హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వామ్మో .. దాసరి కుమారుడు కూడా కిడ్నాప్ .. కారణమిదేనా ?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ గడ్డమీద అదృశ్య శక్తి పీఠముడి ఇంకా వీడలేదు. గత కొన్నిరోజులుగా సిటీ జనాలు కనిపించకుండా పోతున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే వందల సంఖ్యలో కనిపించకుండా పోయారు. అయితే కొందరు తిరిగి వచ్చారని పోలీసులు తెలిపారు. ఈ ఇష్యూ ఇలా ఉంటే తాజాగా దాసరి కుమారుడు కూడా కనిపించకుండా పోవడం కలకలం రేపుతుంది.

కనిపించని ప్రభు

కనిపించని ప్రభు

దివంగత దాసరి నారాయణరావు కుమారుడు ప్రభు కనిపించడం లేదు. గత ఐదురోజుల నుంచి ప్రభు ఆచూకీ తెలియడం లేదని కుటుంబసభ్యులు చెప్తున్నారు. ఈ నెల 9న ఇంటినుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదని పేర్కొన్నారు. దీంతో వారు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రభు ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రభు .. మిగతా వారిలాగే కనిపించకుండా పోయారా ? లేదా గొడవల నేపథ్యంలో ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే అంశాలు తేలాల్సి ఉంది.

గతంలో ఓసారి ..

గతంలో ఓసారి ..

దాసరి ప్రభు గతంలో కూడా ఒకసారి కిడ్నాప్‌నకు గురయ్యాడు. 2008లో కనిపించకుండా పోయారు. అయితే తర్వాత కొద్దిరోజులకు ఆయన ఇంటికి తిరిగి వచ్చారు. తర్వాత తన భార్య సుశీల కిడ్నాప్ చేయించిందని ఆరోపించారు. దీంతో వారి మధ్య గొడవలు జరిగినా .. సంగతి తెలిసిందే.

భార్యభర్తల మధ్య గొడవలు ...

భార్యభర్తల మధ్య గొడవలు ...

దాసరి ప్రభు .. నారాయణరావు మొదటి కుమారుడు. రెండో కుమారుడు అరుణ్‌కుమార్ పలు సినిమాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే. ప్రభు తనను 1995లో పెళ్లి చేసుకున్నారని సుశీల అప్పట్లో మీడియాకు వివరించారు. తమది ప్రేమ వివాహం అని, ఇంట్లో వారికి ఇష్టం లేదని కూడా ఆరోపించారు. పెళ్లైన తర్వాత బానే ఉన్న దంపతులు కొన్నాళ్లకు గొడవలు మొదలయ్యాయి. ప్రభు, సుశీల మధ్య ఆస్తి వివాదం అగ్గిరాజేసింది. ఆస్తిలో వాటా కోసం సుశీల బాహటంగానే ఆందోళన చేపట్టిన సంగతి తెలసిందే. అయితే పెద్దవాళ్లు కలుగజేసుకొని సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. దాసరి చనిపోయిన తర్వాత కూడా మరోసారి ఆందోళన చేపట్టింది. తర్వాత మిన్నకుండిపోయింది. మళ్లీ చాలరోజుల తర్వాతా దాసరి ప్రభు కిడ్నాప్‌ తెరపైకి రావడంతో .. ఏం జరిగందనే అనుమానాలు రేగుతున్నాయి. ఇదివరకటి లాగా సుశీల కిడ్నాప్ చేశారా ? లేదంటే ప్రభు నిజంగానే కనిపించకుండా పోయారా అనే అంశం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

English summary
Dasari prabhu does not appear From the past five days, He left home on 9th of this month and did not come back. They complained to the Juphils police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X