నన్ను టీఆర్ఎస్ నేతలే గెలిపించారు : గ్రేటర్ ఎన్నికల సమయంలో దుబ్బాక ఎమ్మెల్యే సంచలనం
దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపించింది టిఆర్ఎస్ పార్టీ నేతలే అంటూ ఆయన పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లోనూ విజయం తమదే అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి హరీష్ రావు విశ్రాంతి లేకుండా ప్రచారం చేసినప్పటికీ టిఆర్ఎస్ పార్టీ ఓటమి పాలయింది . బీజేపీ నుంచి బరిలోకి దిగిన రఘునందన్ రావు విజయం సాధించారు. అయితే తన విజయం వెనక టీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది.
ఎమ్మెల్యేగా రఘునందన్ అసెంబ్లీలో .. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు శాసనమండలిలో ప్రమాణ స్వీకారం

టీఆర్ ఎస్ నేతలు తనకు సహకరించారన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
తెలంగాణ ఉద్యమంలో అనేక మందితో కలిసి పని చేశానని, అయితే గతంలో తమతో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారంతా రఘునందన్ రావు కు ఓటేస్తే తప్పేంటి అన్న ఆలోచనలో టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా తనకు సహకరించారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రఘునందన్ రావు. గతంలో పోటీ చేసి ఓటమి పాలయ్యానన్న ఆయన ఈసారి దుబ్బాక ప్రజలు ఆశీర్వదించారని పేర్కొన్నారు. గతంలో టీఆర్ఎస్ లో పనిచేసిన తనను టిఆర్ఎస్ నుంచి బయటకు పంపించారో ఇప్పటికీ సమాధానం లేదని చెప్పిన ఆయన టిఆర్ఎస్ పార్టీ నుండి ఇకముందు కూడా సమాధానం వస్తుందని అనుకోవడం లేదు అంటూ వ్యాఖ్యానించారు.

గ్రేటర్ ఎన్నికలకు ప్రణాళిక రెడీ .. టీఆర్ఎస్ కు చుక్కలే
బీజేపీలో చేరిన తనను పార్టీ ఆదరించిందని, తనకు అవకాశం ఇచ్చిందని, దుబ్బాక విజయం బీజేపీ దేనని రఘునందన్ రావు పేర్కొన్నారు.
రఘునందన్ ను, బిజెపిని వేరుగా చూడాల్సిన అవసరం లేదన్న దుబ్బాక ఎమ్మెల్యే తమ నియోజకవర్గం కోసం సామరస్యంగా ముందు మాట్లాడతానని, అవసరం అనుకుంటే కొట్లాడి అయినా సాధిస్తానని చెప్పుకొచ్చారు. గ్రేటర్ ఎన్నికలను ఎదుర్కోవడానికి తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయని పేర్కొన్నారు రఘునందన్ రావు. టీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపిస్తామని అన్నారు .

దుబ్బాక ఫలితమే జీహెచ్ఎంసీలో రిపీట్
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కావలసిన స్ఫూర్తిని స్తోందని పేర్కొన్నారు. దుబ్బాక ఫలితమే జిహెచ్ఎంసి ఎన్నికలలో పునరావృతం అవుతుందని రఘునందన్ రావు స్పష్టం చేశారు.
టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తి వాదులంతా తమ పార్టీలోకి రావాలని రఘునందన్ రావు కోరారు. టిఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను గట్టి షాక్ ఇవ్వాలని ఆయన తెలిపారు. మొత్తానికి దుబ్బాక ఎన్నికల ఫలితం తర్వాత దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీకి తన వ్యాఖ్యలతో టెన్షన్ పుట్టిస్తున్నారు.