హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Disha murder : దిశ ఆత్మ శాంతించిందన్న కుటుంబం ..ఆ మానవ మృగాల శవాలు చూడాలని వుందన్న తల్లి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో వెటర్నరీ డాక్టర్ దిశ సామూహిక అత్యాచారం, హత్య అందర్నీ షాక్ కు గురి చేసింది. ఇక ఈ కేసు తెలంగాణలో మరో నిర్భయ తరహా ఘటనగా దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. మరో అమాయకురాలు కామాంధుల పైశాచికత్వం బలైపోయిందని దేశం మొత్తం వారిని ఎన్ కౌంటర్ చెయ్యాలని నినదించిన వేళ తెలంగాణా ప్రభుత్వం , తెలంగాణా పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు దిశ కేసు నిందితులను దిశను సజీవ దహనం చేసిన చోటే ఎన్ కౌంటర్ చేశారు . ఇక దిశ తల్లిదండ్రులు , సోదరి ఈ ఎన్ కౌంటర్ తో దిశ ఆత్మ శాంతించిందని తెలిపారు. తెలంగాణా పోలీసులకు ధన్యావాదాలు చెప్పారు.

Recommended Video

Disha Issue ఎన్ కౌంటర్ : Disha Father And Sister Reaction || Oneindia Telugu

Disha murder: నిందితుల ఎన్‌కౌంటర్‌... స్వీట్లు పంచుతూ సంబరాల్లో విద్యార్థినులుDisha murder: నిందితుల ఎన్‌కౌంటర్‌... స్వీట్లు పంచుతూ సంబరాల్లో విద్యార్థినులు

ఇలా ఎన్ కౌంటర్ తో సత్వర న్యాయం జరుగుతుందనుకోలేదన్న తండ్రి

ఇలా ఎన్ కౌంటర్ తో సత్వర న్యాయం జరుగుతుందనుకోలేదన్న తండ్రి


ఇక ఈ ఘటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న తరుణంలో దిశా కుటుంబ సభ్యులు స్పందించారు .ఇక దిశా కేసు నిందితులను పోలీసులు నేడు ఎన్ కౌంటర్ చెయ్యటంతో వారు తెలంగాణా ప్రభుత్వాన్ని , తెలంగాణా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. నిందితులకు ఉరిశిక్ష పడుతుందని భావించామని.. అంతకు మించి న్యాయం జరిగిందని భావిస్తున్నామని దిశ తల్లిదండ్రులు తెలిపారు.

8 రోజుల్లోనే న్యాయం జరిగింది..స్పందించిన దిశా తల్లి

8 రోజుల్లోనే న్యాయం జరిగింది..స్పందించిన దిశా తల్లి

తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని, పోలీసులు నిందితులను ఎన్ కౌంటర్ చెయ్యటాన్ని దిశా కుటుంబం , అలాగే బంధువులు మెచ్చుకుంటున్నారు. దాను తిరిగి తీసుకురాలేకున్నా దోషులను శిక్షించి న్యాయం చేశారని పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌పై దిశ తల్లి స్పందిస్తూ 8 రోజుల్లోనే దిశకు న్యాయం చేశారని చెప్పారు. ‘‘ఏడేళ్లైనా నిర్భయకు న్యాయం జరగలేదు. మీడియాకు, పోలీసులకు ధన్యవాదాలు. మా అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరింది.

వాళ్ళ శవాలను చూడాలని ఉందన్న దిశా తల్లి

వాళ్ళ శవాలను చూడాలని ఉందన్న దిశా తల్లి

నిందితుల ఎన్‌కౌంటర్‌తో మాకు మనశ్శాంతి కలిగింది. ఇంత తొందరగా న్యాయం జరుగుతుందని ఊహించలేదు. నిందితుల శవాలను చూడాలని ఉంది. మా అమ్మాయి లేదన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నా. అందరి గురించి నా కూతురు మంచిగా ఆలోచించేది'' అని దిశ తల్లి వ్యాఖ్యానించారు. తన కుమార్తె పై పైశాచిన దాడి చేసి చంపిన వారిని అదే స్థలంలో చంపటంతో పోలీసులు తమకు న్యాయం చేశారని , వాళ్ళ శవాలను చూడాలని ఆమె ఉద్వేగంగా చెప్పారు . ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకూడదని చెప్పారు. కఠినమైన చట్టాలు కావాలని ఆమె ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు.

పోలీసులు త్వరగా న్యాయం చేశారు అన్న సోదరి

పోలీసులు త్వరగా న్యాయం చేశారు అన్న సోదరి


ఇక సోదరి బయటకు వెళ్ళాలంటేనే భయపడిపోయిన ఘటన నేపధ్యంలో పోలీసులు చాలా త్వరగా స్పందించి అంతే త్వరగా నిర్ణయం తీసుకున్నారని చెప్పింది . తన అక్క ఆత్మకు శాంతి చేకూరింది అని పేర్కొంది. ఇంకా తన చెవుల్లో భయమేస్తుంది అన్న అక్క మాటలు మోగుతూనే ఉన్నాయని , ఈ రోజు వరకు తాను సైతం తీవ్ర ఆందోళనలో ఉన్నానని చెప్పారు దిశా సోదరి . ఇక ఈ ఘటన మాకు జరిగిన అన్యాయానికి కొంత ఉపశమనం అని పేర్కొన్నారు.

English summary
Victim Disha's family said they got the justice and added that the soul of their daughter might get peace with the encounter death of all the accused. Her mother has thanked the Telangana Police, media, the state government and the people of their colony on the occasion. No girl should face this type of barbaric incident, the mother of late Disha said. Disha's mother said she is still in depression and shared the nature of her daughter. She wished to see more tough laws to be formed in the coming days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X