హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కంచె చేను మేసింది.. కస్టోడియనే కాజేశాడు, రూ.9 లక్షలు చోరీ,

|
Google Oneindia TeluguNews

కంచె చేను మేసింది. అవును రక్షించాల్సిన భక్షకుడు కాజేశాడు. నగదు డిపాజిట్ చేసినట్టు చేసి.. దొంగిలించాడు. అతని స్నేహితుడి సాయంతో చోరి చేశాడు. ఒక్కటి కాదు రెండు రూ.9 లక్షలు మాయం కావడంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఖాకీలు.. కస్టోడియన్ వివరాలు ఆరాతీయగా జరిగిన చోరీ వెలుగుచూసింది. ఇద్దరీ నుంచి తస్కరించిన నగదును అధికారులు రికవరీ చేశారు.

బీ అలర్ట్.. 24 గంటల భారత్ బంద్..ఏటీఎం సెంటర్లపై ఎఫెక్ట్..ఎందుకు చేస్తున్నారు? ఎంత మంది పాల్గొంటారు?బీ అలర్ట్.. 24 గంటల భారత్ బంద్..ఏటీఎం సెంటర్లపై ఎఫెక్ట్..ఎందుకు చేస్తున్నారు? ఎంత మంది పాల్గొంటారు?

ఇద్దరు కలిసి..

ఇద్దరు కలిసి..

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం బసువుపల్లికి చెందిన చదర్ల వినయ్‌ ఉప్పల్‌ శాంతినగర్‌లో ఉండేవాడు. అయితే ఆయన సికింద్రాబాద్‌ సెక్యూర్‌ వ్యాల్యూ ఇండియా లిమిటెడ్‌లో కస్టోడియన్‌గా పనిచేస్తున్నాడు. బ్యాంక్ ఏటీఎంలలో నగదు డిపాజిట్‌ చేస్తుండేవాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల గ్రామానికి చెందిన కొండా రాఘవేందర్‌గౌడ్‌ బేగంపేట భవాని బాయ్స్‌ హాస్టల్‌లో ఉండేవాడు. ఏటీఎంలలో డబ్బు డిపాటిట్‌ చేసి సికింద్రాబాద్‌ ప్రకాష్ నగర్‌లోని రైటర్‌ సేఫ్‌గార్డ్‌లో పనిచేశాడు. వినయ్, రాఘవేందర్‌గౌడ్‌ ఇద్దరు స్నేహితులు.

ఉద్యోగం కోల్పోవడంతో..

ఉద్యోగం కోల్పోవడంతో..

కరోనా వైరస్ వల్ల రాఘవేందర్‌గౌడ్‌ ఉద్యోగం మానేశాడు. ఏటీఎంలో నగదు కాజేయాలని ఇద్దరు కలిసి ప్రణాళిక రచించారు. ఈ నెల 11వ తేదీ ఉదయం వినయ్‌, తన సహోద్యోగి కాకళ్ల లింగస్వామితో కలిసి హయత్‌నగర్‌ బొమ్మలగుడి, రాజరాజేశ్వరి కాలనీలో గల హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ ఏటీఎంలో రూ. 13 లక్షల నగదు డిపాజిట్‌ చేశారు. మరుసటి రోజు సాయంత్రం వినయ్‌ సదరు ఏటీఎం సేఫ్‌ డోర్‌ కాంబినేషన్‌ను రాఘవేందర్‌కు అందజేశాడు. 13వ తేదీన రాఘవేందర్‌గౌడ్‌ ఏటీఎం సేఫ్‌డోర్‌ కాంబినేషన్‌ ఉపయోగించి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏటీఎం నుంచి రూ. 9 లక్షలు తీశాడు. వారిద్దరూ ఆ డబ్బును పంచుకున్నారు.

Recommended Video

Sushant Singh Rajput : సుశాంత్ సూసైడ్ కేసు..మహారాష్ట్ర పోలీసులకు సుప్రీం మొట్టికాయ!
రంగంలోకి క్రైం టీం..

రంగంలోకి క్రైం టీం..

ఏటీఎం నుంచి నగదు దొంగిలించారని బ్యాంకు అధికారులు హయత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగార్జున.. క్రైమ్‌ టీం రంగంలోకి దిగి సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఏటీఎం సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారే చోరీ చేసి ఉండొచ్చని భావించారు. కస్టోడియన్‌ వివరాలను సేకరించారు. నిందితులను ఉప్పల్‌లో గురువారం విచారించారు. నేరం అంగీకరించడంతో వినయ్‌ నుంచి రూ. 4.48 లక్షలు, రాఘవేందర్‌గౌడ్‌ నుంచి రూ. 4.47 లక్షల నగదు రికవరీ చేశారు.

English summary
custodian vinay and raghavendar theft rs 9 lakhs in atm in uppal hdfc bank. police recovered the money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X