• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వామ్మో కేటుగాడు.. అమ్మాయిలను ఎర వేశాడు.. ప్రభుత్వ ఉద్యోగిని 5 లక్షలకు ముంచేశాడు

|

హైదరాబాద్‌ : డేటింగ్ వెబ్‌సైట్లు కొంపకొల్లేరు చేస్తున్నాయి. నమ్మకంతో వంచిస్తూ అందినకాడికి దోచుకుంటున్నాయి. బుట్టలో పడే వరకు సర్వీసులు ఉచితమే అన్నట్లుగా మాట్లాడి.. ముగ్గులోకి దించాకా విశ్వరూపం చూపిస్తున్నారు నిర్వాహకులు. అమ్మాయిలను సరఫరా చేస్తామంటూ అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రభుత్వోద్యోగికి 5 లక్షల రూపాయలకు పైగా కుచ్చుటోపి పెట్టారు. అమ్మాయిలతో డేటింగ్ సౌకర్యం కల్పిస్తామంటూ నిలువునా ముంచారు.

 వేశాడు గాలం.. దోచాడు మొత్తం

వేశాడు గాలం.. దోచాడు మొత్తం

డేటింగ్ వెబ్‌సైట్లు రెచ్చిపోతున్నాయి. అమ్మాయిలను ఎరగా చూపుతూ నమ్మినోళ్లను నట్టేట ముంచుతున్నాయి. ట్రాక్‌లోకి వచ్చేంతవరకు ఫ్రీ ఫ్రీ అంటూ.. ఆపై వలలో పడ్డ చేపలను వదలడం లేదు. జలగల్లాగా పీల్చి పిప్పి చేస్తూ వారి జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇలాంటి ఘటనలు తరచుగా వెలుగుచూస్తున్నా జనాల్లో చైతన్యం రావడం లేదు. ఇక అమ్మాయిలనేసరికి చాలామంది సొంగ కార్చుకుంటూ సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డంగా బుక్కవుతున్నారు.

కేసీఆర్ అహంకారం తగ్గించుకో.. తెలంగాణ నీ రాజ్యం కాదు : కాంగ్రెస్

22న ఫోన్ కాల్.. వారంలో 5 లక్షలకు పైగా మాయం

22న ఫోన్ కాల్.. వారంలో 5 లక్షలకు పైగా మాయం

హైదరాబాద్ శివారులోని నల్లగండ్ల ఏరియాలో ఉండే ఓ ప్రభుత్వ ఉద్యోగికి డేటింగ్ వెబ్‌సైట్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఈ నెల 22వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి ఆయన మొబైల్ ఫోన్‌కు కాల్ చేశాడు. మీ సమీప ప్రాంతంలోనే ఆన్‌లైన్ డేటింగ్ చేసేందుకు అమ్మాయిలు ఉన్నారని.. మీరు ఓకే అంటే ఛాన్స్ ఇప్పిస్తామని నమ్మబలికాడు. మీరు నేరుగా అమ్మాయిలను కలవాలనుకుంటే ఆ అవకాశం కూడా కల్పిస్తామని కామకేళి కథలన్నీ చెప్పుకొచ్చాడు.

ఫోన్ చేసింది ఎవరో తెలియదు.. అయితే జాగ్రత్తగా ఉండాల్సింది పోయి వాడి మాయమాటలకు సదరు ప్రభుత్వ ఉద్యోగి బుట్టలో పడిపోయాడు. ఆయన ట్రాక్‌లోకి వచ్చాడని గ్రహించిన మోసగాడు తొలుత రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ.. తక్కువ మొత్తమేనంటూ 1,030 రూపాయలు చెల్లించాలని కోరాడు. వాడు చెప్పిన ప్రకారం ఓ బ్యాంకు అకౌంట్ నెంబర్‌కు ఆయన డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారు.

అమ్మాయిల మాటేమో గానీ.. అది ఇదంటూ లక్షలు గుంజాడు

అమ్మాయిల మాటేమో గానీ.. అది ఇదంటూ లక్షలు గుంజాడు

మీరు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేసిన 1,030 రూపాయలు తమ ఖాతాలో జమయినట్లు చెప్పిన సదరు మోసగాడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపాడు. కొద్దిసేపటికే కొందరు అమ్మాయిల ఫోటోలు పంపించాడు. అందులో నుంచి ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవాలని సూచించాడు. ఇక అప్పటినుంచి వాడి అసలు విశ్వరూపం చూపించాడు. ఆ ప్రభుత్వ ఉద్యోగిని నిలువునా ముంచాడు.

డేటింగ్ వ్యవహారమంతా విశ్వసనీయతతో ముడిపడి ఉందని నమ్మించిన మోసగాడు.. ఐడీ కార్డు పేరిట 29,900 రూపాయలు, పోలీస్ ప్రొటెక్షన్ కార్డంటూ 53 వేల రూపాయలు, లీగల్ అగ్రిమెంట్ కోసం 19,900 రూపాయలు, కన్ఫర్మేషన్ అంటూ మరో 37,500 రూపాయలు వసూలు చేశాడు. ఈ నెల 22న మొదటి కాల్ వచ్చిన సదరు ప్రభుత్వోద్యోగి నుంచి వారం రోజుల వ్యవధిలో రకరకాల పేర్లతో 5 లక్షల 45 వేల రూపాయల్ని కాజేశాడు.

కళ్లు తెరిచేసరికి జరిగిందంతా మోసం

కళ్లు తెరిచేసరికి జరిగిందంతా మోసం

వ్యవహారం తేడాగా కనిపించి పదేపదే డబ్బులు అడుగుతుండటంతో బాధితుడికి అనుమానం వచ్చి సదరు మోసగాడిని నిలదీశారు. అయితే తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా చివరకు ఒప్పందం రద్దు కావాలంటే కూడా మరో 65 వేల రూపాయలు చెల్లించాలని పట్టుబడటంతో ఆయన అనుమానం నిజమైంది. దాంతో మోసపోయానని గ్రహించి ఠాణా మెట్లెక్కారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Dating Website Cheated The Hyderabad based Government Employee. One of unknown candidate called him and tells about their company that provides online dating facility. He collected huge money from him for women supply. At last he realized and given a complaint to cyber crime police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X