హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిశ హత్య కేసు : వివరాలు ఎందుకు బహిర్గతం చేశారు... హైకోర్టు సీరియస్

|
Google Oneindia TeluguNews

ఇటివల జరిగిన సంచలనం సృష్టించిన దిశ హత్య కేసుపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. బాధితురాలి వివరాలను ఎందుకు బహిర్గతం చేశారో తెలుపాలని రాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలోన పలు రాష్ట్రాలతో పాటు మీడియా సంస్థలకు కూడ కోర్టు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. బాధితురాలి వివరాలు వెల్లడికావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

 బాధిత మహిళ పోటోలు బహిర్గతం నేరం

బాధిత మహిళ పోటోలు బహిర్గతం నేరం

ఐపీసీ సెక్షన్ల ప్రకారం అత్యాచారానికి గురైన బాధిత మహిళల పేర్లను బహిర్గతంగా వెళ్లడించడం గాని, లేదా ఫోటోలు విడుదల చేయడం కాని చేయకూడదు. అయితే దిశ సంఘటన జరిగిన తర్వాత ఆమె ఫోటోలతో పాటు పేర్లు సైతం బహిర్గతమయ్యాయి. వారి తల్లిదండ్రుల వివరాలు కూడ వెళ్లడయ్యాయి. ముఖ్యంగా దిశ ఫోటోలు సామాజిక మాద్యమాలతోపాటు మీడీయాలో విపరీత ప్రచారం అయ్యాయి.

 జస్టీస్ ఫర్ దిశగా పేరు మార్పు

జస్టీస్ ఫర్ దిశగా పేరు మార్పు


అయితే ఇందుకు సంబంధించి పోలీసులు సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత స్పందించారు. హత్యాచారం జరిగిన బాధితమహిళ పేరును మారుస్తూ... నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం వారి తల్లిదండ్రుల వద్ద అనుమతి కూడ తీసుకున్నారు. దీంతో బాధితురాలి పేరును జస్టీస్ ఫర్ దిశ అంటూ పేర్కోన్నారు. అయితే అప్పటికే బాధితురాలి ఫోటోలు వీడియోలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లడం గమనార్హం. దీంతో జరిగిన నష్టం అప్పటికే జరిగిపోయింది.

రెండు సంవత్సరాల శిక్ష, జరిమానా...

రెండు సంవత్సరాల శిక్ష, జరిమానా...


ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి చెందిన యశ్‌దీప్ అనే న్యాయవాది దిశ వివరాలు బహిర్గతం చేయడంపై పిల్ వేశారు. బాధితురాలి వివరాలను రహస్యంగా ఉంచడంలో తెలంగాణ పోలీస్ శాఖ, నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. ఇలా బాధితురాలి వివరాలను బహిర్గతం చేయడం నేరమని పేర్కోన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రెండెళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడ విధించే అవకాశాలు ఉన్నట్టు ఆయన తన పిటిషన్‌లో పేర్కోన్నారు. దీంతో పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం తెలంగాణ పోలీసులతో పాటు పలు మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

English summary
Telangana State police have been issued notices asking why the Disha victim's details were disclosed.in this case a pil was filed in the The Delhi High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X