హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిశా కేసు... ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులను విచారిస్తున్న ఎన్‌హెచ్‌ఆర్సీ

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ పై జాతీయ మానవ హక్కుల కమీషన్ దర్యాప్తు కొనసాగుతుంది.ఇక ఈ ఘటన పోలీసులు కావాలని చేసిన చర్యగా కొందరు పోలీసుల చర్యను తప్పుబట్టారు. దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్న తరుణంలో జాతీయ మానవ హక్కుల కమీషన్ ఈ కేసును సుమోటోగా తీసుకుంది . అయితే, తాము మృతదేహాలను పరిశీలించే వరకు అంత్యక్రియలు చేయవద్దంటూ తెలంగాణ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

దిశ ఘటనపై స్పందించిన జయప్రద ... చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హితవుదిశ ఘటనపై స్పందించిన జయప్రద ... చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హితవు

 ఎన్కౌంటర్ ఎలా జరిగింది అనేది విచారిస్తున్న ఎన్‌హెచ్‌ఆర్సీ

ఎన్కౌంటర్ ఎలా జరిగింది అనేది విచారిస్తున్న ఎన్‌హెచ్‌ఆర్సీ

జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) బృందం ఈ ఎన్‌కౌంటర్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. అందులో భాగంగా ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు బృందాన్ని రెండు రోజులుగా విచారిస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన తీరును అడిగితెలుసుకున్న ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు పోలీసుల గాయాలపై ఆరా తీశారు. ఎలా దాడి జరిగింది. ఎవరు ఎలా దాడికి యత్నించారు. ఎక్కడ గాయాలు తగిలాయి అనేది విచారించింది.

ఎన్కౌంటర్ సమయంలో గాయపడిన వారి పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్న ఎన్‌హెచ్‌ఆర్సీ

ఎన్కౌంటర్ సమయంలో గాయపడిన వారి పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్న ఎన్‌హెచ్‌ఆర్సీ

పోలీసులకు తగిలిన గాయాలపై వైద్యులను కూడా అడిగితెలుసుకుంది. ఇక, నిందితులు దాడిచేసిన తీరును ఎన్‌హెచ్‌ఆర్సీ బృందానికి వివరించారు గాయపడ్డ పోలీసులు. దిశ కేసులో సీన్ రీకన్స్ట్రెక్షన్ నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంది ఎన్‌హెచ్‌ఆర్సీ దర్యాప్తు బృందం .కస్టడీకి తీసుకున్న తర్వాత నుండి ఎన్‌కౌంటర్ వరకు జరిగిన అన్ని అంశాలపై వివరణ ఇచ్చిన పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లినప్పుడు ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో నిందితులు దాడిచేసి సర్వీస్ రివాల్వర్స్ లాకున్నారని ఆ ఘటనను వారికి వివరించారు.

ఆత్మ రక్షణ కోసమే ఎన్కౌంటర్ చేశామని పోలీసుల వివరణ

ఆత్మ రక్షణ కోసమే ఎన్కౌంటర్ చేశామని పోలీసుల వివరణ


ఇక వారు కాస్త దూరం పారిపోయాక ఫైర్ ఓపెన్ చేసి కాల్పులకు తెగబడ్డారని కూడా చెప్పారు. గత్యంతరం లేక ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామని మానవ హక్కుల కమీషన్ సభ్యులకు వివరణ ఇచ్చారు. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. దీనిపై సిట్ విచారణ కూడా కొనసాగుతుంది. ఇక ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించి పంచనామా నిర్వహించి, ఆధారాలు సేకరించామని, సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం ఎఫ్ఎస్ఎల్ ఎక్స్‌ఫర్ట్స్‌తో దర్యాప్తు జరుపుతున్నామని వివరించిన పోలీసు ఉన్నతాధికారులు, పోస్టుమార్టం రిపోర్ట్, సీసీ విజువల్స్, ఇతర కేసు వివరాలను ఎన్‌హెచ్‌ఆర్సీకి అందించారు.

English summary
The National Human Rights Commission (NHRC) team has taken a full investigation into the matter. NHRC members have been interrogating the police team involved in the encounter for two days. NHRC members inquired about the manner in which the encounter took place and inquired about police injuries. How was the attack. Who tried to attack. Where the injuries were investigated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X