హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Disha murder: సజ్జనార్ మార్క్ ... చటాన్ పల్లి ఎన్ కౌంటర్ ... నాటి వరంగల్ ఎన్ కౌంటర్ సీన్ రిపీట్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Disha Issue : Hatsaaf CP Sajjanar || Jayaho Telangana Police || Oneindia Telugu

దేశమంతా ఎదురుచూసిన సంఘటన జరిగింది. దిశా హంతకులకు శిక్ష పడింది. పక్కా ప్లాన్ వేసి ఓ ఆడపిల్ల పై అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన హంతకులను ఎన్ కౌంటర్ చేశారు తెలంగాణ పోలీసులు. గతంలో స్వప్నిక ప్రణీతలపై యాసిడ్ దాడి నిందితులకు ఎన్కౌంటర్ చేసిన సీన్ మళ్లీ చటాన్ పల్లి ఎన్కౌంటర్లో రిపీట్ అయ్యింది.

Disha murder: బ్రేకింగ్... దిశను హతమార్చినచోటే నిందితుల ఎన్ కౌంటర్... సరిగ్గా ఆ సమయానికేDisha murder: బ్రేకింగ్... దిశను హతమార్చినచోటే నిందితుల ఎన్ కౌంటర్... సరిగ్గా ఆ సమయానికే

దిశా కేసు నిందితుల ఎన్ కౌంటర్ .. నలుగురు మృతి

దిశా కేసు నిందితుల ఎన్ కౌంటర్ .. నలుగురు మృతి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ జరిగింది. నలుగురు మానవ మృగాలు అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి, దిశను సజీవ దహనం చేసి హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా నేటికీ ప్రకంపనలు సృష్టిస్తుంది. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిని కదిలించిన ఈ ఘటన జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళనకు కారణమైంది. అటు పార్లమెంటును సైతం కుదిపేసింది. ఇక ఈ ఘటనలో నిందితులను విచారణ చేస్తున్న క్రమంలో తప్పించుకు పారిపోయేందుకు ప్రయత్నించారు నిందితులు. దీంతో పోలీసులు వారిని దిశను ఎక్కడైతే హతమార్చారో ఆ సంఘటనా స్థలంలోనే ఎన్కౌంటర్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

పోలీసులపై నిన్నటి దాకా నిరసనలు

పోలీసులపై నిన్నటి దాకా నిరసనలు

పోలీసుల చర్యపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జయహో సీపీ సజ్జనార్ అంటూ ప్రజలు సజ్జనార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. దిశ దారుణ ఘటన నేపథ్యంలో నిందితులను పోలీసులు అతి తక్కువ సమయంలోనే సరైన సమయంలో పోలీసులు స్పందించలేదని నిరసనలు వెల్లువెత్తాయి. తెలంగాణ పోలీసుల అసమర్థతను ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలు వస్తాయి. రోడ్ల మీదకు వచ్చి పెద్ద ఎత్తున పోలీసుల సమర్థతపై విమర్శలు గుప్పించారు.

సోషల్ మీడియాలో ఎన్ కౌంటర్ చెయ్యాలని ప్రజల డిమాండ్

సోషల్ మీడియాలో ఎన్ కౌంటర్ చెయ్యాలని ప్రజల డిమాండ్

సోషల్ మీడియాలో పోలీసుల చేతగానితనాన్ని పెద్ద ఎత్తున ప్రశ్నించారు. ఇక సీపీ సజ్జనార్ కు గతంలో వరంగల్లో జరిగిన స్వప్నిక ప్రణీతల యాసిడ్ దాడి నిందితుడు ఎన్కౌంటర్ చేసిన రోజులను గుర్తు చేశారు. అలాగే వీరిని కూడా ఎన్కౌంటర్ చేయాలని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది. సీపీ సజ్జనార్ అందుకు సమర్ధుడు అని దేశం మొత్తం నినదించింది.

స్వప్నిక , ప్రణీతల కేసు డీల్ చేసిన సజ్జనార్ .. అప్పట్లో సంచలనం

స్వప్నిక , ప్రణీతల కేసు డీల్ చేసిన సజ్జనార్ .. అప్పట్లో సంచలనం


వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2008 డిసెంబరు 10వ తేదీన వరంగల్ లోని కిడ్స్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్వప్నిక ప్రణీత లు బైక్ పై ఇంటికి వెళుతున్న క్రమంలో శ్రీనివాస్ అనే యువకుడు యాసిడ్ దాడి చేశాడు. ఆ దాడి అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం గా మారింది. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన స్వప్నిక సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, తీవ్ర గాయాలపాలై తర్వాత నిదానంగా కోలుకుంది ప్రణీత.

