హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2 కోట్ల 96 లక్షలకు పైగా తెలంగాణ ఓటర్లు.. జిల్లాల వారీగా లెక్కలివే..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : లోక్‌సభ సమరానికి సై అంటున్నారు అభ్యర్థులు. నామినేషన్ల పర్వం ముగియడంతో ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నారు. ఇక ఓటు అనే ఆయుధంతో నేతలను ఎన్నుకునేందుకు ఓటర్లు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూసినట్లయితే 2 కోట్ల 96 లక్షల 97 వేల 279 మంది ఓటర్లు ఉన్నారు. అందులో కోటి 49 లక్షల 19 వేల 751 మంది పురుష ఓటర్లుండగా.. కోటి 47 లక్షల 76 వేల 24 మంది మహిళా ఓటర్లున్నారు. ఇతరుల సంఖ్య చూసినట్లయితే 1,504 ఓట్లున్నాయి.

లోక్‌సభ పోరుకు 795 నామినేషన్లు.. ఎక్కడెక్కడ ఎన్నెన్ని?.. నిజామాబాద్ లో బ్యాలెట్?లోక్‌సభ పోరుకు 795 నామినేషన్లు.. ఎక్కడెక్కడ ఎన్నెన్ని?.. నిజామాబాద్ లో బ్యాలెట్?

 ఓటర్ల తుది జాబితా

ఓటర్ల తుది జాబితా

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల సప్లిమెంట్ లిస్టును విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. ఫిబ్రవరి 22వ తేదీన ప్రచురించిన జాబితా ప్రకారం తెలంగాణలో 2 కోట్ల 95 లక్షల 18 వేల 954 మంది ఓటర్లుగా నమోదయ్యారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిన వెసులుబాటు కారణంగా నిరంతర ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. అందులోభాగంగా ఈనెల 15 వరకు 3 లక్షల 38వేల మంది కొత్తగా తమ పేర్లు నమోదు చేసుకోవడానికి అప్లికేషన్లు సమర్పించారు.

 యువ ఓటర్లు

యువ ఓటర్లు

ఓటర్ల అప్లికేషన్లు పరిశీలించిన ఎన్నికల అధికారులు కొత్తగా లక్షా 78 వేల 325 మంది ఓటర్లకు అవకాశం కల్పించారు. దాంతో
లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసే వారి సంఖ్య 2 కోట్ల 96 లక్షల 97 వేల 279 మందికి చేరింది. అందులో 18, 19 సంవత్సరాల వయసున్న 6 లక్షల 52 వేల 744 మంది యువ ఓటర్లు తొలిసారిగా ఓటు హక్కు పొందారు. పురుష ఓటర్లు 3 లక్షల 65 వేల 548 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 2 లక్షల 87 వేల 103 మంది ఉన్నారు. ఇతరుల విషయానికొస్తే 93 మంది నమోదయ్యారు.

అత్యధికం.. అత్యల్పం

అత్యధికం.. అత్యల్పం

ఓటర్ల వివరాలను పరిశీలించినట్లయితే హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 41 లక్షల 77 వేల 703 మంది ఉన్నారు. ఇక వనపర్తి జిల్లాలో అత్యల్పంగా 2 లక్షల 47 వేల 419 మంది ఓటర్లున్నారు. లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా చూసినట్లయితే మల్కాజ్‌గిరి స్థానంలో అత్యధికంగా 31 లక్షల 49 వేల 710 మంది ఓటర్లుండగా.. మహబూబాబాద్ పరిధిలో 14 లక్షల 23 వేల 351 మంది ఓటర్లున్నారు. అదే శాసనసభ పరిధిలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 6 లక్షల 17 వేల 169 మంది.. అత్యల్పంగా భద్రాచలం అసెంబ్లీ స్థానంలో లక్షా 45 వేల 509 మంది ఓటర్లుగా నమోదయ్యారు.

సోషల్ మీడియా ఖర్చులపై నిఘా.. అభ్యర్థుల ప్రకటనలపై ఈసీ కన్నుసోషల్ మీడియా ఖర్చులపై నిఘా.. అభ్యర్థుల ప్రకటనలపై ఈసీ కన్ను

ఓటర్ల సంఖ్య జిల్లాల వారీగా :

ఓటర్ల సంఖ్య జిల్లాల వారీగా :

ఓటర్ల సంఖ్య జిల్లాల వారీగా :

జిల్లా పురుషులు మహిళలు
కొమురంభీం 2,01,995 2,00,656
మంచిర్యాల 2,96,461 2,93,498
ఆదిలాబాద్ 2,03,321 2,09,654
నిర్మల్ 3,24,917 3,47,754
నిజామాబాద్ 6,11,709 6,80,119
కామారెడ్డి 3,04,384 3,23,990
జగిత్యాల 3,21,370 3,41,851
పెద్దపల్లి 3,35,796 3,33,744
కరీంనగర్ 4,86,528 4,93,681
సిరిసిల్ల 2,11,324 2,22,572
సంగారెడ్డి 6,11,004 5,96,079
మెదక్ 2,02,382 2,14,052
సిద్ధిపేట 4,47,763 4,54,181
రంగారెడ్డి 15,53,097 14,29,875
వికారాబాద్ 4,46,441 4,46,685
మేడ్చల్ 12,39,801 11,41,485
హైదరాబాద్ 21,64,329 20,13,182
మహబూబ్ నగర్ 5,39,648 5,43,844
నాగర్ కర్నూల్ 3,33,461 3,28,877
వనపర్తి 1,24,406 1,22,998
గద్వాల 2,27,725 2,30,527
నల్గొండ 6,81,450 6,83,814
సూర్యాపేట 4,57,595 4,68,481
భువనగిరి 2,10,605 2,09,544
జనగామ 3,48,924 3,49,635
మహబూబాబాద్ 2,20,304 2,24,223
వరంగల్ రూరల్ 2,11,948 2,18,719
వరంగల్ అర్బన్ 3,57,620 3,63,291
భూపాలపల్లి 2,38,456 2,40,072
భద్రాద్రి 4,50,368 4,69,316
ఖమ్మం 5,54,619 5,79,625

English summary
Voters are ready to elect leaders with a weapon of voting. The state witnessed 2 crore 96 lakh 97 thousand 279 voters. 49 lakh 19 thousand 751 male voters, the number of female voters are 47 lakh 76 thousand 24. There are 1,504 votes of others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X