హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవమానించారు: నాగశౌర్యపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాలీవుడ్ హీరో నాగశౌర్య వివాదంలో చిక్కుకున్నారు. నాగశౌర్య, మెహ్రీన్ జంటగా నటించిన అశ్వత్థామ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న విషయం తెలిసిందే. రమణతేజ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా ఇప్పుడు నాగశౌర్యను చిక్కుల్లో పడేసింది.

అవమానించారంటూ ఫిర్యాదు..

అవమానించారంటూ ఫిర్యాదు..


సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా డ్రైవర్ల పట్ల నాగశౌర్య అవమానకరంగా మాట్లాడారని నాగశౌర్యపై కొందరు తెలంగాణ రాష్ట్ర టాక్సీ డ్రైవర్స్ జేఏసీ నేతలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. చదువుకోని కొంతమంది వ్యక్తులు డ్రైవర్ వృత్తిని ఎన్నుకుంటారని, మద్యానికి బానిసై నేరాలకు పాల్పడుతుంటారని వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో వారు పేర్కొన్నారు.

బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ..

బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ..

తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన నాగశౌర్య బహిరంగ క్షమాపణ చెప్పాలని డ్రైవర్ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. కాగా, సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు కథను నాగశౌర్యనే అందించడం గమనార్హం. అంతేగాక, ఈ సినిమాను సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌పై నిర్మించారు. ఆయన తల్లి ఉషా మూల్మూరి నిర్మాతగా వ్యవహరించారు.

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై..

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై..

కాగా, ఓ టీవీ ఇంటర్య్యూలో నాగశౌర్య మాట్లాడుతూ.. చదువుకోకపోవడం వల్లే కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారని.. నేరానికి పాల్పడేవాళ్లలో చదువుకున్నవాళ్లు తక్కువగా ఉంటున్నారని అన్నారు. చదువుకున్న వాళ్లలో నేరాలు చేయకూడదనే భయం ఉంటుందని చెప్పారు. కొందరు బాధ్యతలేని డ్రైవర్లు మద్యం తాగేసి అమ్మాయిలపై దారుణాలకు తెగబడుతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే జేఏసీ నేతలు ఆయనపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. జనవరి 31న విడుదలైన అశ్వత్థామ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో నాగశౌర్య ఈ వివాదంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

English summary
drivers complains to human rights commission on actor naga shourya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X