హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మందుబాబుల ఐడియా షాక్.. పోలీసులకు బ్రేక్.. వామ్మో ఇస్మార్ట్ శంకర్లు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తాడిని తన్నేవాడుంటే దాన్ని తలదన్నేవాడుంటాడు అనేది సామెత. డ్రంక్ అండ్ డ్రైవ్‌ పేరుతో చెక్ పెడుతున్న పోలీసులకు దొరక్కుండా తప్పించుకునే మార్గాలు అన్వేషిస్తున్నారు మందుబాబులు. టెక్నాలజీ వాడుతూ మందుబాబులను నిలువరించాలని చూసే ఖాకీలకు ఎదురుగాలి తగులుతోంది. రాత్రింబవళ్లు కాపు కాసి మందుబాబులను పట్టేసి సర్కార్ ఖజానా నింపుదామనుకునే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల ఎత్తుగడకు బ్రేకులు పడుతున్నాయి.

Recommended Video

రోడ్డు మీద మందేసి చిందేసిన నైజీరియన్
ఫింగర్ టిప్స్.. టెక్నాలజీ మాయ

ఫింగర్ టిప్స్.. టెక్నాలజీ మాయ

పెరిగిన టెక్నాలజీతో ఏది కావాలన్నా అంతా ఫింగర్ టిప్స్ మీదే నడుస్తోంది వ్యవహారం. ఆ క్రమంలో మందుబాబులు సైతం టెక్నాలజీని వాడేస్తున్నారు. ఫుల్లుగా తాగి వాహనాలు నడిపితే అడుగడుగునా పోలీసులు పట్టేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్స్ పేరిట ఎక్కడ దొరికితే అక్కడ తనిఖీల పేరుతో దొరకబడుతున్నారు. ఫైన్లు వేయడమే కాదు కోర్టులకు కూడా లాగుతున్నారు. దాంతో పోలీసుల నుంచి తప్పించుకునే కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు మందుబాబులు.

పోలీసుల ఎత్తుగడలకు బ్రేక్ వేస్తున్నారు మందుబాబులు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ల నుంచి తప్పించుకోవడానికి కొత్త రూట్లు వెతుక్కుంటున్నారు. బ్రీత్ ఎనలైజర్‌కు దొరక్కుండా ఇదివరకు నిమ్మరసం లాంటి జ్యూసులు తాగిన మందుబాబులు ఇప్పుడు కొత్త మార్గాల్లో పయనిస్తున్నారు.

గెలిస్తే సీఎం, ఐదేళ్లు కష్టం.. రామనగర కథ.. రాజకీయంలో సెంటిమెంట్లు..!గెలిస్తే సీఎం, ఐదేళ్లు కష్టం.. రామనగర కథ.. రాజకీయంలో సెంటిమెంట్లు..!

మందుబాబులంతా ఏకమై.. సమాచారం పంచుకుంటూ..!

మందుబాబులంతా ఏకమై.. సమాచారం పంచుకుంటూ..!

సరాదాగా మందేసి ఇంటికెళ్లే క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లు మందుబాబుల పాలిట శాపంగా మారాయి. దాంతో మందుబాబులంతా ఏకమయ్యారు. పబ్బుల్లో, రెస్టారెంట్లలో ఫుల్లేసేవారు తమకంటూ ఓ వేదిక క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ క్రమంలో వాట్సాప్ గ్రూపులను వాడేస్తున్నారు. కొందరు సమూహంగా ఏర్పడి గ్రూపులు తయారుచేస్తున్నారు. అలా కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు దొరక్కుండా తప్పించుకోవడానికి ఇప్పటికే చాలా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ అయినట్లు పోలీసుల ద‌ృష్టికి రావడం గమనార్హం.

హైదరాబాద్‌లో వాట్సాప్ సాయంతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకునే ఇస్మార్ట్ శంకర్ల సంఖ్య పెరుగుతోంది. తాము వెళ్లే రూట్లలో ఎవరికైనా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కనపడితే చాలు.. సదరు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. ఫలానా రూట్లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారని మిగతా గ్రూప్ సభ్యులను అలర్ట్ చేస్తున్నారు. దాంతో సదరు మేసేజ్ చూసినోళ్లు ఆ రూట్లలో వెళ్లకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తప్పించుకుంటున్నారు. ఇతర మార్గాల్లో పయనిస్తూ పోలీసుల కళ్లుగప్పుతున్నారు.

