హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా భయం వద్దు కానీ, ‘వారియర్స్’కు కేసీఆర్ తీపికబురు, రోగులకు వైద్యంలో రాజీలేదు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనా మహమ్మారి విషయంలో ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, అయితే, అజాగ్రత్త కూడా మంచిది కాదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. కరోనా కట్టడిపై సీఎం సమీక్ష నిర్వహించారు. కరోనా బాధితులు అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు.

ఆగస్టు నుంచి బీటెక్ విద్యా సంవత్సరం: విద్యా శాఖపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలుఆగస్టు నుంచి బీటెక్ విద్యా సంవత్సరం: విద్యా శాఖపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు

భయాందోళనలు అవసరం లేదు కానీ..

భయాందోళనలు అవసరం లేదు కానీ..

‘కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురి కావద్దు, అదే సందర్భంలో నిర్లక్ష్యం కూడా వద్దు. కరోనా సోకిన వారు అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదు, ఎంతమందికైనా సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, వైద్య సిబ్బంది సంసిద్ధంగా ఉంది. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో మరణాలు తక్కువ అని అన్నారు. రికవరీ రేటు 67 శాతం ఉన్నందువల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు' అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

కరోనా రోగులకు వైద్యం అందించడంలో రాజీలేదు

కరోనా రోగులకు వైద్యం అందించడంలో రాజీలేదు


రాష్ట్రంలో పీహెచ్‌సి స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా విషయంలో కావాల్సిన వైద్యం అందించడానికి ఏర్పాట్లున్నాయి. కాబట్టి వీటిని ప్రజలు వినియోగించుకోవాలి. కరోనా వ్యాప్తి నివారణకు వైరస్ సోకిన వారికి మంచి వైద్యం అందించడానిక ప్రభుత్వం ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధంగా ఉంది.
గాంధీ, టిమ్స్ లలోనే దాదాపు 3 వేల బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవి 5 వేలు ఉన్నాయి. 1500 వెంటిలేటర్లు సిద్దంగా ఉన్నాయి. అన్ని ఆసుపత్రుల్లో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల బెడ్లను కేవలం కరోనా కోసమే ప్రత్యేకంగా కేటాయించామని కేసీఆర్ వివరించారు.

అదనంగా వంద కోట్లు.. పదవీ విరమణ వయస్సు పెంపు

అదనంగా వంద కోట్లు.. పదవీ విరమణ వయస్సు పెంపు

కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, మెరుగైన వైద్యం అందించే విషయంలో ఆరోగ్య శాఖ మంత్రి, సిఎస్ తక్షణ నిర్ణయాలు తీసుకుని అమలుచేయడానికి వీలుగా జనరల్ బడ్జెట్ కు అదనంగా రూ.100 కోట్లు కేటాయించారు. వైద్య కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు యుజిసి స్కేల్ అమలు, కొత్తగా నియామకమైన నర్సులకు పాత వారితో సమానంగా వేతనాలు, ఆయుష్ విభాగాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని 65 ఏళ్లకు పెంపు

Recommended Video

Dharna Chowk Turned As Vegetable Markets Due to Lockdown మార్కెట్ గా మారిన ఉద్యమాల అడ్డా ధర్నా చౌక్!
కరోనా వారియర్స్ సీఎం తీపికబురు

కరోనా వారియర్స్ సీఎం తీపికబురు

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు వైద్యఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరికీ పదిశాతం అదనపు వేతనం కొనసాగింపు; పోలీసుశాఖ సిబ్బంది, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుధ్య సిబ్బందికీ ఇన్సెంటివ్ కొనసాగింపునకు నిర్ణయం. రాష్ట్రంలో పిజి పూర్తి చేసిన 1200 మంది వైద్యులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవాలని, పి.హెచ్.సి.లలో ఖాళీగా ఉన్న 200 మంది డాక్టర్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రులు బెడ్ల అందుబాటు విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రతీ ఆసుపత్రి తమ వద్ద ఎన్ని బెడ్లు ఉన్నాయి? అందులో ఎన్ని ఖాళీగా ఉన్నాయి అనే వివరాలు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియచేయాలి.

English summary
Don't panic: CM KCR review on coronavirus situation in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X