తెలంగాణలో కరోనా టెర్రర్.. నిన్నటి కన్నా పెరిగిన కేసులు
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న 4207 కేసులు రాగా.. ఇవాళ మరిన్ని కేసులు ఎక్కువగా వచ్చాయి. రాష్ట్రంలో కొత్తగా 4,416 పాజిటివ్ కేసులు నమోదు వచ్చాయి. వైరస్ సోకిన ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,26,819 కాగా, మరణాల సంఖ్య 4,069 ఉంది. రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 6,93,623 ఉండగా, తాజాగా 1920 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 95.43 శాతం ఉంది. ఇక ఐసోలేషన్‌లో 29,127 మంది ఉన్నారు.
కరోనా, మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తే కేసుల సంఖ్యను తగ్గే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటు మొన్న 3500కు పైగా కేసులు వచ్చాయి. రోజు 700కు పైగా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

కరోనా తోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ వలన ప్రాణాపాయం చాలా తక్కువని, మైల్డ్ సింటమ్స్ మాత్రమే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు.కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖులను కూడా కేసులు వదలడం లేదు. హెల్త్ వర్కర్లు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కరోనా సోకుతుంది.
కేసులు పెరగడంతో పొరుగు రాష్ట్రాలు ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక ఆదివారం పూర్తిగా లాక్ డౌన్ విధిస్తాయని ప్రకటించాయి. ఇటు ఢిల్లీ మాత్రం కేసులు తగ్గుతున్నాయి.. వీకెండ్ కర్ప్యూను ఎత్తివేస్తామని ప్రకటించాయి. టాప్ సైంటిస్ట్ మాత్రం ఒమిక్రాన్‌తో వైరస్ అంతం అవుతుందనే సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇదీ మానవాళికి కాస్త సానుకూలం అంశమే అయ్యింది.