కరీంనగర్‌లో మరింత అడ్వాన్స్‌గా.. అప్పట్లో ఏం జరిగిందంటే..!

కరీంనగర్‌లో మరింత అడ్వాన్స్‌గా.. అప్పట్లో ఏం జరిగిందంటే..!

ఇక కరీంనగర్ జిల్లాలో మందుబాబులు మరింత అడ్వాన్స్‌గా ఉన్నారు. పోయిన సంవత్సరమే అక్కడ వాట్సాప్ గ్రూపుల లీలలు బయటపడ్డాయి. మందుబాబులు కలిసి క్రియేట్ చేసుకున్న వాట్సాప్ గ్రూపుల తాలూకు బండారం గుట్టురట్టు చేశారు పోలీసులు. మందుబాబుల న్యూసెన్స్ పెరిగిందనే క్రమంలో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ కెమెరాల సాయంతో మందుబాబుల ఆట కట్టించారు.

అయితే మందుబాబులు రెండు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. పోలీసులు కూడా ధృవీకరించిన సందర్భాలున్నాయి. ఆ వాట్సాప్ గ్రూపులో చేరాలంటే ఒక్కో సభ్యుడు రెండు వేల రూపాయలు చెల్లించాలనే నిబంధన కూడా పెట్టారట అడ్మిన్లు. అంతేకాదు కొన్ని నిబంధనలు కూడా విధించారు. ఆ గ్రూపుల్లో కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సంబంధించిన సమాచారం మాత్రమే పోస్టులు పెట్టాలి. గుడ్ మార్నింగులు, తొక్క తోలు అంటూ గ్రూప్ పేరుకు తగ్గట్లుగా లేని అనవసర పోస్టులు పెడితే రెండు వందల రూపాయల ఫైన్ కూడా విధిస్తారట. ఒకవేళ ఆ ఫైన్ చెల్లించని పక్షంలో సదరు గ్రూప్ సభ్యులను ఎలిమినేట్ చేస్తారట.

అలా అలా "బంగారు తెలంగాణ" రాదు.. ఐపీఎస్ అధికారి బాంబ్.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకేనా..?

వాట్సాప్ గ్రూపులతో హల్‌చల్

వాట్సాప్ గ్రూపులతో హల్‌చల్

అప్పట్లో కరీంనగర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో అక్కడి పోలీసులు ఖుషీగా ఫీలయ్యారు. తమ చర్యల వల్లనే కేసులు తగ్గుముఖం పట్టాయని సంతోషించారు. అయితే అసలు విషయం అర్థం కాక కేసులు ఇంతలా తగ్గిపోవడానికి కారణమేంటని విశ్లేషించే పనిలో పడ్డారు. ఆ క్రమంలో తనిఖీలు మరింత ముమ్మరం చేశారు. అప్పుడు గానీ పోలీసుల అనుమానం నిజం కాలేదు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లు అర్ధరాత్రి వరకు నిర్వహించినా.. మందుబాబులు దొరక్కపోవడంతో చివరకు సైబర్ క్రైమ్ పోలీసులను రంగంలోకి దించారు. దాంతో అసలు విషయం వెలుగుచూసింది. మందుబాబులు వాట్సాప్ గ్రూపులు నిర్వహిస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారనే నిజం బయటపడింది. దాంతో కొందర్ని అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. చూశారా, మనదేశంలో సొల్యూషన్ కంటే ముందే ప్రాబ్లమ్ రెడీగా ఉంటుందనడానికి ఇదే పెద్ద నిదర్శనమేమో.

English summary
Drunkers choosing smart ways with whatsapp to escape from drunk and drive checks. They forming whatsapp groups to share information about drunk and drive checkings while whom went on that way. Then drunkers alert, and went to home in other ways.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X