హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్నదాతను విస్మరించిన కేసీఆర్ సర్కార్.. దత్తన్న ఫైర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ. వీరికి ప్రజా సంక్షేమం పట్టదని మండిపడ్డారు. రైతుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చినా .. వారి సమస్యలను పరిష్కరించడంలో మాత్రం కేసీఆర్ సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి రైతుబంధు, రుణ మాఫీ చేస్తామని చెప్పారే కానీ .. క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదని గుర్తుచేశారు.

రైతుల బాగోగులు పట్టవు
వానాకాలం మొదలైన సరైన వర్షాలు లేవు. తొలుత కురిసిన వర్షానికి కొన్నిచోట్ల దుక్కిదున్నారు రైతులు. కానీ వారి పరిస్థితిని, ఇబ్బందులు అడిగిన పాపాన ప్రభుత్వం పోలేదన్నారు. వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్న అన్నదాతకు భరోసానిచ్చే కార్యక్రమం చేపట్టడం లేదని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తామని చెప్పారు .. కానీ దాని ఊసే లేదన్నారు. దీంతో అన్నదాత ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. కానీ వారిని ధైర్యం చెప్పే సాహసం ప్రభుత్వం చేయడం లేదన్నారు.

dattatreya criticize kcr on farmers issue

రాష్ట్రంలో రైతులకు సంబంధించిన డేటాను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదన్నారు. దీంతో వారికి రావాల్సిన కిసాన్ సన్మాన్ నిధి రాలేదని పేర్కొన్నారు. అంతేకాదు రాష్ట్రంలో కొందరికీ రైతుబంధు డబ్బులు రాలేదని గుర్తుచేశారు. రైతులకు పెట్టుబడి సాయం చేస్తామని గొప్పలు చెప్పినా ప్రభుత్వం .. మలివిడత ఇవ్వలేకపోతుందని విమర్శించారు. ఇటు కేంద్రం ఇస్తామని మందుకొచ్చినా .. వివరాలు ఇవ్వరని మండిపడ్డారు. ప్రభుత్వ తీరు సరికాదని హితవు పలికారు.

English summary
Former Union Minister Bandaru Dattatreya has raised his voice over Telangana govt. They are ignoring the public welfare. They came to power by naming the farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X