హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Disha case encounter : ఎన్ కౌంటర్ లకు తాను వ్యతిరేకం అంటున్న అసదుద్దీన్ ఓవైసీ

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ సంచలనంగా మారింది. ఇక దీనిపై దేశం మొత్తం హర్షం వ్యక్తం చేస్తే పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా చట్ట ప్రకారం జరగాలని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న జాతీయ మానవ హక్కుల సంఘం తెలంగాణా పోలీసులకు నోటీసులు ఇచ్చింది. అంతే కాదు ఎన్ కౌంటర్ మృతుల మృత దేహాలను 9వ తేదీ వరకు భద్రపరచాలని ఆదేశాలు జారీ చేసింది. తాము పరిశీలించే వరకు నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించొద్దని స్పష్టం చేసింది.

Disha murder : దిశ ఆత్మ శాంతించిందన్న కుటుంబం ..ఆ మానవ మృగాల శవాలు చూడాలని వుందన్న తల్లి Disha murder : దిశ ఆత్మ శాంతించిందన్న కుటుంబం ..ఆ మానవ మృగాల శవాలు చూడాలని వుందన్న తల్లి

ఇది ఇలా ఉంటే షాద్ నగర్ చటాన్ పల్లి బ్రిడ్జి వద్ద జరిగిన ఎన్ కౌంటర్ పై వ్యతిరేకత ఇంకా వ్యక్తం అవుతూనే ఉంది.కొందరు ప్రముఖులు ఈ చర్యపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్య తప్పంటున్నారు. వెటర్నరీ డాక్టర్ దిశను హైదరాబాద్ శివార్లలో ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు దారుణంగా హతమార్చిన ఘటనలో పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని చాలా మంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 Disha case encounter : Asaduddin owisi opposes the encounter

అయితే తాజాగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను తప్పుపట్టారు. అయితే తాను వ్యక్తిగత ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకమని, శిక్షించే బాధ్యతను న్యాయస్థానానికి అప్పగించాలే తప్పా పోలీసుల చేతుల్లోకి తీసుకోకూడదని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇకపోతే దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ జరుపుతుందని, ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వం కూడా విచారణ జరుపుతుందని తాను భావిస్తున్నట్టు ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

English summary
Police have killed four human beasts who were involved in the rape and murder of Disha. some people opposing the decision of police. recently MIM leader asaduddin owaisi responded on this encounter. that he is opposing the encounters. he said that it is not good to take laws in our hands .we are asking for a quick response, good investigation, a speedy trial, and fast justice he stated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X