హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ ముసలిదంపతుకు డబుల్ బెడ్ రూం ఇస్తానన్న కేటీఆర్..! హామీ నెరవేరకుండానే వృద్దిడి మరణం..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో అదికారులు అలసత్వానికి ఇదో చక్కని ఉదాహరణ. తనకి డబుల్ బెడ్ రూం నిర్మిస్తానని కేటీఆర్ హామీ ఇవ్వడంతో మురిసిపోయారు ఆ వృద్దదంపతులు. గుడిసెకి 500 ట్యాక్స్ పేరుతో వచ్చిన కథనానికి అప్పట్లో కేటీఆర్ తన ట్విట్టర్ లో స్పందించారు. కేటీఆర్ హామీ ఇచ్చి సంవత్సరం గడిచినా నెరవేరలేదు. ఆ వృద్దుడు సొంతింటి కల నెరవేరకుండానే కళ్లుమూశాడు. బతికున్న ముసలమ్మ బాధలు చూడలేక స్థానికులే రేకులతో షెడ్ నిర్మించి ఇచ్చారు.

కుమ్రంభీం జిల్లా కర్జవెల్లి గ్రామంలో గత సంవత్సరం పంగిడి చీకటి, పంగిడి బాయక్క అనే వృద్ద దంపతుల పూరి గుడిసెకు 500 రూపాయల పన్ను వేశారు అధికారులు. వృద్ద దంపతుల్లో ఒకరికి వస్తున్న పింఛన్ నుండి డబ్బులు కట్ చేసుకున్నారు. దీంతో ఈ వార్త అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశాన్ని అప్పటి మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.. దానికి స్పందించిన కేటీఆర్ అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ వృద్ద దంపతులకి డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు జారీచేశారు.

Double bed room for the elderly couple.!Old man death without implementation.. !!

కేటీఆర్ ఆదేశాలు జారీ చేసి ఏడాది గడిచినా ఆ వృద్ద దంపతులు పూరి గుడిసె మారలేదు. చివరకు డబుల్ బెడ్ రూం ఇంటి కల నేరవేరక ముందే వృద్ధుడైన పంగిడి చీకటి కన్నుమూశాడు. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హామీని కూడా అధికారులు నెరవేర్చకపోవడం బాధాకరమంటున్నారు స్థానికులు. పంగిడి చీకటి మరణంతో ఆయన భార్య బాయక్క ఒంటరైంది.

అదే పూరి గుడిసెలో నివసిస్తుండటంతో.. స్థానికుల మనసు చలించి తలో చేయి వేసి ముసలావిడకి ఓ రేకుల షేడ్ నిర్మించి ఇచ్చారు. రాజకీయ లబ్దికోసమే ఇలాంటి హామీలిచ్చారని.. చిత్తశుద్ధి ఉండి ఉంటే ఇప్పటికే ఆ వృద్ద దంపతులు సంతోషంగా డబుల్ బెడ్ రూం ఇంటిలో ఉండేవారని అంటున్నారు స్థానికులు. స్థానికులు నిర్మించిన రేకుల షెడ్డులో దీనావస్థలో ఉన్న వృద్ధురాలిని ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు గ్రామస్తులు. ఇప్పటికైనా అదికారులు మేల్కొని సమయాను సందర్బంగా వ్యవహరించాలని సామాన్యులు సూచిస్తున్నారు.

English summary
This is a good example of the laziness of the offcials in the state. Ktr promised to build a double bedroom. KTR responded on Twitter to the article titled "500 Taxes for hut." The year of KTR's promise has not been fulfilled. The old man blindfolded his dream.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X