తెలంగాణలో కరోనా కల్లోలం: 4 వేల వరకు చేరిన కేసులు
తెలంగాణలో కరోనా కేసులు కలవరానికి గురిచేస్తోన్నాయి. రోజుకు 4 వేల కేసుల వరకు వస్తోన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 3వేల 980 కేసులు వచ్చాయి. మరో ముగ్గురు కరోనా వైరస్‌తో మృతి చెందారు. నిన్న ఒక్కరోజే 2 వేల 398 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 33 వేల 673 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 94.89 శాతంగా ఉంది.
గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 97 వేల 113 కోవిడ్ టెస్టులు చేశారు. తాజాగా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,439 కేసులు వచ్చాయి. నిన్న 3 వేల 603 కరోనా కేసులు వెలుగుచూడగా, ఇవాళ ఆ సంఖ్య 4 వేలకు చేరువ కావడం ఆందోళనకు గురి చేస్తోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో కన్నా.. తెలంగాణలోనే కేసులు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఆందోళన నెలకొంది.

దేశంలో ఒమిక్రాన్ సాముహిక వ్యాప్తి దశకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటన చేసింది. ఇప్పటికే చాలా మంది దీని బారిన పడి ఉంటారు. లక్షణాలు కూడా ఒకేలా ఉండటంతో ఏదీ కరోనో.. ఏదీ ఒమిక్రాన్ నిర్ధారించడం కష్టం అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అయితే కరోనా, ఒమిక్రాన్ ఓకేలా చూస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు జనవరి వరకు కరోనా పూర్తిగా తగ్గుముఖం పడుతుందనే వార్తలు ఊరట కలిగిస్తున్నాయి. యూరప్‌లో కూడా ఈ ఏడాది చివరి వరకు కరోనా వైరస్ అంతం అవుతుందని ప్రకటన చేసింది.
ఇటు వ్యాక్సిన్ తీసుకున్న వారి జోలికి ఒమిక్రాన్ రాబోదని.. అందుకే నిపుణులు కచ్చితంగా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. వైరస్ తగ్గుముఖం పడుతున్న.. జాగ్రత్తతో ఉండాలని కోరింది. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ మాత్రం వేగంగా వ్యాప్తి చెందింది. అందరినీ ఒకసరి పలకరించింది మరీ వెళ్తుంది. అలా రాజకీయ నేతలు కూడా వైరస బారిన పడతున్నారు. వారంత వృద్దులే కావడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది.