వావ్.. 156 రాళ్లు తొలగింపు.. అదీ కూడా కీ హోల్ సర్జరీ.. శభాష్ డాక్టర్స్
వైద్య చరిత్రలో అప్పుడప్పుడు వింత ఘటనలు జరుగుతుంటాయి. వైద్యులకే అర్థం కావు. అవును విశ్వనగరి భాగ్యనగరంలో కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. కిడ్నీలో ఎక్కువ రాళ్లను వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలగించారు. ఆ రోగికి విజయవంతంగా ఆపరేషన్ చేసి.. రాళ్లను తొలగించారు. దీంతో ఆ పేషంట్ ఆనంద పడ్డాడు. వైద్యులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

బసవరాజు మడివలార్కు ఆపరేషన్
కర్ణాటక హుబ్లీకి చెందిన బసవరాజ్ మడివలార్.. టీచర్‌గా విధులు పనిచేస్తున్నారు. గతంలో ఆయనకు శస్త్రచికిత్సచేసి కిడ్నీలో రాళ్లు తొలగించారు. అయితే ఇటీవల కడుపులో మళ్లీ భరించలేని నొప్పి రావడంతో స్కానింగ్ తీయించుకున్నాడు. కుడివైపు కిడ్నీలో కూడా రాళ్లు ఉన్నాయని అందులో తేలింది. అయితే ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 350 గ్రాముల బరువున్న 156 రాళ్లు ఉన్నాయని స్కానింగ్‌లో తేలింది.

దేశంలో తొలిసారి..
దేశంలో తొలిసారిగా పెద్ద ఆపరేషన్ చేయకుండా ల్యాప్రోస్కోపీ, ఎండోస్కోపీలతో కీ హోల్ సర్జరీ నిర్వహించారు. కిడ్నీలో ఉన్న 156 రాళ్లను విజయవంతంగా తొలగించారు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ చంద్రమోహన్ సర్జరీ విషయాలను వెల్లడించారు. మూత్రకోశం సమీపంలో కిడ్నీ ఉంటుంది. బసవరాజ్‌కు మాత్రం పొట్ట సమీపంలో కిడ్నీ ఉంది. దీనిని ఎక్టోపిక్ కిడ్నీ అంటారు. ఇలాంటివారికి కిడ్నీలో రాళ్లను తీయడం ఎంతో సంక్లిష్టతతో కూడుకున్న అంశం అని వివరించారు.

ల్యాప్రొస్కొపిక్ సర్జరీ
కడుపుపై కోత లేకుండా కేవలం కీ హోల్ సర్జరీ మాత్రమే చేసి రాళ్లను తీసేశాం అని వివరించారు. తొలుత పెద్ద రాయిని తీశాం అని.. ఆ తర్వాత దాని కింద ఉన్న చిన్న చిన్న రాళ్లను తొలగించామని పేర్కొన్నారు. ఇతనికి రెండేళ్ల ముందే కిడ్నీలో రాళ్లు ఏర్పడటం ప్రారంభమయ్యాయని వివరించారు. అతనికి ఎలాంటి లక్షణాలు కన్పించలేదన్నారు. ఉన్నట్టుండి కడుపులో నొప్పి రావడంతో పరీక్షలు చేయించుకుంటే అసలు విషయం తెలిసిందని వివరంచారు. సర్జరీ విజయవంతంగా ముగిసిందని.. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని డాక్టర్ చెప్పుకొచ్చారు.

ఏం చేయాలంటే..
మానవ శరీరంలో కిడ్నీ పనితీరు ముఖ్యం.. మనం తీసుకున్న ఆహారం/ ద్రవ పదార్థాలను ఫిల్టర్ చేస్తుంది. మన నిరంతర ప్రక్రియకు కిడ్నీ ఎంతో ఇంపార్టెట్ రోల్ పోషిస్తోంది. శరీరానికి సరయిన నిద్ర, తిండి, రెస్ట్ కూడా ముఖ్యం అని వైద్యులు చెబుతుంటారు. అలా లేని సమయంలో సమస్యలు వస్తుంటాయి. అచ్చం బసవరాజు విషయంలోనే కూడా ఇలాగే జరిగింది.