హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

disha case encounter:దిశనే కాదు, తెలంగాణ, ఏపీ, కర్ణాటకలోనూ నిందితుల ఆగడాలు:సీపీ

|
Google Oneindia TeluguNews

దిశ హత్య కేసు నిందితులపై ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందో సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ వివరించారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం వెళ్లిన సమయంలో నిందితులు నలుగురు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కాల్పులు జరిపామనిపేర్కొన్నారు. అంతేకాదు ఈ నలుగురికి ఇతర రాష్ట్రాల్లో జరిగిన నేరాలతో సంబంధాలు ఉన్నాయని అనుమానించారు. కొన్ని కేసులను చూస్తుంటే తనకు అనుమానం వేస్తుందని సజ్జనార్ తెలిపారు.

disha case encounter:రాళ్లతో దాడులు, ఆయుధాలు తీసుకొని కాల్పులు, ఎన్‌కౌంటర్‌పై సజ్జనార్disha case encounter:రాళ్లతో దాడులు, ఆయుధాలు తీసుకొని కాల్పులు, ఎన్‌కౌంటర్‌పై సజ్జనార్

మిస్సింగ్ కేసులు

మిస్సింగ్ కేసులు

తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కొన్ని మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వారిలో కొందరు యువతులు ఆచూకీ తెలియలేదు. ఆ నేరాలతో ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులుకు సంబంధం ఉండి ఉంటుందని సజ్జనార్ భావిస్తున్నారు. నిందితులు నేర ప్రవృత్తి కలిగి ఉన్నారని దిశపై దారుణానికి ఒడిగట్టడంతో అర్థమైందన్నారు. అదే తొలిసారి నేరం చేస్తే ఇంత కిరాతకంగా ప్రవర్తించి ఉండరని తెలియజేశారు.

disha case encounter:రాళ్లతో దాడులు, ఆయుధాలు తీసుకొని కాల్పులు, ఎన్‌కౌంటర్‌పై సజ్జనార్disha case encounter:రాళ్లతో దాడులు, ఆయుధాలు తీసుకొని కాల్పులు, ఎన్‌కౌంటర్‌పై సజ్జనార్

డేటా చూస్తే..

డేటా చూస్తే..

రాష్ట్రంలో మిస్సయిపోయిన యువతుల డేటాను పోల్చి చూస్తామని సజ్జనార్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలో కూడా మిస్సింగ్ కేసులకు సంబంధించి వివరాలు తీసుకొని పరిశీలిస్తామని చెప్పారు. వారి నేర ప్రవృత్తి బట్టి కనిపించకుండా పోయిన వారి వివరాలను కనుగొంటామని తెలిపారు. ఏ చిన్న ఆధారం లభించినా.. మరికొందరి విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్తున్నారు.

ఎక్కడెక్కడ తిరిగారు..

ఎక్కడెక్కడ తిరిగారు..

ఆరిఫ్ ఒక్కడి వయస్సు 26 సంవత్సరాలు అని.. మిగతా నిందితులు వయస్సు 20 ఏళ్లు అని చెప్పారు. వీరు ఎప్పటినుంచి మోటార్ ఫీల్డ్‌లోకి వచ్చారు..? ఎక్కడెక్కడ తిరిగారు..? అనే అంశాలపై క్లారిటీ వస్తే.. ఆ సమయంలో జరిగిన హత్యోదంతాలకు సంబంధించి నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా కూడా దర్యాప్తు సాగుతుందని పోలీసులు తెలిపారు.

నిజం దాగదు..

నిజం దాగదు..

దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైన దిశ హత్య కేసు నిందితులు ఇతర చోట్ల కూడా ఘాతుకాలకు పాల్పడ్డారని సీపీ తెలుపడం ఆందోళన కలిగిస్తోంది. ఆ నీచులు ఇతర చోట్ల కూడా రెచ్చిపోయారా ? ఎవరినీ బలితీసుకున్నారు అనే అంశాలపై చర్చిస్తున్నారు. నిందితులు పర్యటించిన సమయంలో.. ఎవరైనా యువతులు కనిపించకుండా పోతే.. తప్పకుండా వీరి హస్తం ఉన్నట్టేనని అనుకొవాల్సి ఉంటుంది.

English summary
disha accused involve another cases also cyberabad cp sajjanar said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X