హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రగతి భవన్ లో కుక్క మరణం .. డాక్టర్ పై కేసు నమోదు

|
Google Oneindia TeluguNews

సీఎం కేసీఆర్ నివాసం ప్రగతి భవన్‌లో కుక్క మరణిస్తే డాక్టర్ నిర్లక్ష్యమే కారణం అని కేసు నమోదు చేశారు సదరు కుక్కలను చూసుకునే ఆలీ ఖాన్ . సీఎం కేసీఆర్ నివాసంలో ఇటీవల హస్కీ అనే ఓ పెంపుడు కుక్క మృతిచెందింది. ఆ కుక్క మరణం డాక్టర్ కు తిప్పలు తెచ్చి పెట్టింది .

సింగిల్ గా వచ్చి కూల్ గా దోచేసే దొంగ పై పీడీ యాక్ట్సింగిల్ గా వచ్చి కూల్ గా దోచేసే దొంగ పై పీడీ యాక్ట్

బహదూర్‌పురాకు చెందిన ఆసిఫ్‌ అలీఖాన్‌ ఐదేళ్లుగా ప్రగతి భవన్‌ డాగ్‌ హ్యాండ్లర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మొత్తం 9 పెంపుడు కుక్కలకు సంరక్షణ చూసుకుంటూ శిక్షణనిస్తున్నాడు. ఈ నెల 10వ తేదీన 11నెలల హస్కీ అనే పెంపుడు కుక్క అనారోగ్యానికి గురైంది. దీంతో ప్రగతి భవన్‌ డాగ్స్‌ హ్యాండ్లర్‌ ఆసిఫ్‌ అలీఖాన్‌ రెగ్యులర్ వెటర్నరీ డాక్టర్‌కు సమాచారం ఇవ్వటంతో ఆ వైద్యుడు వచ్చి హస్కీకి చికిత్స అందించాడు.

Dog death in Pragati Bhavan... Case filed on doctor

Recommended Video

Telangana Budget 2019 : మరికాసేపట్లో అసెంబ్లీ లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న తెలంగాణ సర్కార్

తీవ్రంగా జ్వరం ఉండటంతో లివర్‌ టానిక్‌ ఇచ్చినట్టు సమాచారం . ఆ తరువాత హస్కీ పరిస్ధితి మరింత విషమించటంతో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 4లో యానిమల్‌ కేర్‌ క్లినిక్‌కు తీసుకెళ్లాడు. అయితే డాక్టర్ చికిత్స చేస్తుండగానే హస్కీ మరణించింది. దీంతో డాగ్స్ హ్యాండ్లర్ ఆలీఖాన్.. యానిమల్ కేర్ క్లినిక్ వైద్యుడైన రంజిత్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే కుక్క మృతిచెందిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ఆ వైద్యుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ ఇంట్లో కుక్క చావు ఆ వైద్యుడికి ఇబ్బందులు తెచ్చి పెట్టింది .

English summary
Ali Khan, who is taking care of the dogs, said the doctor's negligence was the cause of death of the dog in the Pragati Bhavan, the residence of CM KCR. Husky, a pet dog, recently died at the home of CM KCR. The death of the dog brought the problems to the Doctor
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X