హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్కూల్స్ ఇప్పుడే తెరవద్దు.. వ్యాక్సినేషన్ తర్వాతే, కేసీఆర్‌కు షర్మిల సూచన

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. దీంతో లాక్ డౌన్ ఎత్తివేశారు. దేశంలో లాక్ డౌన్ ఎత్తివేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 20వ తేదీ నుంచి మునుపటి మాదిరిగా ఎక్కడికైనా వెళ్లొచ్చు. అయితే స్కూల్స్ కూడా రీ ఓపెన్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. జూలై 1వ తేదీ నుంచి పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయని స్పష్టంచేసింది. కానీ పేరంట్స్ మాత్రం భయపడిపోతున్నారు. వారిని థర్డ్ వేవ్ మాట భయాందోళనకు గురిచేస్తోంది.

రీ ఓపెన్ వద్దు..

రీ ఓపెన్ వద్దు..

స్కూల్స్ రీ ఓపెన్‌పై సర్వత్రా వ్యతిరేకత వస్తోంది. పేరంట్స్, రాజకీయ పార్టీలు తప్పుపడుతున్నాయి. పిల్లల ఆరోగ్యం గురించి పట్టించుకోవాలని కోరాయి. అయితే ఇదే అంశంపై వైఎస్ షర్మిల కూడా స్పందించారు. తెలంగాణ‌ రాష్ట్రంలో జులై 1 నుంచి పాఠ‌శాల‌లు తెరిచే నిర్ణ‌యాన్ని మార్చుకోవాలని వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా సీఎం కేసీఆర్‌ను కోరారు. క‌రోనా థ‌ర్డ్ వేవ్ ప్ర‌మాదం పొంచి ఉంద‌ని నిఫుణులు హెచ్చ‌రిస్తున్నారని గుర్తుచేశారు ఒక‌వైపు ప్ర‌జ‌ల‌కు ఇంకా వ్యాక్సినేష‌న్ ప్రక్రియ పూర్తి కాలేదని చెప్పారు.

పిల్లలపై థర్డ్ వేవ్ ఎఫెక్ట్..?

పిల్లలపై థర్డ్ వేవ్ ఎఫెక్ట్..?

థ‌ర్డ్ వేవ్ పిల్ల‌ల‌పైనే ప్ర‌మాదం అని వైద్యులు చెప్తున్నారని.. ఇలాంటి స‌మ‌యంలో బ‌డులు తెరిచి విద్యార్థుల ప్రాణాల‌తో ఆడుకోవ‌ద్దని షర్మిల సూచించారు. ప్ర‌జ‌లంద‌రికి వ్యాక్సినేష‌న్ పూర్త‌య్యాకే పాఠ‌శాల‌లు తెర‌వాలని హితవు పలికారు. మిగతా నేతలు, రాజకీయ పార్టీలు కూడా ఇదే సూచన చేస్తున్నాయి. మరీ దీనిపై కేసీఆర్ సర్కార్ ఏ విధంగా రిప్లై ఇస్తుందో చూడాలీ మరి.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

స్కూల్ రీ ఓపెన్ అనీ ప్రభుత్వం చెప్పింది. గైడ్ లైన్స్ రూపొందిస్తామని చెబుతున్నారు. పిల్లలు మాస్క్ ధరించడం కంపల్సరీ అనీ.. అలాగే ఫిజికల్ డిస్టన్స్ మెయింటెన్ చేయాలని.. విధిగా శానిటైజ్ చేయాలని పేర్కొన్నది. అన్నీ జాగ్రత్తలు తీసుకుంటూనే ఓపెన్ చేస్తామని భరోసా ఇస్తున్నారు. కానీ జూలైలో తెరచి.. ఆగస్టులో ఫీజు వసూల్ చేసి.. సెప్టెంబర్‌లో థర్డ్ వేవ్ వస్తే.. అక్టోబర్‌లో తిరిగి స్కూల్స్ మూసివేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

English summary
dont open schools 1st july, after vaccination will open schools ys sharmila suggest to telangana government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X