హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎయిర్‌పోర్టా..? గోల్డెన్ డెనా..? మరోసారి భారీగా పట్టుబడ్డ బంగారం

|
Google Oneindia TeluguNews

శంషాబాద్ ఎయిర్‌పోర్టు, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన విమానాశ్రయం. ఎయిర్‌పోర్టు నిర్మించిన తర్వాత హైదరాబాద్‌తో అనుసంధానం మరింత తేలికైంది. తేలికగా చేరుకోవడం మంచి పరిణామం కాగా.. మరికొందరు దానిని క్యాష్ చేసుకుంటున్నారు. భారీగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం అక్రమ రవాణా పట్టుబడటం కామన్‌గా మారిపోయింది. దీంతో ఇక్కడినుంచే ఎందుకు బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారనే ప్రశ్న తలెత్తింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి అక్రమంగా బంగారం తరలించడం తేలికని స్మగ్లర్లు భావిస్తారు. ఢిల్లీ, చెన్నైలో తనిఖీలు ఎక్కువ ఉన్నందున వారు కూడా హైదరాబాద్ చేరుకొని బంగారం మార్చాలని ప్రయత్నిస్తారు. ఈ విషయాన్ని ఇదివరకు పట్టుబడ్డ ఓ స్మగ్లర్లు స్వయంగా డీఆర్ఐ అధికారులకు తెలియజేయడం అప్పట్లో కలకలం రేపింది. ఇవాళ కూడా శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది.

 dri officials Possession 5 kg gold in three passengers

దుబాయ్ నుంచి వస్తోన్న ముగ్గురు ప్రయాణికులు తమ లగేజీ తీసుకొచ్చారు. అప్పటికే ఉన్న సమాచారంతో ప్రతి ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇంతలో ముగ్గురి లగేజీపై అనుమానం వచ్చింది. ఏంటీ అని నిశీతంగా పరిశీలించగా బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. దాదాపు 5 కిలోల బంగారు బిస్కెట్లు పట్టుబడటంతో డీఆర్ఐ అధికారులే ఖంగుతిన్నారు. ఇంత మొత్తంలో స్మగ్లింగ్ చేస్తున్నారా అని నోరేళ్లబెట్టారు. వారిని అదుపులోకి తీసుకుని బంగారానికి సంబంధించి ప్రశ్నలు వేశారు. తర్వాత బంగారం సీజ్ చేసి కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.

English summary
three passengers came to shamshabad airport. they are travel from dubai to hyderabad. dri officials recovered 5 kg glod in passengers luggage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X