• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వ్యాక్సిన్ అంటే తెలుసా..? కమీషన్లే ఎరుక.. వేల కోట్ల స్కాం, కేటీఆర్‌పై విజయశాంతి నిప్పులు

|

కరోనా వైరస్ విజృంభిస్తోన్న క్రమంలో వ్యాక్సిన్ అవసరం అర్థమవుతోంది. దీంతో ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఇదే అంశంపై రాములమ్మ విజయశాంతి విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచారు. అసలు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా..? అని మంత్రి కేటీఆర్‌ను అడిగారు. టీకా ఉత్పత్తి ఎలా జరుగుతుందో కొంతమాత్రమైనా అవగాహన ఉందా..? వ్యాక్సిన్ అనేది గంటలలోనో... రోజులలోనో... ఉత్పత్తి చేసి.. ఇప్పటికిప్పుడు ఇబ్బడిముబ్బడిగా తయారు చేసేది కాదు. అదొ ప్రత్యేకమైన ప్రక్రియ అని ఫైరయ్యారు.

    Telangana రోజుకు కోటి టీకాలు ఇవ్వండి.. కేంద్రానికి Congress లేఖ !!
    వ్యాక్సిన్ ఇలా..

    వ్యాక్సిన్ ఇలా..

    శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి వ్యాక్సిన్‌ రూపకల్పనకు రేయింబవళ్లు కష్టపడతారని గుర్తుచేశారు. వ్యాక్సిన్ల తయారీ కోసం ఎందరో అవిశ్రాంతంగా పనిచేశారని.. సాధారణంగా టీకాల తయారీకి ఏళ్లు పడుతుందన్నారు. నరేంద్ర మోడీ సర్కారు ప్రోత్సాహం, నిర్దిష్టమైన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయడంతో.. మన శాస్త్రవేత్తలు తక్కువ సమయంలోనే అభివృద్ధి చేశారని వివరించారు. ఫలితంగా రెండు స్వదేశీ టీకాలు అందుబాటులోకి వచ్చాయపి తెలిపారు. ఇంకా ఎన్నో వ్యాక్సిన్లు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని.. దేశీయ టీకా తయారీతో భారత్‌ సత్తా మరోసారి ప్రపంచానికి తెలిసిందని వివరించారు.

    డిసెంబర్.. జనవరిలో ఇక్కడ

    డిసెంబర్.. జనవరిలో ఇక్కడ

    ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి విజన్ లేదంటూ మాట్లాడుతున్న కేటీఆర్‌కు సరైన విజ్ఞత లేదని అర్థమవుతోందన్నారు. ప్రపంచంలో వ్యాక్సినేషన్ మొదలైందే గత డిసెంబర్‌లో..! భారత్‌లో జనవరి 16వ తేదీన వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైందని చెప్పారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 25 కోట్లకు పైగా టీకా డోసుల పూర్తి చేశామన్నారు. ఇది అమెరికా కంటే ఎక్కువ అని.. ఈ లెక్కలు తెలుసా కేటీఆర్ అని ఫైరయ్యారు. వేగంగా టీకాలను అందిస్తోన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్లు అందేలా నరేంద్ర మోడీ ప్రభుత్వ తీవ్రంగా కృషి చేస్తోందని చెప్పారు. వీలైన అన్ని మార్గాల ద్వారా టీకాల సేకరణకు మోడీ సర్కార్ నడుం బిగించిందని తెలిపారు. డిసెంబర్ నాటికి 250 కోట్ల డోసుల టీకాలను భారత్ సేకరించేలా ప్రణాళికలు రూపొందించిందని చెప్పారు.

    దుష్ర్పచారం తగదు

    టీకాల పంపిణీపై టీఆర్ఎస్ సర్కారు దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. స్వదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిచేయకుండా విదేశాలకు టీకాలు అమ్ముకొంటుందని కేంద్రంపై నిందలు మోపుతున్నవారికి బాధ్యత ఉందా..? అని అడిగారు. స్వదేశీ సాంకేతికతతో టీకా తయారీ చేసుకోవడం మీరు ఓర్చుకోలేకపోతున్నారా..? అని నిలదీశారు. WHO, UNO సలహా మేరకు, ఉత్పత్తి సంస్థల నిబంధనల ప్రకారం కొవాగ్జిన్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా తయారు చేసిన కొవిషీల్డ్ స్నేహపూర్వకంగా ఇతర దేశాలకు పంపిణీ చేయాల్సిందేనని అన్నారు. విదేశాలకు పంపిన టీకాలు సరైన అనుమతులు, ఇతర వాణిజ్యపరమైన నిబంధనల ప్రకారం పంపినవేనని చెప్పారు. నిబంధనల ప్రకారం ఉత్పత్తి సంస్థలు కచ్చితంగా పంపాల్సిందేనని.. ఆ విషయం తెలుసుకోకుండా మాట్లాడటం తప్పకుండా అవివేకమేనని వివరించారు.

