హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌పై సైబర్ దాడి - ఐదు దేశాల్లో స్తంభించిన పని

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రఖ్యాత ఫార్మా దిగ్గజం దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీపై గుర్తుతెలియని దుండగులు సైబర్ దాడులకు పాల్పడ్డారు. సైబర్ అటాక్ ను గుర్తించిన వెంటనే సంస్థ అప్రమత్తమైంది. భారత్ సహా అమెరికా, రష్యా, బ్రిటన్, బ్రెజిల్ దేశాల్లో తన కార్యకలాపాలను, ఉత్పత్తుల్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది.

తను కాదంటే కచ్చితంగా కలిసొస్తది - ఒబామా ఎంట్రీపై ట్రంప్ హ్యాపీ - బైడెన్‌పై చిందులుతను కాదంటే కచ్చితంగా కలిసొస్తది - ఒబామా ఎంట్రీపై ట్రంప్ హ్యాపీ - బైడెన్‌పై చిందులు

సైబర్ దాడి నేపథ్యంలో ఇతర విభాగాలు దీని ప్రభావానికి గురికాకుండా తమ డేటా సెంటర్ సేవలను వేరు చేసినట్టు సంస్థ వెల్లడించింది. దీనిపై ఇప్పటికే వివిధ దేశాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశామని, జాగ్రత్త చర్యల్లో భాగంగా నిలిపేసిన కార్యకలాపాలను, ఉత్పత్తిని 24 గంటల తరువాత పునరుద్ధరిస్తామని సంస్థ వెల్లడించింది. తమ సంస్థపై సైబర్ దాడి జరిగిన విషయమై డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వర్గాలు స్టాక్ ఎక్చేంజ్ కు సమాచారం అందించాయి.

 Dr Reddy’s suffers cyber-attack, isolates all its data center services

భారత్ నుంచి మల్టీ నేషనల్ ఫార్మా కంపెనీగా ఎదిగిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్.. ప్రస్తుతం కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధికి కూడా పనిచేస్తుండటం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ల ప్రయోగాలు హ్యాకింగ్ కు గురవుతోన్న సందర్భాలు వివిధ దేశాల్లో చోటుచేసుకున్న నేపథ్యంలో డాక్టర్ రెడ్డిస్ ల్యాంబ్ పై దాడి చేసిన హ్యాకర్ల లక్ష్యం ఏమై ఉంటుందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

English summary
Pharma major Dr Reddy’s Laboratories has isolated all its data center services across the world after it detected a cyber-attack. "In the wake of a detected cyber-attack, we have isolated all data center services to take required preventive actions," the company said in a regulatory filing on Thursday. Commenting on the development, Mukesh Rathi, CIO, Dr Reddy’s Laboratories said, "We are anticipating all services to be up within 24 hours and we do not foresee any major impact on our operations due to this incident."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X