హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Disha murder: దిశ హత్య నిందితుల ఇంటరాగేషన్ ... విచారణలో గోప్యత !!

|
Google Oneindia TeluguNews

డాక్టర్ దిశ అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురై,హత్య భావించబడిన సంఘటన యావత్ భారతదేశాన్ని ఇంకా కుదిపేస్తూనే ఉంది . ఇక ఈ కేసులో పోలీసుల కస్టడీ పిటీషన్ కు అనుమతి ఇచ్చి వారిని పోలీసులు విచారణ జరిపేలా నిర్ణయం తీసుకుంది హైకోర్టు . దీంతో దిశ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసును సత్వరమే తేల్చాలని సిట్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు .

Disha murder: 'దిశ'ను బతికుండగానే కాల్చేశారు !! దిశ గ్యాంగ్ రేప్ ,హత్య కేసులో కొత్త కోణంDisha murder: 'దిశ'ను బతికుండగానే కాల్చేశారు !! దిశ గ్యాంగ్ రేప్ ,హత్య కేసులో కొత్త కోణం

 దిశ కేసులో కీలకంగా మారిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు

దిశ కేసులో కీలకంగా మారిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు

ఇక దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేసిన క్రమంలో పోలీసులు నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. నలుగురు నిందితులకు డాక్టర్ల చేత పోలీసులు వైద్య పరీక్షలు చేయించనున్నారు. పోలీసులు ఇప్పటికే సీన్ రీకనస్ట్రక్షన్ చేసినట్లు కూడా తెలుస్తోంది. అంతే కాదు ఫోరెన్సిక్ నిపుణులకు లారీలో పలు ఆధారాలు దొరికినట్లుగా కూడా తెలుస్తుంది .ఈ కేసులో దిశ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకంగా మారిందని సమాచారం.

విచారణ గోప్యంగా, రహస్య ప్రదేశంలో జరుపుతున్న పోలీసులు

విచారణ గోప్యంగా, రహస్య ప్రదేశంలో జరుపుతున్న పోలీసులు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా నిరసనలు కొనసాగుతున్న వేళ భద్రతా కారణాల దృష్ట్యా విచారణను గోప్యంగా, రహస్య ప్రదేశంలో జరుపుతున్నట్లు తెలుస్తోంది. మహిళా కమిషన్, పోలీసులు, ప్రభుత్వాల దృష్టి మాత్రమే కాదు ఘటన జరిగి ఇన్ని రోజులైనా ప్రజల దృష్టి కూడా దిశ కేసుపైనే ఉంది. ప్రజలు ఈ కేసుపై తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో దర్యాప్తు తొందరగా పూర్తి చేయాలని పోలీసులు భావిస్తున్నారు. అందుకే నిందితులను వారం పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. అందుకు అంగీకరించిన కోర్టు, నిందితులను పోలీసుల కస్టడీకి ఇచ్చింది.

 కేసును విచారిస్తున్న శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో నలుగురు అడిషినల్ ఎస్పీలు

కేసును విచారిస్తున్న శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో నలుగురు అడిషినల్ ఎస్పీలు

దిశ అత్యాచారం , హత్య ఘటన జరిగిన తర్వాత ఒకసారి నిందితులను సంఘటనా స్థలానికి తీసుకెళ్ళి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం చేశారు పోలీసులు. ఇప్పుడు మరో మారు నిందితులను సంఘటనా స్థలం వద్దకు తీసుకెళ్లనున్నారు. నిందితులను విచారించే బృందానికి శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో నలుగురు అడిషినల్ ఎస్పీలు, ముగ్గురు సీఐలు, ఎనిమిది మంది ఎస్సైల బృందం ఏర్పాటయ్యింది.

మినిట్ టూ మినిట్ ఏం జరిగిందో మరోసారి సీన్ రీ కన్స్ట్రక్షన్

మినిట్ టూ మినిట్ ఏం జరిగిందో మరోసారి సీన్ రీ కన్స్ట్రక్షన్


దిశ ఇంటి నుంచి బయలుదేరిన దగ్గరి నుంచి ఆమెను పెట్రోల్ పోసి కాల్చిన సమయం వరకు ఏం జరిగింది? ఎలా జరిగింది? అందరూ ఒకే విధంగా సమాధానం చెప్తున్నారా ? లేదా మార్చి చెప్తున్నారా ? వారు వాస్తవాలు ఏమైనా దాచిపెడుతున్నారా ? అనే దానిపై ఈ బృందం దర్యాప్తు చేయనుంది. ఈ విధంగా మొత్త సీన్‌ను రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నారు. వారం రోజుల కస్టడీలో నిందితుల దగ్గర నుండి పోలీసులు పూర్తి వివరాలతో మినిట్ టూ మినిట్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నారు.

విచారణ పూర్తి కాగానే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చెయ్యనున్న పోలీసులు

విచారణ పూర్తి కాగానే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చెయ్యనున్న పోలీసులు


ఇప్పటికే ఈ కేసులో టెక్నికల్ ఆధారాలను కలెక్ట్ చేసిన పోలీసులు, కస్టడీలో నిందితులు ఇచ్చే సమాచారాన్ని కూడా చార్జిషీట్లో పొందుపరచాలని పోలీసులు భావిస్తున్నారు. ఇక అత్యాచారం, హత్య జరిగిన స్థలానికి నిందితులను తీసుకెళ్లి పోలీసులు సీన్ రీకనస్ట్రక్షన్ చేయనున్నారు. దిశను ఏ విధంగా ట్రాప్ చేశారు? ఆమె మొబైల్ ఏం చేశారు? అత్యాచారం చేసే ముందు మద్యం సేవించారా? ఎందుకు హత్య చేశారు? అనే విషయాలపై పోలీసులు మరోసారి ఆరా తీయనున్నారు.

కఠిన శిక్ష పడేలా చూస్తామన్న తెలంగాణా ప్రభుత్వం

కఠిన శిక్ష పడేలా చూస్తామన్న తెలంగాణా ప్రభుత్వం


ఇక ఈ కేసులో మొత్తం నిందితుల దగ్గర నుంచి వివరాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. దిశ కేసులో నిందితుల కస్టడీ పూర్తయిన మరుక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. వేగంగా విచారణ జరిపి దోషులకు కఠిన శిక్ష పడేలా చెయ్యాలని అటు తెలంగాణా ప్రభుత్వం కూడా భావిస్తుంది.

English summary
The police are hoping to have the information collected by the accused in custody and the chargesheet filed in the case. The police will take the accused to the place where the rape and murder took place. How has Disha been trapped? Where is her mobile ? drink alcohol before being raped? Why? The police will once again look into the matter
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X