హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎయిర్‌లిఫ్ట్: కోల్‌కతలో డాక్టర్ బ్రెయిన్‌డెడ్: హైదరాబాద్‌లో పేషెంట్‌కు లంగ్స్: అదే హైలైట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతలో బ్రెయిన్ డెడ్ గురైన ఓ డాక్టర్ నుంచి సేకరించిన ఊపిరితిత్తులను యుద్ధ ప్రాతిపదికన హైదరాబాద్‌కు తరలించిన ఉదంతం ఇది. హైదరాబాద్‌ బేగంపేట్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉన్న ఓ వ్యక్తికి ఆ ఊపిరితిత్తులను అమర్చారు డాక్టర్లు. ఆయన ప్రాణాలను నిలపగలిగారు. తెల్లవారు జామున చోటు చేసుకున్న ఈ ఘటన సినీ ఫక్కీని తలపించింది. కోల్‌కత నుంచి విమానం ద్వారా తీసుకొచ్చిన ఈ ఊపిరితిత్తులను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 25 నిమిషాల్లో కిమ్స్ ఆసుపత్రికి తరలించడం హైలైట్.

చండీగఢ్‌కు చెందిన ఓ వ్యక్తి ఊపిరితిత్తుల సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఊపిరితిత్తులను అత్యవసరంగా మార్పిడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఊపిరితిత్తులను మార్చకపోతే బతికించడం కష్టమంటూ డాక్టర్లు కూడా తేల్చేశారు. అవయవ దానం వల్ల ప్రాణాలను నిలబెట్టవచ్చని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జీవన్‌దాన్ ఫౌండేషన్.. ఊపిరితిత్తుల దాతల కోసం అన్వేషణ మొదలు పెట్టింది.

Donor lungs flown in from Kolkata transplanted in Kims Hospital in Hyderabad

కోల్‌కతలో ఓ యువ డాక్టర్ బ్రెయిన్ డెడ్‌కు గురైన సమాచారాన్ని ఫౌండేషన్ ప్రతినిధులు సేకరించారు. వెంటనే కోల్‌కతలోని రీజనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (రొట్టో) ప్రతినిధులను సంప్రదించారు. వారు అవయవదానికి డాక్టర్ కుటుంబ సభ్యులను ఒప్పించారు. ఊపిరితిత్తులను సేకరించడానికి కిమ్స్ డాక్టర్లు కోల్‌కతాకు బయలుదేరి వెళ్లారు. అక్కడి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్సెస్‌ (ఐఎన్‌కే)లో ఉన్న బ్రెయిన్ డెడ్ డాక్టర్ నుంచి ఊపిరితుత్తులను సేకరించారు. తెల్లవారుజామున 4.40 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్‌ చేరుకున్నారు.

Recommended Video

RGV 'మర్డర్' సినిమా కి ఝలక్ .. రిలీజ్ వాయిదా | Ram Gopal Varma | Oneindia Telugu

విమానాశ్రయం నుంచి కిమ్స్ ఆసుపత్రికి తరలించడానికి హైదరాబాద్ నగర పోలీసులు గ్రీన్ ఛానల్‌ను ఏర్పాటు చేశారు. విమానాశ్రయం నుంచి అంబులెన్స్ ద్వారా 24 నిమిషాల్లో కిమ్స్ ఆసుపత్రికి ఊపిరితిత్తులను చేరవేయగలిగారు. కిమ్స్ డాక్టర్లు సుమారు ఏడు గంటల పాటు శ్రమించి ఊపిరితిత్తుల మార్పిడిని విజయవంతం చేశారు. గ్రీన్ ఛానల్‌కు సంబంధించిన వీడియోను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

English summary
The lungs of a young brain-dead donor were airlifted in the early hours of Monday from Kolkata and donated to a patient in to Hyderabad. The recipient, who was suffering from lung disease, was dependent on oxygen supply and was undergoing treatment at the KIMS Hospitals in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X