హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Disha case encounter: నిందితుల ఎన్‌కౌంటర్‌ పై విమర్శలు... ఏదైనా చట్ట ప్రకారమే జరగాలంటున్న పలువురు

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ సంచలనంగా మారింది. నిన్నటి వరకు రోడ్ల పైకి వెళ్లే మహిళలకు భద్రత లేదని భావించిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్య, నిందితులను ఎన్కౌంటర్ చేయడం తెలంగాణ ప్రజలకు ఒక భరోసా ఇచ్చింది. ఇక ఈ ఘటనపై దేశం మొత్తం దాదాపుగా హర్షం వ్యక్తం చేస్తుంటే పలువురు విమర్శిస్తున్నారు. చట్టాలను చేతుల్లోకి తీసుకోవటం సమాజానికి మంచిది కాదని అంటున్నారు.

Disha murder : దిశ ఆత్మ శాంతించిందన్న కుటుంబం ..ఆ మానవ మృగాల శవాలు చూడాలని వుందన్న తల్లిDisha murder : దిశ ఆత్మ శాంతించిందన్న కుటుంబం ..ఆ మానవ మృగాల శవాలు చూడాలని వుందన్న తల్లి

Recommended Video

Disha Issue : NHRC Issues Notices To Telangana Police On Encounter In Disha Case
దిశా కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై భిన్నాభిప్రాయాలు

దిశా కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై భిన్నాభిప్రాయాలు

షాద్ నగర్ చటాన్ పల్లి బ్రిడ్జి వద్ద ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల చర్యను వేలాది మంది ప్రశంసిస్తుండగా, కొందరు ప్రముఖులు ఈ చర్యపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్య తప్పంటున్నారు. వెటర్నరీ డాక్టర్ దిశను హైదరాబాద్ శివార్లలో ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు దారుణంగా హతమార్చిన ఘటనలో కేవలం 10 రోజులలో ఎన్ కౌంటర్ చేశారు పోలీసులు . ఎన్ కౌంటర్ పై దిశ తల్లిదండ్రులతో పాటు, నిర్భయ తల్లి, బాలీవుడ్, టాలీవుడ్ నటీ నటులు హర్షం వ్యక్తం చేశారు. దిశా తల్లిదండ్రులు , అలా గే సోదరి కూడా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

మానవ హక్కుల ఉల్లంఘన .. చట్టాలను చేతుల్లోకి తీసుకోవటం అంటున్న కార్తి చిదంబరం

మానవ హక్కుల ఉల్లంఘన .. చట్టాలను చేతుల్లోకి తీసుకోవటం అంటున్న కార్తి చిదంబరం

కానీ కొందరు ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొంటున్నారు. ఇదే సమయంలో కొందరు పోలీసుల చర్యను తప్పుబడుతున్నారు. "అత్యాచారం తీవ్రమైన నేరమే. చట్టపరంగానే నిందితులకు కఠిన శిక్ష పడాలి అని తమ వాదన వినిపిస్తున్నారు. ఎన్ కౌంటర్ వంటి శిక్షలు సమాజానికి చేటు చేస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. తక్షణ న్యాయం కోసం బాధితులు ఎదురు చూస్తుంటారని తెలిసినా కానీ, దానికి ఇది పద్ధతి కాదు అని కార్తి చిదంబరం వ్యాఖ్యానించారు. చట్టాలు మార్చి సత్వర న్యాయం చేకూర్చండి కానీ ఇలా ఎన్ కౌంటర్ లు చెయ్యటం సరైనది కాదని అంటున్నారు.

క్రైం సీన్ రీ కన్స్ట్రక్షన్ కాదు కొత్త క్రైం సీన్ కన్స్ట్రక్ట్ చేసారని విమర్శలు

క్రైం సీన్ రీ కన్స్ట్రక్షన్ కాదు కొత్త క్రైం సీన్ కన్స్ట్రక్ట్ చేసారని విమర్శలు


ఇక దీనిపై ప్రముఖులు వ్యతిరేకంగా కూడా స్పందిస్తున్నారు .రమేష్ శ్రీవాస్తవ్ ఇది కచ్చితంగా వ్యవస్థను మరింత కూల్చే ఘటన అన్నారు. అత్యాచారం , హత్య ఘటనలో సీన్ రీ కన్స్ట్రక్షన్ చెయ్యాలని అక్కడకు తీసుకెళ్ళిన పోలీసులు వారి ఎన్కౌంటర్ తో కొత్త క్రైమ్ సీన్ కన్స్ట్రక్ట్ చేసారని , ఇది మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. ఇక సంజుక్త బసు ఇది నిజంగా షాకింగ్ అని మాట్లాడారు. షాకింగ్. మనం ఏమి అయ్యాము? వీరు నిజమైన నేరస్థులు అని ఏ రుజువు ఉంది? వీరిపై అనుమానం మాత్రమే ఉంది, నేరాన్ని రుజువు చేసే దర్యాప్తు మరియు ఆధారాలపై మనకు ఏమైనా నిర్ధారణ ఉందా ? వారికి న్యాయవాది కూడా లేరు, వారి కేసు వాదించిన వారు లేరు . ఎన్కౌంటర్లో చంపబడ్డారు ఇప్పుడు మనం సంబరాలు జరుపుకుంటున్నాము అంటూ సమాజాన్ని ఆలోచించేలా ఆమె తన అభిప్రాయం తెలియజేశారు.

 తుపాకీ తూటాల న్యాయం అవసరం లేదు .. చట్ట పరంగానే శిక్షలు ఉండాలని అభిప్రాయాలు

తుపాకీ తూటాల న్యాయం అవసరం లేదు .. చట్ట పరంగానే శిక్షలు ఉండాలని అభిప్రాయాలు

సీనియర్ న్యాయవాది వ్రిందా గ్రోవర్ స్పందిస్తూ, "తుపాకి తూటల న్యాయం అవసరం లేదు. ఇది కచ్చితంగా హర్షించతగ్గ పరిణామం కాదు. మహిళలు, అమ్మాయిల రక్షణ పేరు చెప్పి ఇలా ఎన్ కౌంటర్లు చేయడం సమంజసం కాదు. ప్రతి ఎన్ కౌంటర్ పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, విచారణ తప్పనిసరిగా జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈ ఎన్ కౌంటర్ పై స్వతంత్ర కమిటీ విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు .

English summary
Police have killed four human beasts who were involved in the rape and murder of Disha. This is being celebrated not only across the state but across the country. but some people opposing the decision of police. they are asking What we need is a quick response, good investigation, a speedy trial, and fast justice. Collapsing due process with an #encounter will only lead to the process collapsing. and some social activists and human rights commission seriously opposing the encounter .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X