హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హరీశ్‌కు కేసీఆర్ ఆల్టిమేటం! ఫాంహౌస్‌లో ఓట్లు లెక్కిస్తారా?: విజయశాంతి ఫైర్, కాంగ్రెస్‌లోనే..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దుబ్బాక ఉపఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దుబ్బాక ఉపఎన్నికలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ కూడా రాదని ఆర్థిక మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు.

 విజయశాంతి చూపు బీజేపీ వైపు: కేంద్రమంత్రితో భేటీ, త్వరలోనే కమల దళంలో చేరిక? విజయశాంతి చూపు బీజేపీ వైపు: కేంద్రమంత్రితో భేటీ, త్వరలోనే కమల దళంలో చేరిక?

అధికార పార్టీ అరాచకాలు..

అధికార పార్టీ అరాచకాలు..

‘హరీశ్ రావు వ్యాఖ్యలను బట్టి బట్టి ఎన్నికలకు ముందే ఫలితాలు ఏ విధంగా ఉండాలో టిఆర్ఎస్ పార్టీ నిర్ణయించే స్థాయికి వెళ్లి పోయిందంటే... అధికార పార్టీ అరాచకాలపై దుబ్బాక ఓటర్లకు స్పష్టత వచ్చి ఉంటుంది' అని విజయశాంతి వ్యాఖ్యానించారు.

కేసీఆర్ ఫాంహౌస్‌లో ఓట్ల లెక్కింపు?

కేసీఆర్ ఫాంహౌస్‌లో ఓట్ల లెక్కింపు?

అంతేగాక, ‘హరీష్ రావు కామెంట్ చూస్తూ ఉంటే... దుబ్బాక‌లో పోలింగ్ జరిగిన తర్వాత... కెసిఆర్ గారి ఫామ్ హౌస్‌లో ఈవీఎం మిషన్లను పెట్టి, ఓట్లను లెక్కిస్తారో ఏమో? అనే అనుమానం కలుగుతోంది. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే మరణించడంతో జరిగే ఉప ఎన్నిక విషయంలో టిఆర్ఎస్ పార్టీ... ముఖ్యంగా హరీష్ రావు ఎందుకు ఇంత హైరానా పడుతున్నారో ఎవరికి అంతుబట్టడం లేదు' అని విజయశాంతి అన్నారు.

హరీశ్ రావుకు కేసీఆర్ ఆల్టిమేటం..

హరీశ్ రావుకు కేసీఆర్ ఆల్టిమేటం..

‘కాంగ్రెస్, బిజెపిలకు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఉప ఎన్నికలో ఎక్కువ ఓట్లు వస్తే.. దాని ప్రభావం హరీష్ రావు మంత్రి పదవి మీద పడుతుందని సీఎం కెసిఆర్ ఏదన్నా అల్టిమేటం జారీ చేశారా? అన్న చర్చ కూడా జరుగుతోంది. అందుకే తెలంగాణ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మెదక్ జిల్లాకు కేటాయించిన నిధుల కంటే... దుబ్బాకలో ఓటర్లను కొనేందుకు ఖర్చు చేస్తున్న డబ్బు ఎక్కువగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు' తీవ్ర విమర్శలు చేశారు.

Recommended Video

కేసీఆర్ కు గట్టిఎదురుదెబ్బన్నవిజయశాంతి || Oneindia Telugu
కాంగ్రెస్ పార్టీలోనే విజయశాంతి..

కాంగ్రెస్ పార్టీలోనే విజయశాంతి..

మరోవైపు, తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ చైర్సన్ విజయశాంతి పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ పార్టీ స్పష్టతనిచ్చింది. విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ తెలిపారు. బుధవారం విజయశాంతితో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. విజయశాంతికి రాహుల్, సోనియా గాంధీలంటే ఎంతో గౌరవమని చెప్పారు. కరోనా కారణంగానే ఆమె ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని తెలిపారు. విజయశాంతి అంటే తమకు ఎంతో గౌరవమని, కరోనా కారణంగానే కొత్త ఇంఛార్జీని ఆమె కలవలేకపోయారని చెప్పారు. కాగా, సోమవారం విజయశాంతి నివాసానికి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. సుమారు గంటపాటు చర్చలు జరిపిన నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరతారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

English summary
dubbaka bypoll: vijayashanthi slams harish rao for his comments on congress and bjp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X