హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Disha murder case: మరో కీలక వీడియో వైరల్, టోల్ ప్లాజా వద్ద నిందితులు ఇలా..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య కేసులో మరో కీలక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవంబర్ 27న రాత్రి వెటర్నరీ వైద్యురాలిపై నలుగురు నిందితులు సామూహిక అత్యాచారం చేసి, హత్య చేశారు. ఆ తర్వాత ఆమెను పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ రాత్రికి సీసీ కెమెరాల్లో రికార్డైన వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది.

సీసీ కెమెరాల్లో దృశ్యాలు..

సీసీ కెమెరాల్లో దృశ్యాలు..


నిందితులను గుర్తించడంలో ఈ వీడియో కూడా కీలకంగా మారిందని తెలుస్తోంది. నవంబర్ 27న రాత్రి 10.28గంటల సమయంలో తొండుపల్లి టోల్‌గేట్ వద్ద నుంచి వెళ్తున్న ఈ లారీలో దిశ మృతదేహాన్ిన నిందితులు తరలించారని పోలీసులు గుర్తించారు. టోల్ గేట్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో 2 లారీలు వెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి.

రాత్రి 10గంటల సమయంలో..

రాత్రి 10గంటల సమయంలో..

కాగా, తొండుపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో నిందితులు దిశపై సామూహిక అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి 10గంటల సమయంలో దిశ మృతదేహాన్ని దుప్పట్లలో చుట్టి లారీలో చటాన్‌పల్లి వరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ ఆమె మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు.
ఈ ఘటనలో దిశ మృతదేహం 70శాతం వరకు కాలినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహం 70 శాతం కాలినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత దిశ కేసులో దర్యాప్తు జరిపిన పోలీసులు.. నిందితులను 24గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. దిశ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.

చివరకు నిందితుల హతం

చివరకు నిందితుల హతం

గత శుక్రవారం తెల్లవారుజామున దిశ హత్యాచారం కేసులో నిందితులైన మహ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు నవీన్, జొల్లు శివలను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఘటనా స్థలానికి కేసు రీకన్‌స్ట్రక్చన్ భాగంగా నిందితులను తీసుకెళ్లగా.. అక్కడ వారు పోలీసులపై దాడి చేసి తుపాకీలు లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో నలుగురు నిందితులు మృతి చెందారు. నిందితుల దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై దేశం వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ పోలీసులపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే, మరికొందరు మాత్రం నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం సరికాదని, చట్టం ప్రకారం వెళ్లాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు.

English summary
Disha murder case: another key video viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X