హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Encounter: వీడియో: ఎన్ కౌంటర్ ప్రాంతాన్ని పరిశీలించిన సైబరాబాద్ సీపీ సజ్జన్నార్..డీజీపీకి ఫోన్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Disha Issue : బ్రేకింగ్ : నిందితుల ఎన్ కౌంటర్... EXCLUSIVE ఎన్ కౌంటర్ వీడియో

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ శుక్రవారం ఉదయం షాద్ నగర్ చేరుకున్నారు. షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి ఫ్లైఓవర్ వద్ద ఈ తెల్లవారు జామున చోటు చేసుకున్న ఎన్ కౌంటర్ ప్రదేశాన్ని ఆయన పరిశీంచారు. ఈ సమయంలో ఆయన వెంట షాద్ నగర్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ విభాగం కానిస్టేబుళ్లు, శంషాబాద్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ప్రకాష్ రెడ్డి, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సహా పలువురు పోలీసులు ఉన్నారు.

 Disha murder: సజ్జనార్ మార్క్ ... చటాన్ పల్లి ఎన్ కౌంటర్ ... నాటి వరంగల్ ఎన్ కౌంటర్ సీన్ రిపీట్ Disha murder: సజ్జనార్ మార్క్ ... చటాన్ పల్లి ఎన్ కౌంటర్ ... నాటి వరంగల్ ఎన్ కౌంటర్ సీన్ రిపీట్

ఎన్ కౌంటర్ ఎలా జరిగిందంటూ..

ఎన్ కౌంటర్ ఎలా జరిగిందంటూ..

తెల్లవారు జామున 5:30 గంటల సమయంలో సజ్జన్నార్.. తన నివాసం నుంచి షాద్ నగర్ కు బయలుదేరి వెళ్లారు. నేరుగా చటాన్ పల్లి ఫ్లైఓవర్ కింద చోటు చేసుకున్న ఎన్ కౌంటర్ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి పరిస్థితుల్లో ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ కౌంటర్ ఎలా జరిగిందంటూ ఆరా తీశారు. తమపై దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్ కౌంటర్ చేశామని పోలీసులు వివరించారు.

చటాన్ పల్లి వద్దే..

చటాన్ పల్లి వద్దే..


వెటర్నరి డాక్టర్ దిశపై లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా పని చేస్తోన్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మహమ్మద్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులు అత్యాచారానికి తెగబడిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెను హత్య చేశారు. షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి ఫ్లైఓవర్ కింద ఈ ఘటన చోటు చేసుకోగా.. అదే ప్రాంతంలో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.

ఎన్ కౌంటర్ ఘటనపై డీజీపీకి..

ఎన్ కౌంటర్ ఘటనపై డీజీపీకి..

షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి ప్లైఓవర్ వద్ద శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో చోటు చేసుకున్న ఎన్ కౌంటర్ ఘటన వెనక గల కారణాలను సజ్జన్నార్ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే సజ్జన్నార్.. తన నివాసం నుంచే డీజీపీకి ఫోన్ లో మాట్లాడినట్లు చెబుతున్నారు. అనంతరం షాద్ నగర్ బయలుదేరి వెళ్లారని సమాచారం.

డీజీపీకి నివేదిక..

ఎన్ కౌంటర్ ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయంపై ఓ సమగ్ర నివేదికను ఆయన డీజీపికి అందజేయనున్నట్లు తెలుస్తోంది.
సీన్ రీకన్ స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారని, ఆ సమయంలో పోలీసులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. దాడి చేశారని వివరించారు. దీనితో తాము ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.

English summary
Cyberabad Polie Commissioner VC Sajjannar and Senior Police officials arrive at the site of the encounter. All four accused in the rape and murder of woman veterinarian in Telangana were killed in an encounter with the police when the accused tried to escape while being taken to the crime spot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X