    ఇక్కడ ఆవిర్భవించలేదే

    ఇక్కడ ఆవిర్భవించలేదే

    కరోనా మహమ్మారి వూహాన్ లో పుట్టి వివిధ దేశాలకు విస్తరించి భారత్‌కు అంటుకుందని చెప్పారు. ప్రపంచానికి వ్యాక్సినేషన్ జరిగినప్పుడే వైరస్ నిర్మూలన అనేది సుసాధ్యం. అవివేకంతో తెలంగాణలోనే వ్యాక్సిన్ చేస్తా అనుకుంటే అది మీ అజ్ఞానమే అవుతుందన్నారు. ఫైజర్ సంస్థను వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపితే ఒక్క డోసుకు రూ. 2,880 నిర్ణయించారని.. భారత జనాభా లెక్కల ప్రకారం రూ. 7 లక్షల కోట్లు ఆ సంస్థకు ఇవ్వాల్సి వచ్చేదని చెప్పారు. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టిందని తెలిపారు. దీన్ని కూడా తప్పుపట్టిన టీఆరెస్ నాయకత్వానికి కొంచమైన సోయి ఉందా..? అని అడిగారు.

    కమీషన్ల బాపత్

    కమీషన్ల బాపత్

    కేసీఆర్ కుటుంబం జీవితమే కమీషన్ల బాపతు అని.. అందుకే ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలను భారతదేశానికి ఎందుకు తీసుకురావడం లేదని గాయి గాయి పెడ్తున్నారని మండిపడ్డారు. దేశ సంపదను ఆ కంపెనీలకు దోచిపెట్టాలనుకుంటున్నారా..? దేశంలో ఒక డోసు టీకా రూ. 250 ధరకే దొరకొద్దా..? రూ. 2వేలు, రూ.3వేలు అంటూ ఇష్టారీతిన రేట్లు పెంచుతూ కమీషన్లు దండుకోవాలనుకోవడం టీఆర్ఎస్ దుర్బుద్ధి కాదా..? అని అడిగారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై టీఆర్ఎస్ ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపడం దుర్మార్గంగా అభివర్ణించారు. ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాక్సినేషన్ జరిగిన దేశాల్లో భారత్ రెండోస్థానంలో ఉందన్నారు. మొదటి డోసు ఇచ్చిన స్థానాల్లో భారత్ మొదటిస్థానంలో ఉందని చెప్పారు. వచ్చే డిసెంబర్ నాటికి మొత్తం 250 కోట్ల డోసులు వ్యాక్సిన్ ఇవ్వాలన్న లక్ష్యంతో నరేంద్ర మోదీ సర్కారు పనిచేస్తోందని వివరించారు.

    వేల కోట్ల స్కాం..

    వేల కోట్ల స్కాం..

    కరోనా సమయంలో రూ.వేల కోట్ల కుంభకోణం జరిగిందని. ప్రైవేటు ఆస్పత్రులకు దోచిపెట్టి కమీషన్లు దండుకుంది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆరోపించారు. వేలమంది పేద ప్రజల ప్రాణాలను బలిపెట్టి ఖజానా నింపుకోవడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ గురించి స్పందించకుండా.. టాస్క్ ఫోర్స్ అంటూ కొన్ని ఆసుపత్రులపై జులుం చూపెట్టి.. దోపిడీ చేసే పలు ప్రైవేట్ ఆసుపత్రులను చూసీచూడనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారు..? ఈ వేలకోట్ల అవినీతిలో సీఎం కేసీఆర్ కుటుంబ కమీషన్ ఎంతనో వారే చెప్పాలన్నారు. దేశమంతా వ్యాక్సినేషన్‌ను కేంద్రప్రభుత్వం ఉచితంగానే ఇచ్చిందన్నారు. 80 లక్షల డోసులను కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందించిందని... అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత కొనుగోలు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

    చిన్న దేశాలతో పోలిక..

    చిన్న దేశాలతో పోలిక..

    హైదరాబాద్ జనాభా అంత కూడా లేని దేశాలతో 130 కోట్ల జనాభా గల భారతదేశాన్ని పోల్చడం మీ అవగాహనరాహిత్యానికి నిదర్శనం కాదా? అని రాములమ్మ విరుచుకుపడ్డారు. భారత్ బయోటెక్ కంపెనీ మన దగ్గరే ఉన్నా, ఆ సంస్థ దగ్గర్నుంచి వ్యాక్సిన్ తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. ఆ సంస్థ సుమారు పది లక్షల డోసులను మన రాష్ట్రంలోని ప్రైవేట్ హాస్పిటళ్లకు సరఫరా చేసినట్టు హెల్త్ ఆఫీసర్లే చెప్తున్నారు. ప్రభుత్వానికి మాత్రం ఇప్పటివరకూ రెండున్నర లక్షల డోసులే సరఫరా అయ్యాయి. అంటే మతలబు ఏంటి..? ప్రైవేటు ఆస్పత్రులతో కుమ్మక్కై కమీషన్ల కోసం ప్రజల ప్రాణాలు బలిపెట్టాలనుకుంటున్నారా..?
    టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 2,500 కోట్ల ఖర్చుతో గ్లోబల్ టెండర్లు పిలిచి వ్యాక్సిన్ కొనుక్కుంటామంటూ బాతాలు కొడుతున్నరు కదా.. అని విజయశాంతి విరుచుకుపడ్డారు.

    English summary
    mister ktr do you know vaccine bjp leader vijayashanti asked. she angry on ktr recent vaccine comments
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X