హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్స్ దందాలో ముదుర్లు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ చేరవేసే బంటీ గ్యాంగ్ .. అమీర్ పేటలో అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ లో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. గోవా నుంచి హైదరాబాద్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న డ్రగ్స్ దందాలో ముదుర్లు అయిన బంటి గ్యాంగ్ ను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు . అమీర్ పేటలో డ్రగ్స్ దందా చేస్తూ ఈ ముఠా పోలీసులకు పట్టుబడింది. వీరి వద్ద పెద్ద ఎత్తున డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులను టార్గెట్ చేసుకొని వారికి బంటీ గ్యాంగ్ ఈ డ్రగ్స్ చేరవేస్తున్నట్లుగా ఎక్సైజ్ పోలీస్ అధికారులు గుర్తించారు.

డ్రగ్స్ రాకెట్ ను పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు .. భారీగా డ్రగ్స్ స్వాధీనం

డ్రగ్స్ రాకెట్ ను పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు .. భారీగా డ్రగ్స్ స్వాధీనం


అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) ఎన్ అంజిరెడ్డి ఈ ముఠాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు . ఆయన మాట్లాడుతూ 46 ఎక్స్టాసీ మాత్రలు, రెండు గ్రాముల ఎండిఎంఎ, 10 గ్రాముల చరాస్, నాలుగు మొబైల్ ఫోన్‌లతో పాటు మాదక ద్రవ్యాల రవాణాకు ఉపయోగించిన కారు, మోటారుబైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు . విశ్వసనీయ సమాచారంతో ఎక్సైజ్ అధికారులు అమీర్‌పేటకు చెందిన బికె గుడా వద్ద ఉన్న ఇంటిపై దాడి చేసి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్స్ దందాలో ఆరితేరిన ముదుర్లు .. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే టార్గెట్

డ్రగ్స్ దందాలో ఆరితేరిన ముదుర్లు .. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే టార్గెట్


డ్రగ్స్ మరియు ఆల్కహాల్ కు బానిస అయిన పిల్లి మనోజ్ కుమార్ అలియాస్ బంటి (31) అనే ప్రైవేట్ ఉద్యోగి కొకైన్, ఎండిఎంఎ, ఎక్స్టసీ మరియు ఇతర మాదకద్రవ్యాలను నగరంలోని వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు అంజిరెడ్డి తెలిపారు. సైదాబాద్‌లోని బక్వర్‌బాగ్‌కు చెందిన జుహైర్ హుస్సేన్ నుంచి కొకైన్‌ను కొనుగోలు చేసినట్లు గతంలోనే అతనిపై ఆరోపణలు ఉన్నాయని అన్నారు . గతంలో కొకైన్‌ను ఆఫ్రికన్ డీలర్ల నుంచి కొనుగోలు చేసి అధిక ధరలకు వినియోగదారులకు విక్రయించారని అంజిరెడ్డి తెలిపారు.

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో సహా ముగ్గురు గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో సహా ముగ్గురు గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు


సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో సహా ముగ్గురు గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు నిందితులు వాడిన టు వీలర్ లను, కార్లను సీజ్ చేశారు. పట్టుబడిన వారిని ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రోహిత్ కోసం ఎక్స్టాసీ మాత్రలు తీసుకురావటానికి గోవా వెళ్లినట్లు బంటీ తెలిపారు. అతను అమీర్‌పేటకు చెందిన జి. నవీన్ రాజ్, ఒక ప్రైవేట్ ఉద్యోగి, మోహిత్ శర్మ అలియాస్ మోంటి మరియు మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి వెళ్లినట్టు పేర్కొన్నారు . ఈ బృందం సోమవారం నగరానికి తిరిగి వచ్చింది.ఈ క్రమంలో వారిని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు వారి వద్ద నుండి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

నగరంలో డ్రగ్స్ దందాపై కూపీ లాగుతున్న ఎక్సైజ్ పోలీసులు

నగరంలో డ్రగ్స్ దందాపై కూపీ లాగుతున్న ఎక్సైజ్ పోలీసులు


బంటీ, నవీన్ మరియు రోహిత్ లను అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు గోవాకు చెందిన కునాల్ షిండే మరియు రఫీ ఇద్దరూ మాదకద్రవ్యాలను బంటీ మరియు నవీన్లకు విక్రయించినట్లు తదుపరి విచారణలో తేలింది. షిండే మరియు రఫీ ఇద్దరూ పరారీలో ఉన్నారు.ఇంకా వీరి దందా నగరంలో ఎక్కడ వరకు విస్తరించింది అన్నదానిపై కూపీ లాగుతున్నారు. వారి వద్ద నుండి డ్రగ్స్ సరఫరా ఎక్కడెక్కడికి జరుగుతుంది.. పెడలర్స్ గా ఎవరెవరు పని చేస్తున్నారు? డ్రగ్స్ వాడకం దారులు ఎవరు ? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

English summary
The Prohibition and Excise department busted a drug racket with the arrest of three persons, including a software engineer.Assistant Excise Superintendent (Enforcement) N Anjireddy said 46 ecstasy pills, two grams of MDMA, 10 gm of charas and four mobile phones along with a car and motorbike that were used in transporting the narcotic substances were seized from the arrested persons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X