హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Disha murder: నిందితుల ఎన్‌కౌంటర్‌... స్వీట్లు పంచుతూ సంబరాల్లో విద్యార్థినులు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Disha Issue : సీపీ సజ్జనార్‌ కి పాలాభిషేకం.. సెల్యూట్ తెలంగాణా పోలిస్ || Oneindia Telugu

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ సంచలనంగా మారింది. నిన్నటి వరకు రోడ్ల పైకి వెళ్లే మహిళలకు భద్రత లేదని భావించిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్య, నిందితులను ఎన్కౌంటర్ చేయడం తెలంగాణ ప్రజలకు ఒక భరోసా ఇచ్చింది. ఇక విద్యార్థినులు ఈ ఘటనతో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 Disha murder: మొబైల్ పాతిపెట్టిన నిందితులు ...దొరికిన దిశ మొబైల్ .. కీలక విషయాల వెల్లడి Disha murder: మొబైల్ పాతిపెట్టిన నిందితులు ...దొరికిన దిశ మొబైల్ .. కీలక విషయాల వెల్లడి

 ఎన్‌కౌంటర్‌పై విద్యార్థినుల సంబరాలు .. పోలీసుల అభినందనలు

ఎన్‌కౌంటర్‌పై విద్యార్థినుల సంబరాలు .. పోలీసుల అభినందనలు

దిశా అత్యాచారం, హత్య ఘటనకు పాల్పడిన నలుగురు మానవ మృగాలను అంతమొందించారు పోలీసులు. దీనితో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. విజయవాడలోని ఒక కళాశాలలో విద్యార్థులు డప్పులు కొడుతూ, ఢంకా బజాయించి మరీ పోలీసులను అభినందిస్తున్నారు . రోడ్ల మీదకు వచ్చి సంతోషంతో డాన్సులు చేస్తున్నారు. పోలీసులకు, కనిపించిన ప్రజలకు స్వీట్లు పంచుతున్నారు విద్యార్థినులు.

 నిన్నటి వరకు రోడ్లపైకి రావాలంటేనే భయపడిన అమ్మాయిలు

నిన్నటి వరకు రోడ్లపైకి రావాలంటేనే భయపడిన అమ్మాయిలు

నిన్నటి వరకు దిశపై జరిగిన గ్యాంగ్ రేప్, హత్య నేపద్యంలో బయటకు రావాలంటేనే భయపడిన అమ్మాయిలు, ఇప్పుడు సంతోషంగా రోడ్ల మీదకు వస్తున్నారు. పోలీసులు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయమని చెప్తున్నారు. తమకు రక్షణ కల్పించడానికి పోలీసులు ఈ తరహా నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దిశ విషయంలో పోలీసులు న్యాయం చేశారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే దిశా ఆత్మకు శాంతి శాంతి చేకూరిందని అంటున్నారు .

ఇదే సరైన శిక్ష ... దిశా ఆత్మకు శాంతి అంటున్న విద్యార్థినులు

ఇదే సరైన శిక్ష ... దిశా ఆత్మకు శాంతి అంటున్న విద్యార్థినులు

దిశ కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంతో దేశ వ్యాప్తంగా విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నలుగురు నిందితులకు సరైన శిక్ష విధించారని విద్యార్థినులు పేర్కొంటున్నారు. విద్యార్థినుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిస్తుంది. నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారని తెలుసుకున్న విద్యార్థినులు, ఒక్క దిశా విషయంలోనే కాదు ఎవరి విషయంలో అయినా ఇలాంటి నిర్ణయాలే తీసుకోవాలని చెప్తున్నారు. దిశ ఆత్మకు శాంతి చేకూరిందని పేర్కొంటున్నారు.

ధైర్యంగా బయటకు వస్తున్న అమ్మాయిలూ ... శభాష్ పోలీస్ అంటూ కితాబు

ధైర్యంగా బయటకు వస్తున్న అమ్మాయిలూ ... శభాష్ పోలీస్ అంటూ కితాబు

తమకు న్యాయం జరిగిందని విద్యార్థినులు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు . విద్యార్థినులు పోలీసులకు మిఠాయిలు తినిపిస్తున్నారు. తెలంగాణ పోలీసులకు విద్యార్థినులు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ తరహా చర్యలు తీసుకున్నప్పుడే, నేరస్తులు భయపడతారని , ఇలాంటి నేరాలకు పాల్పడాలంటే వారికి వెన్నులో వణుకు పుడుతోందని అంటున్నారు విద్యార్థినులు. మృగాళ్ల ఎన్కౌంటర్ పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. శభాష్ పోలీస్ అంటూ తెలంగాణ పోలీసులను ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు.

English summary
Police have killed four human beasts who were involved in the rape and murder of Disha. This is being celebrated not only across the state but across the country. At a college in Vijayawada, students are dancing and playing musical instuments to convey their greetings to the police. Students are sharing sweets to the police and to the public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X