హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సైబ‌ర్ ట‌వ‌ర్స్ : బాబు కాదా: కేసీఆర్ చెప్పిందే వాస్త‌వ‌మా: స‌జీవ సాక్ష్యం..ఇదేనా నిజం..!

|
Google Oneindia TeluguNews

చిత్రం..ద పిక్చ‌ర్. ఇప్పుడు ఓ ఫొటో సంచ‌ల‌నం గా మారింది. ఓ పేప‌ర్ క్లిప్పింగ్ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల మ‌ధ్య సాగుతు న్న భిన్న వాద‌న‌ల‌కు ఇప్పుడు సాక్షిగా నిలుస్తోంది. హైద‌రాబాద్‌లో సైబ‌ర్ ట‌వ‌ర్స్ త‌న గొప్ప‌త‌నమే అంటూ చంద్ర‌బాబు చెప్పుకొంటుంటే..కాదు, సైబ‌ర్ ట‌వ‌ర్స్ కు శంకుస్థాపన చేసింది నాటి ముఖ్య‌మంత్రి నేదురుమ‌ల్లి జ‌నార్ధ‌న‌రెడ్డి అంటూ కేసీఆర్ అస‌లు విష‌యాన్ని బ‌య‌ట పెట్టారు. ఇంత‌లో ఓ పేప‌ర్ క్లిప్పింగ్ ఫొటో బ‌య‌ట ప‌డింది..ఇప్పుడు అది సంచ‌ల నం గా మారుతోంది...అస‌లైన చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌వుతోంది..

సైబ‌ర్ ట‌వర్స్ ఘ‌న‌త ...ఎవ‌రికి ద‌క్కుతుంది..

సైబ‌ర్ ట‌వర్స్ ఘ‌న‌త ...ఎవ‌రికి ద‌క్కుతుంది..

హైద‌రాబాద్ లో సైబ‌రాబాద్ నిర్మాణానికి నాంది మాదాపూర్ లోని సైబ‌ర్ ట‌వ‌ర్స్. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుగా ఉన్న ఆ స‌మ‌యంలోనే 1995 నుండి 2004 వ‌ర‌కు హైద‌ర‌బాద్‌లో ఐటిని అభివృద్ది చేసాన‌ని చంద్ర‌బాబు..టిడిపి నేత‌లు ప‌దేప‌దే చెబుతూ ఉంటారు. అయితే, అస‌లు ఐటి కి హైద‌రాబాద్‌లో అంత ప్రాముఖ్య‌త లభించ‌టానికి కార‌ణం అక్క‌డి వాతావ‌ర‌ణ మేన‌ని ప‌లుమార్లు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెబుతూ వ‌చ్చారు.

తాను ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే సైబ‌ర్ ట‌వ‌ర్స్ నిర్మాణం జ‌రిగింద‌ని చంద్ర‌బాబు చెబుతుంటే..కాదు, అస‌లు ఆ ట‌వ‌ర్స్ కు శంకుస్థాప‌న చేసింది కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి నేదురుమ‌ల్లి జ‌నార్ధ‌న‌రెడ్డి అని తాజాగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీనికి కౌంట‌ర్ గా చంద్రబాబు స్పందిం చారు. నేదురుమ‌ల్లి ఎప్పుడు శంకుస్థాప‌న చేసారో త‌న‌కు తెలియ‌ద‌ని..రాజీవ్ గాంధీ ప్ర‌ధాని గా ఉన్న స‌మ‌యంలో ఏపిలో నేదురుమ‌ల్లి ముఖ్య‌మంత్రిగా లేరంటూనే..అస‌లు సైబ‌ర్ ట‌వ‌ర్స్ శంకుస్థాప‌న విష‌యాన్ని మాత్రం దాట‌వేసారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణ మంత్రులు మాత్రం..నేదురుమ‌ల్లి శంకుస్థాప‌న చేసిన సాక్ష్యాల‌ను బ‌ట‌య పెడ‌తామ‌ని చెప్పారు.

నేదురుమ‌ల్లి శంకుస్థాప‌న చేసింది నిజ‌మేనా..మ‌రి..బాబు..

నేదురుమ‌ల్లి శంకుస్థాప‌న చేసింది నిజ‌మేనా..మ‌రి..బాబు..

