హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓటేసిన పోలీస్ బాస్: కుందన్ బాగ్‌లో సతీసమేతంగా.. ప్రశాంతంగా పోలింగ్

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ పోలింగ్ కొనసాగుతోంది. యువత/ టెకీలు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఓటు వేయండి బాబూ అంటూ మీడియా మొత్తుకుంటోన్న పట్టించుకోవడం లేదు. అయితే ప్రముఖులు మాత్రం ఓటు వేస్తున్నారు. సినీ, రాజకీయ, కాప్స్, బ్యూరోక్రాట్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మీరు కూడా ఓటేయాలని కోరుతున్నారు.

పోలీస్ బాస్, డీజీపీ మహేందర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీమణితో కలిసి కుందన్ బాగ్ చిన్మయ స్కూల్‌లో ఆయన ఓటు వేశారు. సిటీలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోందని చెప్పారు. ప్రజలందరూ ఓటు వేయాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం కూడా విధి, బాధ్యత అని చెప్పారు. ఓటు వేస్తేనే సమస్యపై స్పందించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఓల్డ్ మలక్ పేటలో జరిగిన విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. 3వ తేదీన రీ పోలింగ్ నిర్వహిస్తారని.. ఎన్నికల సంఘానికి పోలీసు శాఖ సహకరిస్తోందని చెప్పారు.

dgp mahender reddy cast vote at kundanbagh

3వ తేదీన రీ పోలింగ్ నిర్వహించిన తర్వాత.. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేందుకు ఈసీఅనుమతించింది. ఆ మరునాడు 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. బ్యాలెట్ లెక్కించాల్సి ఉన్నందున సమయం ఎక్కువే తీసుకోనుంది. ఏమైనా కానీ ఈ సారి గ్రేటర్ మేయర్ పీఠం ఎవరినీ వరిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ట్రెండ్ బట్టి చూస్తే టీఆర్ఎస్- బీజేపీ మధ్య పోటా పోటీ నెలకొంది.

English summary
telangana dgp mahender reddy and his wife cast vote at kundanbagh chinmaya school
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X