• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Disha Murder case: దిశ నిందితులకు బహిరంగ ఉరి తీయాలని, కాల్చి చంపాలని కోరలేను.. కానీ: కేటీఆర్

|

హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలో శంషాబాద్ వద్ద నలుగురు కామాంధుల చేతుల్లో అత్యంత పాశవికంగా అత్యాచారానికి, హత్యకు గురైన వెటర్నరి డాక్టర్ దిశ కేసుపై తెలంగాణ మంత్రి కే తారక రామారావు తొలిసారిగా బహిరంగంగా స్పందించారు. ఈ కేసులో నిందితులను బహిరంగంగా ఉరి తీయడమో లేక కాల్చి చంపాలనో తాను డిమాండ్ చేయలేనని అన్నారు. ప్రభుత్వంలో ఉన్నందున తాను అందరిలా అలా గళమెత్తలేనని చెప్పారు. సత్వర న్యాయం జరగాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు.

వెటర్నరి డాక్టర్ దిశపై లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా పని చేస్తోన్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మహమ్మద్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులు అత్యాచారానికి తెగబడిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెను హత్య చేశారు. ఈ దారుణ ఉదంతానికి పాల్పడిన నలుగురు కామాంధులను పోలీసులను 24 గంటల్లోనే అరెస్టు చేశారు. న్యాయస్థానంలో ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

  Disha Issue : బ్రేకింగ్ : నిందితుల ఎన్ కౌంటర్... EXCLUSIVE ఎన్ కౌంటర్ వీడియో

  దిశ ఎఫెక్ట్ : బస్సుల్లో సీసీ కెమెరాలు, పానిక్ ‌బటన్లు..

  ప్రభుత్వంలో భాగస్వామిని.. అందర్లా గళం కలపలేను..

  ప్రభుత్వంలో భాగస్వామిని.. అందర్లా గళం కలపలేను..

  ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి. నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని నినదిస్తున్నారు దేశ ప్రజలు. దీనిపై కేటీఆర్ స్పందించారు. ఈ కేసులో దోషులుగా తేలిన ఆ నలుగురినీ బహిరంగంగా ఉరి తీయడానికి గానీ, కాల్చి చంపడానికి గానీ మన దేశ చట్టాలు, న్యాయ వ్యవస్థ అనుమతించబోవని అన్నారు. ప్రభుత్వంలో భాగస్వామిని అయినందున తాను వారితో గళం కలపలేనని అన్నారు.

   రాజ్యాంగానికి, న్యాయవ్యవస్థ ప్రకారమే..

  రాజ్యాంగానికి, న్యాయవ్యవస్థ ప్రకారమే..

  బాధితురాలి కుటుంబానికి సత్వర న్యాయం అందాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజ్యాంగానికి లోబడి, న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్య విలువలకు లోబడి ఉండక తప్పదని చెప్పారు. చట్టాలు, న్యాయ వ్యవస్థ ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని అన్నారు. నేరం ఎంత తీవ్రమైనదైనా సరే.. చట్టానికి అనుగుణంగా చర్యలు ఉంటాయని చెప్పారు. చాలా సందర్భాల్లో సత్వర న్యాయం దక్కకపోవడం వల్ల నిరుత్సాహానికి, నిరాశలకు గురవుతుంటామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

  ఇన్ స్టంట్ రిజల్ట్ అసాధ్యం..

  ఇన్ స్టంట్ రిజల్ట్ అసాధ్యం..

  ప్రస్తుతం.. దిశ హంతకులను బహిరంగంగా ఉరి తీయాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తోందని, లోక్ సభ, రాజ్యసభల్లోనూ ఈ అంశాన్ని సభ్యులు ప్రస్తావించారని అన్నారు. ఇలాంటి కేసుల్లో ఇన్ స్టంట్ రిజల్ట్ కావాలని, తక్షణమే మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. అయినప్పటికీ- న్యాయ ప్రక్రియ తన పని తాను చేసుకుంటూ వెళ్తుందే తప్ప, డిమాండ్లకు తల వంచదని అన్నారు.

  English summary
  KT Rama Rao: I'm as much passionate as anyone else to see the end of those 4 fellows. But being in govt,I can't be saying hang them in public or shoot them on sight. That's not how system works. You've to brace yourself for reality, to operate within purview of Constitution.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X