హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దుబ్బాక, బల్దియాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ..?: జేజమ్మ ఆరోపణ

|
Google Oneindia TeluguNews

టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై జేజమ్మ డీకే అరుణ విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నికలో, గ్రేటర్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులైన డీకే అరుణ.. మరింత దూకుడు పెంచారు. కాంగ్రెస్-టీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలూ బీజేపీలోకి..: డీకే అరుణ సంచలనం, కేసీఆర్, హరీశ్‌కు అదే భయంటీఆర్ఎస్ ఎమ్మెల్యేలూ బీజేపీలోకి..: డీకే అరుణ సంచలనం, కేసీఆర్, హరీశ్‌కు అదే భయం

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్- కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయని ఆరోపించారు. రెండు పార్టీలు అభ్యర్థులు నిలిపినా.. ప్రచారం మాత్రం ఒక పార్టీ మాత్రమే చేస్తాయని ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు గ్రేటర్ ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారని డీకే అరుణ హాట్ కామెంట్స్ చేశారు.

dk aruna slams trs, congress parties..

బల్దియా ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతోందని డీకే అరుణ తెలిపారు. బీజేపీలో గ్రూపులకు, వర్గాలకు తావు లేదని చెప్పారు. పనిలో పనిగా కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కట్టడం లేదని మండిపడ్డారు. కానీ వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. చట్టాన్ని కేసీఆర్ వ్యతిరేకించడంలో అర్థం లేదు అని.. బీజేపీ అంటే భయంతోనే వ్యతిరేక గళం వినిపిస్తున్నారని మండిపడ్డారు.

Recommended Video

మద్యపానం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయి : డి.కె. అరుణ || Oneindia Telugu

కేసీఆర్‌పై ప్రజలకు ఉన్న భ్రమలు తొలగిపోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని జేజమ్మ తెలిపారు. తనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవీ రానందుకు బాధగా లేదని డీకే అరుణ తెలిపారు. క్రమశిక్షణ కలిగిన నేతగా బీజేపీ బలోపేతం కోసం పాటుపడతానని చెప్పారు.

English summary
bjp vice president dk aruna slams trs, congress parties on various issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X