• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సీఎం కేసీఆర్ మనవడికి గాయాలు .. ఆస్పత్రిలో చేరిక .. ఆ వార్తలు నమ్మకండన్న హిమాన్షు రావు

|

తెలంగాణా సీఎం కేసీఆర్ మనవడు , మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షుకు గాయాలయ్యాయి . కాలుజారి పడటంతో హిమాన్షు కాలికి గాయమైనట్టు కొందరు చెప్తుంటే , హార్స్ రైడింగ్ చేస్తుండగా క్రింద పడి గాయాల పాలైనట్టు మరికొందరు పేర్కొన్నట్టు సమాచారం . ప్రస్తుతం గాయాల పాలైన హిమాన్షు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, హిమాన్షు కాలికి గాయం కావటంతో నడవలేకపోతున్న ఆయనను యశోదా ఆస్పత్రికి తీసుకెళ్ళారని వార్తలు వచ్చాయి . నొప్పి కారణంగా నిలబడలేకపోతున్న హిమాన్షును ఆస్పత్రిలో చేర్పించి రాత్రంతా కేటీఆర్ దంపతులు ఆస్పత్రిలోనే ఉన్నారని కూడా ప్రచారం జరిగింది . అయితే ఈ వార్తలను హిమాన్షు రావు ఖండించారు.

 హిమాన్షు కాలికి ఫ్రాక్చర్ .. అదేమీ లేదు ఆరోగ్యంగా ఉన్నానన్న హిమాన్షు

హిమాన్షు కాలికి ఫ్రాక్చర్ .. అదేమీ లేదు ఆరోగ్యంగా ఉన్నానన్న హిమాన్షు

యశోదా ఆస్పత్రి వైద్యులు సీటీ స్కాన్ చేసి తుంటి ప్రాంతంలో, మోకాలికి కొద్దిగా ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించి వైద్యులు చికిత్స చేసి కట్టు కట్టారని , హిమాన్షు ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డారని సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నారు. కానీ అలాంటిదేమీ లేదని చెప్తున్నారు హిమాన్షు రావు. నేరుగా అయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు . తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని పేర్కొన్న హిమాన్షు రావు తన కాలికి పెద్ద ఫ్రాక్ఛర్ అయిందంటూ వస్తున్న వార్తలను బుల్ షిట్ గా అభివర్ణించారు.

రేపటి నుండి పరిగెడతా .. ఆ వార్తలు నమ్మకండన్న హిమాన్షు

రేపటి నుండి పరిగెడతా .. ఆ వార్తలు నమ్మకండన్న హిమాన్షు

చిన్నగా కాలు బెణికిందని పేర్కొన్నారు . తాను నడవగలుగుతున్నానని దానికి ఇంత వార్తలతో సీన్ చేసినట్టు ఆయన వెల్లడించాడు. అంతేకాదు, రేపటినుంచి పరుగెడతా కూడా అంటూ పేర్కొన్నారు . ఇకనైనా తన ఆరోగ్యంపై పుకార్లు పుట్టించే సాహసాలు ఆపండని విజ్ఞప్తి చేశారు . దయచేసి ఇటువంటి సిల్లీ వార్తాపత్రికలను నమ్మవద్దని చెబుతూ ధన్యవాదాలు చెప్పాడు కల్వకుంట్ల హిమాన్షు రావు. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు నేరుగా తానే సమాధానం చెప్పారు .

మనవడిపై కేసీఆర్ కు వల్లమాలిన ప్రేమ

మనవడిపై కేసీఆర్ కు వల్లమాలిన ప్రేమ

హిమాన్షు అంటే సీఎం కేసీఆర్ కు చాలా ప్రేమ .ఆయన పలు సందర్భాలలో మనవడి గురించి బాగా చెప్తుంటారు. కొన్ని సార్లు కేసీఆర్ తనతో పాటు పలు కార్యక్రమాలకు మనవడిని కూడా తీసుకువెళ్తుంటారు. మనవడికి దెబ్బ తగిలి ఆస్పత్రిలో ఉండటంతో కేసీఆర్ ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేసి మనవడి ఆరోగ్య పరిస్థితి అడిగి కూడా తెలుసుకున్నట్టు వార్తలు వచ్చాయి .ఆందోళన చెందవలసిన అవసరం లేదని వైద్యులు కేసీఆర్ కుటుంబానికి సమాచారం ఇచ్చారని కూడా ప్రచారం జరిగింది .

  Hyderabad-Bengaluru Industrial Corridor To Connect AP ఏపీలోని ప్రాంతాలకు కూడా సముచిత స్ధానం...!!
  గతంలో ఇంటర్నేషనల్ లెవల్ లో గోల్డ్ మెడల్ సాధించిన హిమాన్షు రావు

  గతంలో ఇంటర్నేషనల్ లెవల్ లో గోల్డ్ మెడల్ సాధించిన హిమాన్షు రావు

  హిమాన్షు కేసీఆర్ మనవడుగా , కేటీఆర్ తనయుడుగానే కాక తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంటున్నాడు . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎవరికైనా ఎలాంటి సహాయం అయినా కావాలంటే చేస్తున్నాడు . సోషల్ మీడియాలో తండ్రి కేటీఆర్ లా యాక్టివ్ గా ఉంటూ చాలా మందికి సాయం చేస్తూ మంచి వాడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు . హిమాన్షు రావు ఇంటర్నేషనల్ లెవల్ లో గోల్డ్ మెడల్ సాధించారు . డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ సంస్థ గత ఏడాది బెహతర్‌ ఇండియా క్యాంపెయిన్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పర్యావరణ విభాగంలో హైదరాబాద్‌ ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థిగా హిమాన్షు రావు బంగారు పతకం సాధించాడు.

  కేటీఆర్‌ తనయుడు కల్వకుంట్ల హిమాన్షురావు వ్యక్తిగత విభాగంలో 29,482 కిలోల రీసైకిలబుల్‌ వేస్ట్‌ , పునరుత్పాదక వ్యర్ధాలను సేకరించి అగ్రస్థానంలో నిలిచాడు.

  English summary
  CM KCR’s grandson and minister KTR’s son Himanshu has been reportedly injured. Himanshu has an injury to his leg. Due to severe pain he admitted in yashoda hospital .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X