హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణా మున్సిపోల్స్ కు రంగం సిద్ధం .. రెండు దశల్లో ఎన్నికల నిర్వహణపై కసరత్తు !!

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. సోమవారం నాడు షెడ్యూల్ విడుదల చేయడానికి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది . తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఇటీవల హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. అయితే ఈసారి ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. కోర్టు సమస్యలు లేని మున్సిపాలిటీలకు మొదటి దశ ఎన్నికలు నిర్వహించి, కోర్టు విచారణలో ఉన్న మున్సిపాలిటీలకు రెండో దశ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.

మున్సిపల్ ఎన్నికలపై నేడు హైకోర్టులో కొనసాగనున్న విచారణ .. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠమున్సిపల్ ఎన్నికలపై నేడు హైకోర్టులో కొనసాగనున్న విచారణ .. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

తొలిదశలో మున్సిపాలిలీట రిజర్వేషన్ల కసరత్తును సర్కారు ఇప్పటికే పూర్తి చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక ఆయా వార్డుల రిజర్వేషన్ల డ్రా నిర్వహించనున్నారు. మొదటి మున్సిపల్ ఎన్నికలను ఆగస్టు నెలలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అక్రమాలు వెలుగుచూశాయి అని కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి.

EC Prepared For elections in two phases in Telangana Municipalities !!

ఇక తాజాగా ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడంలేదని దాఖలైన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వాటిని కొట్టివేస్తూ తీర్పు వెలువరించడం తో మున్సిపల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అయింది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. నవంబర్ లో ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ కూడా స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు జారీ చేయగా, అధికారులు సైతం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దీంతో ఈ నెలలో మున్సి పోల్స్ కు నోటిఫికేషన్ రానున్నట్లు గా సమాచారం.

English summary
The field is ready for municipal elections in Telangana. The schedule is expected to be released on Monday. Municipal elections are expected to be organized in two phases across the state. Municipalities that are under court hearings are expected to hold a second phase of elections for municipalities . The government has already completed the reservation exercise of the first municipalities. The draw of the reservation of the wards will be held once the notification is issued.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X