మాదాపూర్‌లో సైబ‌ర్ ట‌వ‌ర్స్ కు శంకుస్థాప‌న చేసింది నాటి ముఖ్య‌మంత్రి నేదురుమ‌ల్లి జ‌నార్ధ‌న‌రెడ్డి అని తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పుకొచ్చారు. అది చంద్రబాబు ఘ‌న‌త కాద‌ని..రాజీవ్ గాంధీ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యం లో అంత‌ర్జాతీయంగా పేరున్న ఐటి సంస్థ‌లు త‌మ‌కు చెందిన బ్యాక‌ప్ టెక్నాల‌జీని భ‌ద్రంగా ఉంచుకొనేం దుకు వాతావర‌ణ ప‌రంగా అనువైన ప్ర‌దేశం కోసం ప్ర‌పంచం మొత్తం తిరిగార‌ని..ఆ స‌మ‌యంలో హైద‌రాబాద్ సుర‌క్షిత ప్రాంతంగా గుర్తించారి కేసీఆర్ వివ‌రించారు. ద‌క్షిణ పీఠ‌భూమిగా హైద‌రాబాద్ తుఫాన్లు...

భూ కంపాల‌కు దూర‌మ‌ని.. అక్క‌డ ప్రకృతి వైప‌రీత్యాల‌కు అవ‌కాశం లేద‌ని గుర్తించిన త‌రువాత‌నే ఆ సంస్థ‌లు హైద‌రాబాద్ లో త‌మ ముఖ్య కార్యాల‌యాల ఏర్పాటు పై నాటి ప్ర‌ధాని రాజీవ్ గాంధీ తో సంప్ర‌దింపులు జ‌రిపార‌ని..ఆయ‌న సూచ‌న మేర‌కు ఏపి ముఖ్య‌మంత్రి గా వ్య‌వ‌హ‌రించిన నేదురుమ‌ల్లి తొలి సారిగా మాదాపూర్ లో సైబ‌ర్ ట‌వ‌ర్స్ కు శంకుస్థాప‌న చేసార‌ని కేసీఆర్ వివ‌రించారు. అది చంద్ర‌బాబు గొప్ప‌త‌నం కాద‌ని..ఆ త‌రువాత ఐటి విస్త‌ర‌ణ లో భాగంగా..హైద‌రాబాద్ కు కంపెనీలు త‌ర‌లి వ‌చ్చాయ‌న్న‌ది కేసీఆర్ వాద‌న‌.

తాజా క్లిప్పింగ్ క‌ల‌క‌లం..టిడిపి నేత‌ల స్పంద‌న ఏంటో..

తాజా క్లిప్పింగ్ క‌ల‌క‌లం..టిడిపి నేత‌ల స్పంద‌న ఏంటో..

ఇక‌, సైబ‌ర్ ట‌వ‌ర్స్ కు సంబంధించి కేసీఆర్‌..చంద్ర‌బాబు మ‌ధ్య మాట‌ల తూటాలు పేలిన త‌రువాత‌..తెలంగాణ మం త్రులు రంగంలోకి దిగారు. నేదురుమ‌ల్లి సైబ‌ర్ ట‌వ‌ర్స్ కు శంకుస్థాప‌న చేసిన సాక్ష్యాలు బ‌య‌ట‌పెడ‌తామని ప్ర‌క‌టిం చారు. ఇందులో భాగంగా.. 1992 లో నేదురుమ‌ల్లి ముఖ్య‌మంత్రి గా మాదాపూర్ లో రాజీవ్ గాంధీ సాఫ్ట్ వేర్ టెక్నాల‌జీ పార్క్‌కు శంకుస్థాప‌న చేస్తున్న ఓ ప‌త్రిక క్లిప్పింగ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఆ చిత్రంలో నాటి ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి పి రామ‌చంద్రారెడ్డి సైతం ఉన్నారు. ఈ చిత్రం ఆధారంగా కేసీఆర్ చెప్పిన విధంగా నేదురుమ‌ల్లి సైబ‌ర్ ట‌వ‌ర్స్ కు శంకు స్థాప‌న చేసిన విష‌యానికి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. టిడిపికి మ‌ద్ద‌తుగా ఉంటుంద‌నే ప్ర‌చారంలో ఉన్న ప‌త్రిక‌..ఏపి ముఖ్య మంత్రి న‌మ్మే ప‌త్రిక‌గా ప్ర‌చారం లో ఉన్న ప‌త్రిక‌లోనే ఈ వార్త రావ‌టం..ఇప్పుడు అదే ప్ర‌చారంలో పెట్ట‌టం తో ఇప్పు డు టిడిపి నేత‌లు ఏ ర‌కంగా స్పందిస్తారో చూడాలి..

English summary
Different arguments between KCR and Chandra Babu on Cyber towers foundaiton in Madhapur. Now a paper clipping proving that KCR argument in correct. Ex Cm Nedurumalli janardhan reddy laid foundation for cyber towers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X