హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రంక్ అండ్ డ్రైవ్ : ఒక్క నెలలోనే అన్నీ కేసులా? అంతమందికి జైలుశిక్షా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగిపోతున్నాయి. వీకెండ్ లో మందుబాబుల సందడి అంతా ఇంతా కాదు. కొన్ని ప్రైవేట్ కంపెనీలు శని, ఆదివారాలు సెలవులు ఇస్తుండటంతో శుక్రవారం రాత్రి నుంచే వీకెండ్ సంబరాలకు సిద్ధమవుతున్నారు కొందరు. అలా రెండు, మూడు రోజులు మజా చేయడానికి టైమ్ దొరుకుతుండటంతో మద్యం మత్తులో మునిగితేలుతున్నారు. చివరకు పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిపోతున్నారు.

ఫిబ్రవరి నెలలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా.. 2,972 మందిపై కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మద్యం తాగి పట్టుబడ్డవారిపై కోర్టులో ఛార్జిషీట్లు దాఖలు చేయగా.. 755 మందికి జైలుశిక్షలు ఖరారయ్యాయి. ఆ మేరకు నాంపల్లి 3, 4వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులు తీర్పునిచ్చాయి. వీటికి సంబంధించిన వివరాలను నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ మీడియాకు వెల్లడించారు.

drunk and drive cases increased in febraury prison to 755 members

నిబంధనలు అతిక్రమించిన ఇద్దరు టాప్ మోస్ట్ వ్యక్తులతో పాటు డేంజర్ డ్రైవింగ్ చేసిన మరో వ్యక్తికి 3 రోజుల పాటు జైలుశిక్షలు విధిస్తూ కోర్టులు తీర్పు చెప్పాయని వివరించారు. 25 మంది లైసెన్సులు పూర్తిగా రద్దు చేయడంతో పాటు మరో 154 మంది లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేస్తూ తీర్పులు వచ్చాయని వెల్లడించారు.

English summary
Drunk and Drive Cases Increased In Febraury. 2,972 cases filed and 755 persons sent to jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X