హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

disha case encounter:రాళ్లతో దాడులు, ఆయుధాలు తీసుకొని కాల్పులు, ఎన్‌కౌంటర్‌పై సజ్జనార్

|
Google Oneindia TeluguNews

దిశ హత్య కేసు నిందితులు చటాన్ పల్లి వద్ద సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులపై దాడి చేశారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. రాళ్లు, కర్రలతో దాడి చేశారని పేర్కొన్నారు. తర్వాత పోలీసుల నుంచి రెండు గన్లు తీసుకున్నారని.. కాల్పులు జరిపారని చెప్పారు. ఏ1 నిందితుడు ఆరిఫ్, ఏ4 చెన్నకేశవులు వెపన్స్ తీసుకున్నారని వివరించారు.

రాముడ్ని, కృష్ణుడ్ని పూజిస్తే సరిపోదు: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థిరాముడ్ని, కృష్ణుడ్ని పూజిస్తే సరిపోదు: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి

Recommended Video

Disha Issue : Hatsaaf CP Sajjanar || Jayaho Telangana Police || Oneindia Telugu
3న కస్టడీకి..

3న కస్టడీకి..

దిశ హత్య కేసు నిందితులను పోలీసు కస్టడీకి ఈ నెల 3వ తేదీన తీసుకున్నామని సీపీ సజ్జనార్ వివరించారు. 3, 4, 5వ తేదీల్లో హత్య గురించి వివరాలు ఆరాతీసినట్టు వెల్లడించారు. దిశ మొబైల్, ఇతర వస్తువులను చటాన్‌పల్లి వద్ద ఉన్నాయని నిందితులు చెప్పడం.. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం గురువారం అర్ధరాత్రి 10 మంది పోలీసులు నిందితులను తీసుకొని ఘటనాస్థలానికి వెళ్లారని పేర్కొన్నారు.

సీన్ రీ కన్‌స్ట్రక్షన్

సీన్ రీ కన్‌స్ట్రక్షన్

రాత్రి తోండుపల్లి గేట్ వద్ద సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారని తెలిపారు. అక్కడినుంచి చటాన్ పల్లి వద్దకు చేరుకున్నారని పేర్కొన్నారు. నిందితులతోపాటు 10 మంది పోలీసు సిబ్బంది ఉన్నారని చెప్పారు. మొబైల్ గురించి అడిగితే పొంతనలేని సమాధానాలు చెప్పారని.. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని సీపీ తెలిపారు. తర్వాత రాళ్లు, కర్రలతో దాడి చేశారని చెప్పారు. పోలీసుల నుంచి ఆరిఫ్, చెన్నకేశవులు వెపన్లు తీసుకొని పారిపోయే ప్రయత్నం చేశారని వివరించారు.

వెపన్లు తీసుకొని

వెపన్లు తీసుకొని

పారిపోవద్దని, లొంగిపోవాలని కోరినా వినలేదని సీపీ చెప్పారు. పోలీసులపై కాల్పులకు దిగారని దీంతో నందిగామ ఎస్పై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ గాయపడ్డారని చెప్పారు. వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందజేసి.. కేర్ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో పోలీసులు కాల్పులు జరిపారని చెప్పారు. తెల్లవారుజామున 5.45 గంటల నుంచి 6.15 గంటల మధ్య కాల్పులు జరిగాయని చెప్పారు.

ఇతర చోట్ల కూడా

ఇతర చోట్ల కూడా

కేసు విచారణను కూడా పకడ్బందీగా చేపట్టామని చెప్పారు. బాధితురాలే కాక నిందితులు డీఎన్ఏ కూడా పరీక్షించామని చెప్పారు. వీరు ఇతర చోట్ల కూడా క్రైం చేశారని సీపీ సజ్జనార్ అనుమానించారు. నిందితుల మృతదేహాలకు మహబూబ్ నగర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తామని చెప్పారు. తర్వాత కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగిస్తామని తెలిపారు.

English summary
disha accused began fire cyberabad cp sajjanar said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X