హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్ర ఆక్టోపస్ సర్వే వెనుక ఎవరిదైనా హస్తముందా?.. లగడపాటి ఫలితాలపై 10 అనుమానాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ నేతల హవా నడుస్తోందా? ఆంధ్ర ఆక్టోపస్ గా ప్రాచుర్యం పొందిన లగడపాటి రాజగోపాల్ సర్వే ఆంతర్యమేంటి. ఆర్జీవీ ఫ్లాష్ సర్వే పేరిట గతంలో నిర్వహించిన ఫలితాలు.. తాజాగా మంగళవారం విడుదల చేసిన ఫలితాలు తేడాగా ఎందుకున్నాయి? ఈ గ్యాప్ లో లగడపాటిపై ఎవరైనా ప్రభావం చూపించారా? ఇలాంటి అనేక ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై పెద్ద దుమారమే రేగుతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సర్వేకు సంబంధించి తిరుపతిలో తొలుత మాట్లాడిన లగడపాటి రాజగోపాల్.. స్వతంత్ర అభ్యర్థుల హవా నడుస్తుందని చెప్పారు. 8-10 మంది ఇండిపెండెంట్లు గెలుస్తున్నారని బాంబ్ పేల్చారు. రోజుకో ఇద్దరి పేర్లు బయటపెడతానని చెప్పి.. సమగ్ర ఫలితం మాత్రం పోలింగ్ జరిగే ఏడో తేదీనాడు చెబుతానని ప్రకటించారు. అయితే దానికి భిన్నంగా ఎన్నికలకు మూడు రోజుల ముందు ఇంచుమించు ఆ వివరాలు తేల్చేశారు. ఈనేపథ్యంలో ఆంధ్ర ఆక్టోపస్ సర్వే వెనుక ఎవరిదైనా హస్తముందా అనే కోణంలో లగడపాటి ఫలితాలపై క్షేత్రస్థాయిలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

Does anyone ever hold back the results of the Lagadapati Survey

లగడపాటి సర్వేపై 10 అనుమానాలు

1. ఎన్నికలు జరిగే డిసెంబర్ ఏడో తేదీన సర్వే ఫలితాలు వెల్లడిస్తానంటూ చెప్పిన లగడపాటి రాజగోపాల్.. మూడు రోజుల ముందే అటుఇటుగా వివరాలు వెల్లడించడం వెనుక ఎవరి హస్తముంది?

2. మంగళవారం ప్రెస్ మీట్ పెట్టకముందు, అటు చంద్రబాబుతో గానీ.. ఇటు కేటీఆర్ తో గానీ సర్వే వివరాలు పంచుకున్నారా? ఆ విషయం ఎందుకు ప్రస్తావించలేదు?

3. 8-10 మంది స్వతంత్రులు గెలుస్తారని చెప్పిన లగడపాటి.. మొదట ఇద్దరు పేర్లు చెప్పి, మంగళవారం నాడు మరో ముగ్గురి పేర్లు చెప్పి.. ఇంకో ముగ్గురు పేర్లు చెప్పకపోవడం వెనుక ఆంతర్యమేంటి?

4. మంగళవారం నాటి ప్రెస్ మీట్ తొలుత విజయవాడలో పెడదామనుకుని తర్వాత హైదరాబాద్ కు షిఫ్ట్ చేయడానికి గల కారణాలేంటి?

5. గతంలో టీఆర్ఎస్ కు 65-70 సీట్లు వస్తాయని కేటీఆర్ కు లగడపాటి చెప్పినట్లయితే.. తాజా సర్వేలో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ఎందుకు చెప్పినట్లు?

6. ఇదివరకు ఒకసారి ఆర్జీవీ ఫ్లాష్ సర్వే పేరుతో రిలీజయిన ఫలితాల్లో టీఆర్ఎస్ కు భారీ మెజార్టీ అన్నారు. ఇప్పుడు ఆ సర్వేతో సంబంధం లేదంటున్నారు. ఇప్పటి సర్వే ఫలితాలు అప్పుడే చెప్పి ఉండొచ్చు కదా.. ఇప్పుడేమో కూటమిదే పైచేయి అంటున్నారు. దీని వెనక మతలబేంటి?

7. ఏ పార్టీలో లేనంటూనే మంగళవారం విడుదల చేసిన సర్వే ఫలితాలు దేనికి సంకేతం. మొన్నేమో టీఆర్ఎస్.. నిన్నేమో కూటమి ఆధిక్యం. రాజకీయ నేతలతో సంబంధం లేకుంటే ఇలా సర్వే ఫలితాలు ఎందుకు మార్చుతున్నట్లు?

8. వంద నియోజకవర్గాల్లో సర్వే చేయించామని లగడపాటి చెబుతున్నారు. 1000-1200 మంది నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు తెలిపారు. మిగతా 19 నియోజకవర్గాల్లో సర్వే ఎందుకు చేయించలేదు? కేవలం వెయ్యి మంది చెప్పిన అభిప్రాయాలు ఆ నియోజకవర్గం ఫలితాలను డిసైడ్ చేస్తాయా?

9. ఇప్పటివరకు వెల్లడించిన ఐదుగురు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినవారే కదా. ఈ ఐదుగురికి లగడపాటి పరోక్షంగా గానీ, ప్రత్యక్షంగా గానీ సపోర్ట్ చేస్తున్నారా?

10. టీడీపీ పొత్తు కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందని చెప్పడం వెనుక మర్మమేంటి? 2014 ఎన్నికల్లో 68.5 శాతం పోలింగ్ నమోదైంది కాబట్టి ఈసారి ఓటింగ్ పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్లని అది కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందని చెప్పడం.. అదే ఓటింగ్ తగ్గితే హంగ్ వస్తుందని చెప్పడం వెనుక అసలు ఉద్దేశమేంటి?

సర్వే సరి.. ఇలాంటి వాటికి జవాబిస్తారా?

లగడపాటి మంగళవారం ప్రెస్ మీట్ పై ఇలాంటి అనుమానాలు చాలానే వ్యక్తమవుతున్నాయి. అటు టీఆర్ఎస్ శ్రేణులు ఇదేం సర్వే అంటూ పెదవి విరుస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. పోలింగ్ శాతం కీలకంగా మారుతుందని లగడపాటి చెప్పడమేంటి.. రాజకీయ అవగాహన ఉన్న ఎవరైనా చెప్పేదే అనేది ఒక వాదన. అన్నీ పార్టీలకు సమానదూరమని చెబుతూనే ఇలా వన్ సైడ్ ఫలితాలు వెల్లడించడంపై క్షేత్రస్థాయిలో నమ్మకం లేని పరిస్థితి కనిపిస్తోందంటున్నారు కొందరు. ఏదిఏమైనా ఇలాంటి 10 అనుమానాలే కాదు వంద అనుమానాలైనా సరే లగడపాటి జవాబు ఇవ్వాలనేది మరి కొందరి వాదన.

English summary
Does anyone ever hold back the results of the Andhra Octopus Lagadapati Rajagopal Survey on Telangana Assembly polls? A comprehensive outcome was announced on the seventh day of the polling. However, in contrast, the details of the survey are almost three days before the elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X