• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Disha murder :ఎన్‌కౌంటర్‌పై సర్వత్రా హర్షం ... పోలీసులపై ఘటనా స్థలంలో పూల వర్షం

|

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ జరిగింది.ఎన్కౌంటర్ జరిగిన ఘటన స్థలికి భారీగా ప్రజలు చేరుకుంటున్నారు. ఈ ఎన్ కౌంటర్ పై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు రాజకీయ వర్గాల నుండి, సినీ ప్రముఖుల నుండి, సామాన్య ప్రజల నుండి నలుగురు మానవ మృగాల ఎన్కౌంటర్ పై సానుకూల స్పందన వస్తోంది. ఘటనా స్థలిలో పోలీసులపై పూల వర్షం కురుస్తుంది.

  Disha Issue : బ్రేకింగ్ : నిందితుల ఎన్ కౌంటర్... EXCLUSIVE ఎన్ కౌంటర్ వీడియో
  పోలీసుల చర్యపై సర్వత్రా హర్షం

  పోలీసుల చర్యపై సర్వత్రా హర్షం

  అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి, దిశను సజీవ దహనం చేసి హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా నేటికీ ప్రకంపనలు సృష్టిస్తుంది. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిని కదిలించిన ఈ ఘటన జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళనకు కారణమైంది. అటు పార్లమెంటును సైతం కుదిపేసింది. ఇక ఈ ఘటనలో నిందితులను విచారణ చేస్తున్న క్రమంలో తప్పించుకు పారిపోయేందుకు ప్రయత్నించారు నిందితులు. దీంతో పోలీసులు వారిని దిశను ఎక్కడైతే హతమార్చారో ఆ సంఘటనా స్థలంలోనే ఎన్కౌంటర్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసుల చర్యపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

  Disha murder: బ్రేకింగ్... దిశను హతమార్చినచోటే నిందితుల ఎన్ కౌంటర్... సరిగ్గా ఆ సమయానికే

  ఘటనా స్థలంలో పోలీసులపై పూల వర్షం .. ప్రముఖుల స్పందన

  ఘటనా స్థలంలో పోలీసులపై పూల వర్షం .. ప్రముఖుల స్పందన

  ఇప్పటికే సంఘటనా స్థలంలో భారీగా ప్రజలు చేరుకున్నారు. పోలీసులు చర్యపై జయహో పోలీస్ అంటూ జయజయధ్వానాలు చేస్తున్నారు. సంఘటన స్థలంలో పోలీసుల పై పూల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి ఘటన లో ఇదే తరహా నిర్ణయం తీసుకొని సత్వర న్యాయం చేస్తే నేరస్తులకు వెన్నులో వణుకు పుడుతోందని అందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు రేపిస్టులకు కచ్చితంగా ఈ విధంగానే శిక్ష పడాలని ,ఎన్ కౌంటర్లు చేసిన పోలీసులకు ప్రశంసిస్తూ మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్, కుష్బూ తదితరులు ట్వీట్ చేశారు.

  దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకుల స్పందన .. ఏపీ హోం మంత్రి హర్షం

  దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకుల స్పందన .. ఏపీ హోం మంత్రి హర్షం

  ఇక ఏపీ హోం మంత్రి పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్క్రుతాం అంటూ ట్వీట్ చేశారు . ఇక చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ తెలంగాణ పోలీసుల చర్యను అభినందించింది. అమ్మాయిలపై అఘాయిత్యాలకి పాల్పడేవారికి ఇలాంటి శిక్షలే పడాలని ప్రజలు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజల నుండి వస్తున్న స్పందన ఈ ఉదంతంలో చాలా క్లియర్ గా కనిపిస్తుంది.

  దిశ హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

   తెలంగాణా పోలీసులను చూసి నేర్చుకోండి ..స్పందించిన మాయావతి , బీజేపీ నేత కపిల్ మిశ్రా

  తెలంగాణా పోలీసులను చూసి నేర్చుకోండి ..స్పందించిన మాయావతి , బీజేపీ నేత కపిల్ మిశ్రా

  రేపిస్టులతో వ్యవహరించడం ఎలాగో తెలంగాణ పోలీసులను చూసి నేర్చుకోవాలంటూ ఢిల్లీ బీజేపీ నేత కపిల్ మిశ్రా అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. దిశ కేసు నిందితుల ఎన్‌‌కౌంటర్‌పై ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు .హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు. రేపిస్టులతో ఇలాగే వ్యవహరించాలి. మిగతా రాష్ట్రాల పోలీసులు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారని ఆశిస్తున్నానుఅని వ్యాఖ్యానించారు. తెలంగాణా పోలీసులను మాయావతి అభినందించారు . యూపీ పోలీసులు తెలంగాణా పోలీసులను చూసి నేర్చుకోవాలన్నారు.

  దిశ హత్య ఘటననాడు పోలీసులపై వ్యతిరేకత ...నేడు సానుకూలత

  దిశ హత్య ఘటననాడు పోలీసులపై వ్యతిరేకత ...నేడు సానుకూలత

  28వ తేదీన దిశ హత్య ఘటన జరిగినప్పుడు పోలీసులపై ఎంత వ్యతిరేకత వ్యక్తం అయిందో ఇప్పుడు పోలీసులు తీసుకున్న నిర్ణయం అయిన నిందితులను ఎన్కౌంటర్ చేయడంతో అంత సానుకూలత తెలంగాణ పోలీసుల పట్ల కలుగుతోంది. దేశం మొత్తం ఒక్కసారిగా తెలంగాణ పోలీసులపై దృష్టిసారించింది. అందుకే ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో పోలీసుల పై పూల వర్షం కురిపిస్తున్నారు స్థానిక ప్రజలు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  An Encounter of Accusations in the Rape Murder Case of Disha has been created sensationacross the country. There has been a positive response from the political community, film personalities and the general public over the encounter with four human beasts. Flowers estinguished on the police who had done this encounter.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more