేలా రైతు సమన్వయ సమితి, సహకార సంఘాల చైర్మన్లు, స్థానిక ప్రతినిధులు చొరవ తీసుకోవాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు కూడా గ్రామ గ్రామానికి వెళ్లి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సంగారెడ్డి నేలల్లో బాస్వరం, పొటాషియం ఎక్కువగా ఉందని...రైతులు ఇది గమనించి వీటిని తగ్గించేలా ఏఈఓలు కృషి చేయాలని సూచించారు.

6.38 లక్షల ఎకరాల్లో పంట

6.38 లక్షల ఎకరాల్లో పంట


సీఎం కేసీఆర్ ఆలోచనలకు సంగారెడ్డి జిల్లా దగ్గరగా ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లాలో 6.38 లక్షల ఎకరాల్లో పంట సాగవుతోందని తెలిపారు. వానకాలంలో కాక యాసంగిలో మక్క పంట వేయాలన్నారు. కానీ వానకాలంలో మాత్రం పంట మార్పిడి తప్పకుండా జరగాలని అభిప్రాయపడ్డారు. జిల్లాలో ఎక్కువగా పత్తి సాగు చేస్తారని.. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తామని తెలిపారు. గతేడాది 3.60 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారని.. ఈ సారి మరో పదిహేను వేల ఎకరాల్లో పంట సాగవుతుందని చెప్పారు. వానాకాలంలో కంది , పెసర, పప్పు దినుసులు వేయాలపి.. యాసంగిలో మక్క వేస్తే.. వడగళ్లు వచ్చినా ఇబ్బంది ఉండదని చెప్పారు.

Recommended Video

BJP MP Dharmapuri Arvind Slams KCR And Kavitha Over Nizamabad MLC Elections
రైతుబంధు వేదికల నిర్మాణం

రైతుబంధు వేదికల నిర్మాణం

సంగారెడ్డి జిల్లాలో 116 రైతు బంధు వేధికలు నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ నిధులు అందజేశారని తెలిపారు. ఒక్కో వేదిక కోసం రూ.20 లక్షల చొప్పున ఇచ్చారన్నారు. భవిష్యత్తులో రైతుబంధు వేదికలదే ప్రధాన పాత్ర అని తెలిపారు. యాసంగి పంట వేసే నాటికి రైతు బంధు వేదికలు నిర్మాణం జరగాలని.. సంగారెడ్డి జిల్లాలో ఒకేరోజు రైతుబంధు వేదికలకు ప్రారంభోత్సవాలు జరిగేలా చూడాలని అధికారులను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు.

English summary
Crop exchange help to telangana farmers minister harish rao said in sangareddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X