 నాడు యాసిడ్ దాడి నిందితుల ఎన్ కౌంటర్

నాడు యాసిడ్ దాడి నిందితుల ఎన్ కౌంటర్

ఇక ఈ ఘటనకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు అప్పట్లో వరంగల్ ఎస్పీగా సీపీ సజ్జనార్ ఉన్న సమయంలో యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుల్లో ముగ్గురిని ఎన్కౌంటర్ చేశారు. అప్పుడు ఆ ఘటనలో శ్రీనివాస్, సంజయ్, హరికృష్ణ లను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. గతంలో కూడా వారి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేస్తుండగా, ఆత్మరక్షణ కోసమే పోలీసుల కాల్పులు జరిపినట్లు గా పోలీసులు ప్రకటించారు.

 ఇప్పుడు చటాన్ పల్లి వద్ద సేమ్ సీన్ రిపీట్

ఇప్పుడు చటాన్ పల్లి వద్ద సేమ్ సీన్ రిపీట్

ఇక తాజాగా నాటి వరంగల్ ఎస్పీగా దేశం మొత్తాన్ని చర్చించుకునే లా స్వప్నిక ప్రణీత ల యాసిడ్ దాడి నిందితులను ఎన్కౌంటర్ చేయడంలో కీలక భూమిక పోషించిన సజ్జనార్ ప్రస్తుతం సైబరాబాద్ కమిషనర్ గా ఉన్నారు . ఈ ఘటనను కూడా సీరియస్ గా తీసుకున్న సజ్జనార్ ఆధ్వర్యంలో పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయడానికి చటాన్ పల్లి బ్రిడ్జి వద్దకు వెళ్లిన క్రమంలో నిందితులు తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశారు.

సజ్జనార్ ఆధ్వర్యంలో చటాన్ పల్లి ఎన్ కౌంటర్

సజ్జనార్ ఆధ్వర్యంలో చటాన్ పల్లి ఎన్ కౌంటర్

పోలీసులు వాహనాల పై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు నిందితులను ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి 5 గంటల మధ్యలో ఎన్ కౌంటర్ చేసినట్లుగా తెలుస్తుంది. సంఘటనా స్థలానికి వెళ్ళి సీపీ సజ్జనార్ అక్కడ ఎన్కౌంటర్ జరిగిన తీరును పరిశీలించారు. గతంలో స్వప్నిక ప్రణీత ల యాసిడ్ దాడి నిందితులకు సజ్జనార్ వరంగల్ ఎస్పీ గా ఉన్న సమయంలో ఏదైతే శిక్ష పడిందో ఇప్పుడు దిశ హత్య కేసు నిందితులకు అదే శిక్ష పడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది .

 సీపీ సజ్జనార్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం

సీపీ సజ్జనార్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం

వారం రోజులుగా అన్ని వర్గాల నుండి వస్తున్న ఒత్తిడి,దిశ కనిపించడంలేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు కిందిస్థాయి సిబ్బంది సరిగా స్పందించలేదన్న కారణం మొత్తం పోలీస్ శాఖకు మచ్చ తెచ్చింది. అయితే తాజాగా దిశనిందితులను ఎన్ కౌంటర్ చేయడం ఆ మచ్చ తుడిచిపెట్టుకుపోయిన చేసింది. అన్ని వర్గాల వారు, రాజకీయ పక్షాలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ముక్తకంఠంతో పోలీసుల చర్యను ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా తీసుకుని సీపీ సజ్జనార్ ను జయహో అంటున్నారు.

English summary
Telangana police have made encounter the murderers who brutally massacred and murdered a girl. The scene of the acid attack accused encounter in warangal in the past has been repeated in the Chatton Palli encounter.At that time the decision to encounter acid accused as Warangal SP Sajjanar was a sensation. Now, he is the latest Cybarabad cp is being congratulated on the decision of the Disha case accused encounter at Chattan Palli Bridge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X