హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Disha case.. encounter : నిందితుల ఎన్‌కౌంటర్‌ కు సీపీఐ మద్దతు .. నారాయణ ఏం చెప్పారంటే

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ సంచలనంగా మారింది. నిన్నటి వరకు రోడ్ల పైకి వెళ్లే మహిళలకు భద్రత లేదని భావించిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్య, నిందితులను ఎన్కౌంటర్ చేయడం తెలంగాణ ప్రజలకు ఒక భరోసా ఇచ్చింది. ఇక దేశ వ్యాప్తంగా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్న వేళ
తాజాగా దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Disha case encounter: నిందితుల ఎన్‌కౌంటర్‌ పై విమర్శలు... ఏదైనా చట్ట ప్రకారమే జరగాలంటున్న పలువురుDisha case encounter: నిందితుల ఎన్‌కౌంటర్‌ పై విమర్శలు... ఏదైనా చట్ట ప్రకారమే జరగాలంటున్న పలువురు

 మానవ హక్కుల గురించి మాట్లాడే సీపీఐ నాయకుల నుండి వ్యక్తం అవుతున్న సానుకూలత

మానవ హక్కుల గురించి మాట్లాడే సీపీఐ నాయకుల నుండి వ్యక్తం అవుతున్న సానుకూలత

ఎన్ కౌంటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన గళం వినిపించే వారిలో కమ్యూనిస్ట్ నేతలు ముందుంటారు. చట్టం తన పని తాను చేయాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని చెప్తుంటారు. తప్పు చేసిన వారిని శిక్షించేందుకు న్యాయస్థానాలు ఉన్నాయన్న వాదనను తరచూ వినిపిస్తుంటారు. ఏదైనా ఘోరం జరిగినప్పడు కూడా మానవహక్కుల గురించి అలోచించి మాట్లాడే సీపీఐ నాయకులు తాజాగా పోలీసుల తీసుకున్న స్టెప్ గురించి అందుకు భిన్నంగా స్పందిచారు. ఈ ఎన్ కౌంటర్ ను సీపీఐ సమర్ధిస్తుంది అని నారాయణ పేర్కొన్నారు.

Recommended Video

Disha ఎన్ కౌంటర్ : Public Reaction || ప్రతీ ఆడపిల్ల తండ్రి కి ఇదొక బహుమానం || Oneindia Telugu
 ఇలాంటి ఘటనలలో నిందితుల ఎన్ కౌంటర్ ను సమర్ధిస్తా నారాయణ

ఇలాంటి ఘటనలలో నిందితుల ఎన్ కౌంటర్ ను సమర్ధిస్తా నారాయణ

తాజాగా వాట్సాప్ లో ఆయనో సందేశాన్ని విడుదల చేశారు. దిశ నిందితుల్ని పోలీసులు హతమార్చటం ఆనందించదగిన అంశంగా ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు.దిశ లాంటి దారుణ ఘటనలు చోటు చేసుకున్నప్పుడు నిందితుల ఎన్ కౌంటర్ తప్పేం కాదన్న అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. సంతోషం.. శుభం.. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఇలాంటివి తప్పవు అని నారాయణ పేర్కొన్నారు . ఈ ఎన్ కౌంటర్ ను తాను సమర్దిస్తానని పేర్కొన్నారు.

ప్రజాభిప్రాయమ ఇదే .. కొన్ని సార్లు తప్పవు అన్న నారాయణ

ప్రజాభిప్రాయమ ఇదే .. కొన్ని సార్లు తప్పవు అన్న నారాయణ

ఇలాంటి సందర్భంలో కొన్ని లా అండ్ ఆర్డర్ సమస్యలు రావొచ్చు కానీ ఈ సమయంలో ఎన్ కౌంటర్ గురించి మరో మాట మాట్లాడటానికి లేదు అని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘోరమైన ఘటనలు జరగకుండా ఉండాలంటే హతమార్చటం అవసరం అని ఆయన పేర్కొన్నారు. దీన్ని మేం పూర్తిగా సమర్థిస్తున్నామని వ్యాఖ్యానించి షాకిచ్చారు నారాయణ. ఇంతకాలానికి ప్రజలు ఏం కోరుకుంటున్నారో సరిగ్గా దాన్నే తన నోటి నుంచి నారాయణ వెల్లడించటం విశేషంగా చెప్పక తప్పదు.

 ఘటనా స్థలంలో శవ పంచనామా నిర్వహించిన పోలీసులు

ఘటనా స్థలంలో శవ పంచనామా నిర్వహించిన పోలీసులు

ఇక ఈ ఘటనపై మెజార్టీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుంటే కొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే చర్యగా దీనిని అభివర్ణిస్తున్నారు. ‘దిశ' అత్యాచార, హత్య నిందితులను పోలీసులు శుక్రవారం, డిసెంబర్ 6 తెల్లవారుఝూమున ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో పోలీసులు కాల్చి చంపారు. నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపినా స్థలంలోనే శవ పంచనామా నిర్వహించారు.

English summary
Police have killed four human beasts who were involved in the rape and murder of Disha. This is being celebrated not only across the state but across the country. CPI leader Narayana responded positively In his post, CPI Narayana said that it is good that the police killed the Disha's accused. He said he would support this en counter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X