హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హోటల్లో డ్రగ్స్ సీజ్, న్యూ ఇయర్ కోసం, దొంగతనాలు కూడా, బంగారం, నగదు స్వాధీనం..

|
Google Oneindia TeluguNews

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ కాలేదు.. సిటీలో మాత్రం డ్రగ్స్ మత్తు గుమ్మంటోంది. కుషాయిగూడలోని ఓ హోటళ్లో డ్రగ్స్ సీజ్ చేశారు. న్యూ ఇయర్ కోసం డ్రగ్స్‌ను హైదరాబాద్ తీసుకొచ్చారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరిపై పీడీ యాక్ట్ కేసు కూడా నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ కాలేదు.. సిటీలో మాత్రం డ్రగ్స్ మత్తు గుమ్మంటోంది. కుషాయిగూడలోని ఓ హోటళ్లో డ్రగ్స్ సీజ్ చేశారు. న్యూ ఇయర్ కోసం డ్రగ్స్‌ను హైదరాబాద్ తీసుకొచ్చారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరిపై పీడీ యాక్ట్ కేసు కూడా నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

మత్తులో..

మత్తులో..

న్యూ ఇయర్ పార్టీ కోసం నిందితులు డ్రగ్స్ తీసుకొచ్చారని పోలీసులు చెప్తున్నారు. డ్రగ్స్‌ను రేవ్ పార్టీలు, పబ్‌లకు సరఫరా చేసే ప్రయత్నించారని పేర్కొన్నారు. సంగల్ల శ్రీకాంత్, సంగల్ల సాయికిరణ్, మహ్మద్ అబ్దుల్ ఆసిఫ్‌లను అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. ఆసిఫ్ మినహా ఇద్దరిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.

దొంగతనం కూడా..

దొంగతనం కూడా..

వీరు దొంగతనాలు కూడా చేశారని పోలీసులు తెలిపారు. జవహర్ నగర్, కీసర ప్రాంతంలో చోరీ చేసినట్టు పేర్కొన్నారు. తొలుత జవహర్ నగర్, కీసరలో రెక్కీ నిర్వహించేవారని, తర్వాత ఎవరూ లేరని నిర్దారించుకొన్న తర్వాత దొంగతనం చేసేవారని తెలిపారు. నిందితుల నుంచి బంగారం, వెండి, యమహా బైక్, రూ.4 వేల నగదు, నాలుగు వేల 300 డాలర్ల క్యాష్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

అనుమానాస్పదంగా..

అనుమానాస్పదంగా..

గురువారం ఉదయం 8 గంటలకు దమ్మాయిగూడెం వద్ద ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించారని పోలీసులు తెలిపారు. వారిని పట్టుకుంటే అసలు విషయం వెలుగుచూసిందని చెప్పారు. శ్రీకాంత్‌ను నేరచరిత్ర ఉందని.. 2017, 2018 సంవత్సరాల్లో కూడా కేసులు రిజిష్టరై ఉన్నాయని చెప్పారు. ఇతని బంధువు సాయికిరణ్ పాత్ర కూడా అందులో ఉందని చెప్పారు. ఆసిఫ్ మాత్రం మూడు కేసుల్లో ఇన్‌వాల్వ్ అయ్యాడని, దానిపై విచారించాల్సి ఉందన్నారు. శ్రీకాంత్, సాయికిరణ్‌పై పీడీ యాక్ట్ పెడతామన్నారు.

English summary
drugs seized in hyderabad hotel, culprit are thieves.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X