హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Gold: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా పట్టుబడిన బంగారం..

|
Google Oneindia TeluguNews

అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా విదేశాల నుంచి గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. నిత్యం ఎవరో ఒకరు విదేశాల నుంచి బంగారం తీసుకొస్తూ దొరికిపోతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కొందరు ప్రయాణికులు విదేశాల నుంచి పుత్తిడి తీసుకొస్తూ అధికారులకు పట్టుపడ్డాడు. దీంతో అతని అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ముగ్గురు ప్రయాణికులు
దుబాయ్‌ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులను పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్న అధికారులు తనిఖీలు నిర్వహించారు. వారి లగేజీని తనిఖీ చేయగా కడ్డీల రూపంలో అక్రమంగా తరలిస్తున్న 7 కిలోలకు పైగా బంగారాన్ని గుర్తించారు. ఆ పుత్తడిని స్వాధీనం చేస్కున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు మూడున్నర కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

Customs officers caught gold being smuggled at Shamshabad Airport

కేసు నమోదు
నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్‌ డిప్యూటీ కమిషనర్‌ అశోక్‌ చెప్పారు. అనుమతి లేకుండా విదేశాల నుంచి బంగారం తీసుకొస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. విదేశాల నుంచి గోల్డ్ తీసుకొస్తే దానికి సంబంధించిన పత్రాలను చూపాలన్నారు.

English summary
Smuggling of gold from abroad is not stopping. Recently, some passengers were caught by the authorities while bringing gold from abroad at Shabad Airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X