హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిశ హత్య కేసు : నిందితులకు ఏడు రోజుల పోలీస్ కస్టడి

|
Google Oneindia TeluguNews

దిశ హత్యకేసులో పరిణామాలు వేగంగా కదులుతున్నాయి. సంఘటనపై సభ్య సమాజం మొత్తం వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే పోలీసులు అత్యంత వేగంగా పావులు కదుపుతున్నారు. నిందితులను త్వరగా విచారించి శిక్ష పడేలా పోలీసులు చర్యలు చేపట్టారు. దీంతో నిందితుల నుండి పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు పదిరోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే... ఏడు రోజుల పాటు నిందితులను పోలీసు కస్టడికి ఇస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో రేపటి నుండి దిశ నిందితులను తమ కస్టడిలోకి తీసుకుని విచారించనున్నారు.

పెట్రోల్ బంకుల్లో సీసీ కెమెరాలు... దిశ సంఘటనతో పోలీసుల ఆదేశాలు పెట్రోల్ బంకుల్లో సీసీ కెమెరాలు... దిశ సంఘటనతో పోలీసుల ఆదేశాలు

 దిశ నిందితులకు ఏడు రోజుల కస్టడీ

దిశ నిందితులకు ఏడు రోజుల కస్టడీ

దిశ కేసులో దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే... దీంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, పోలీసులు ,న్యాయవ్వవస్థ కూడ అంతే వేగంగా స్పందిస్తున్నాయి. దిశ నిందితులను ప్రస్తుతం చర్లపల్లి జైలులో పద్నాలుగు రోజుల రిమాండ్‌కు తరలించారు. అయితే వారి వద్ద నుండి పూర్తి సమాచారాన్ని తీసుకునేందుకు పదిరోజుల పాటు కస్టడికి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. దీంతో వారం రోజుల పాటు కస్టడికి ఇస్తూ...కొర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే దిశ నిందితులను గురువారం చర్లపల్లి జైలు నుండి పోలీసులు తమ కస్టడికి తీసుకుని విచారించనున్నారు.

పూర్తి సాక్ష్యాధారాలు సేకరించనున్న పోలీసులు

పూర్తి సాక్ష్యాధారాలు సేకరించనున్న పోలీసులు

దిశా కేసులో తామే అత్యాచారం చేసి హత్య చేసినట్టు నిందితులు అంగీకరించారు. అయితే నిందితులు ముందస్తు ప్లాన్ వేసి అత్యాచారం, హత్య చేసినట్టు పోలీసులకు వెల్లడించారు. మొత్తం ఇరవై నిమిషాల్లో దిశపై ఘోరానికి పాల్పాడ్డట్టు వెళ్లడించారు. ఈ నేపథ్యంలోనే హత్యకు సంబంధించి పూర్తి వివరాలను రాబట్టాల్సిన అవసరం ఉంది. పోలీసులు చెప్పిన వివరాలకు ఆధారాలను సేకరించాల్సిన అవసరం కూడ ఉంది. దిశా ఫోన్ కనిపించకుండా పోవడం, నిందితులు దిశతో ఫోన్ మాట్లాడినట్టు చెప్పారు. దాంతోనే నిందితులను రాత్రీకి రాత్రే పట్టుకున్నారు. ఫోన్‌కు సంబంధించి పూర్తి వివరాలు సేకరించాల్సిన అవకాశాలు ఉన్నాయి. ఆమెకు ఎందుకు ఫోన్ చేశారు. అంతకుముందు జరిగిన అంశాలపై వారిని విచారించనున్నారు.

 ఫాస్ట్ ట్రాక్ కోర్టు

ఫాస్ట్ ట్రాక్ కోర్టు

ఇక దిశ కేసును ఆలస్యం లేకుండా సత్వరమే విచారించి , నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. దీంతో కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని న్యాయస్థానానికి లేఖ రాసింది. దీంతో ప్రభుత్వ విజ్ఝప్తిని పరీశీలించిన కోర్టు అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల్లోనే దిశ కేసుపై విచారణ పూర్తి కానుంది. ముఖ్యంగా వరంగల్ చిన్నారీ హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు కేవలం 27 రోజుల్లోనే తన విచారణనను పూర్తి చేసింది. అనంతరం నిందితునికి శిక్షను ఖారారు చేశారు. అదే ఈ కేసులో కూడ అదేవిధంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

English summary
The consequences of the Disha murder case moving very fast, part of this The accused have been handed over to police custody for seven days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X