హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనాను వాడేస్తున్న సైబర్ నేరగాళ్ళు ... తస్మాత్ జాగ్రత్త

|
Google Oneindia TeluguNews

మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసే వాళ్ళు ఉంటారు . ఇక కరోనా వైరస్ ప్రబలుతున్న సమయంలో కూడా మోసగాళ్ళు తమ టాలెంట్ చూపిస్తూనే ఉన్నారు. ప్రజలను బకరాలు చేస్తూనే ఉన్నారు. మోసగాళ్లు తమకు దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ప్రపంచమంతా కరోనా వైరస్ తో భయపడుతున్న తరుణంలో న్యూస్ రూపంలో సైబర్ నేరగాళ్ళు ప్రజలను వాటిని ఓపెన్ చేసేలా చేసి వారి మొబైల్ లోనూ, కంప్యూటర్ లోనూ ఉన్న సమాచారాన్ని దోచుకుంటున్నారు. అందులో బ్యాంకులకు సంబంధించిన సమాచారం ఉంటే ఇక బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసేస్తారు.

కరోనా వార్డుల్లో విధులు నిర్వర్తించలేము .. మాకు రక్షణ లేదంటున్న గాంధీ ఆస్పత్రి సిబ్బందికరోనా వార్డుల్లో విధులు నిర్వర్తించలేము .. మాకు రక్షణ లేదంటున్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది

ఫేక్ మెయిల్స్ పంపి మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ళు

ఫేక్ మెయిల్స్ పంపి మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ళు

ప్రపంచం అంతా ఇప్పుడు కరోనా వైరస్ భయంతో దానికి సంబంధిచిన ఏ న్యూస్ వచ్చినా ఆతృతగా చూస్తున్నారు. అయితే ఇదే అవకాశంగా మలుచుకున్నసైబర్ మోసగాళ్లు కరోనా వైరస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటూ మెయిల్స్ పంపించి మోసం చేస్తున్నారు . దీనిని గుర్తించిన తెలంగాణ పోలీసులు జాగ్రత్తగా ఉండాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక దీనిపై ఓ ప్రకటన విడుదల చేసారు పోలీసులు.

అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

మీకు కేంద్ర వ్యాధి నియంత్రణ సంస్థ , ప్రపంచ ఆరోగ్య సంస్థల నుండి అంటూ మెయిల్ పంపిస్తూ దోపిడీ చేస్తున్న సైబర్ నేరగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు పోలీసులు . మీకు కేంద్ర వ్యాధి నియంత్రణ సంస్థ , ప్రపంచ ఆరోగ్య సంస్థల నుండి మెయిల్స్ రావొచ్చు. ఈ మెయిల్ కి "Safety Precautions" పేరుతో ఒక ఫైల్ అటాచ్మెంట్ ఉండవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి మెయిల్ గాని, అటాచ్మెంట్ ఫైల్ గానీ క్లిక్ చేయవద్దు అని హెచ్చరిస్తున్నారు.

బ్యాకు ఖాతాలు గల్లంతు అయ్యే అవకాశం ఉందన్న పోలీసులు

బ్యాకు ఖాతాలు గల్లంతు అయ్యే అవకాశం ఉందన్న పోలీసులు

పొరబాటున ఆ అటాచ్మెంట్ పై క్లిక్ చేశారంటే మీ కంప్యూటర్ లో లేదా ఫోన్లో ఉన్న సమాచారం, బ్యాంక్ ఖాతా వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తాయి జాగ్రత్త అని చెబుతున్నారు. ఇక ఈ మెయిల్ ఐడీ [email protected] ఇదే అని చెప్తున్నారు. అలాంటి మెయిల్స్ విషయంలో జాగ్రత్త వహించాలని తెలంగాణ రాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. అప్రమత్తంగా లేకుంటే అసలే కష్ట కాలంలో ఉన్న కొద్దిపాటి డబ్బులు సైబర్ నేరగాళ్ళ ఖాతాకు చేరతాయని చెప్తున్నారు .

English summary
The whole world is now anxiously awaiting any news related to the corona virus. However, cyber fraudsters who use this opportunity are cheating by sending e-mails to warn against coronavirus. Recognizing this, Telangana police are urging caution. A statement has been issued by the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X